India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బతికి ఉన్న వారిలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరున్న మరియా బ్రన్యాస్ మోరేరా మృతి చెందారు. అమెరికాలో జన్మించిన మరియా 117 సంవత్సరాల 168 రోజులు బతికారు. ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈమె మరణంతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా జపాన్‌కు చెందిన టొమికా ఇటూకా(116ఏళ్లు) నిలిచారు.
AP: ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 12 ఈవీఎంల్లో ఓట్లను రీ కౌంటింగ్ చేయాలన్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈవీఎంలలో పోలైన వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలని ఆయన న్యాయవాదులు కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని వాదించారు. దీనిపై తదుపరి విచారణను బుధవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై జస్టిస్ హేమ కమిటీ <<13900479>>నివేదికను<<>> సీరియస్‌గా తీసుకుంటామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ట్రైబ్యునల్, సినిమా చట్టాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా హేమ కమిటీ నివేదిక ఇచ్చి నాలుగేళ్లవుతున్నా చర్యలు లేవన్న ప్రతిపక్షాల విమర్శలపై CM ప్రెస్‌మీట్ నిర్వహించారు.
సీనియర్ సిటిజన్లతో పోలిస్తే యువత పెట్టుబడులపై భిన్నంగా ఆలోచిస్తోందని SBI రీసెర్చ్ తెలిపింది. FDల్లో 47% వృద్ధులవేనని పేర్కొంది. రిస్క్ ఉన్నా అధిక రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీకే యువత మొగ్గు చూపుతోందని వెల్లడించింది. క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సగటు వయసు 32 ఏళ్లకు తగ్గిందని, అందులో 40% మంది 30 ఏళ్లలోపు వారేనంది. 2014లో 4 కోట్లుగా ఉన్న MF హోల్డర్లు 2024కు 19 కోట్లకు చేరారని పేర్కొంది.
AP: ప్రజలతో అన్న క్యాంటీన్ల నిర్వహణ జరిగితే చాలా బాగుంటుందని ఉండి MLA రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ప్రజల సహకారంతో ప్రభుత్వంపై భారం లేకుండా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు చెప్పిన దాని కంటే ఎక్కువగానే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారన్నారు. గత YCP ప్రభుత్వం AP ఆర్థిక వ్యవస్థను చింపిన విస్తరిలా చేసిందని దుయ్యబట్టారు.
మలయాళ చిత్రసీమలో మహిళలను వేధించడంపై జస్టిస్ హేమా కమిటీ GOVTకి అందించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు తనను లైంగికంగా వేధించిన హీరోతో హగ్ సీన్ చేసేందుకు ఓ నటి ఇబ్బంది పడ్డారని, 17 టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇండస్ట్రీని ఓ మాఫియా కంట్రోల్ చేస్తోందని, సినిమా ఛాన్సు కావాలంటే తమ లైంగిక వాంఛలు తీర్చాలంటూ నటీమణులపై ఒత్తిళ్లున్నాయని పేర్కొంది.
AP: సెప్టెంబర్‌లో యూకే వెళ్లేందుకు అనుమతి కోరిన మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. అటు సెప్టెంబర్, అక్టోబర్‌లో యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం పిటిషన్ వేశారు. విచారణను సీబీఐ కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.
పాకిస్థాన్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు ఆమడ దూరంలో ఉన్నాయని PCB ఛైర్మన్ మోహిసిన్ నఖ్వీ అంగీకరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లోపు వీటిని పునరుద్ధరించడం సులభమేమీ కాదన్నారు. ‘ఒక్క స్టేడియమైనా అంతర్జాతీయ స్థాయికి తగినట్టు లేదు. సీట్లు లేవు. బాత్రూమ్‌లు లేవు. అర కిలోమీటర్ దూరం నుంచి మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్. గఢాపీ స్టేడియాన్ని కీలక మ్యాచులకు సిద్ధం చేస్తాం’ అని ఆయన అన్నారు.
AP: ప్రముఖ ఐటీ సంస్థ HCL రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించనుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దీని ద్వారా 15,000 ఉద్యోగాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు HCL కంపెనీ ప్రతినిధులతో భేటీ అయినట్లు Xలో ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు ఆ సంస్థకు అందిస్తామని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో HCL ఏపీలో తమ సంస్థను నెలకొల్పి 4,500 మందికి ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు.
TG: ఇటీవల BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి క్యాబినెట్ హోదా దక్కింది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారాన్ని ప్రభుత్వం నియమించింది. గత బీఆర్ఎస్ హయాంలో పోచారం వ్యవసాయశాఖ మంత్రిగా పని చేశారు.
Sorry, no posts matched your criteria.