India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IPL మెగా వేలంలో ఫ్రాంచైజీ తనను కొనగానే టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ‘హలో ఐ యామ్ కోహ్లీ’ అంటూ మెసేజ్ చేసి అభినందించారని RCB కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపారు. అదే తన జీవితంలో బెస్ట్ మూమెంట్ అని పేర్కొన్నారు. ఆ క్షణంలో తాను అన్నీ సాధించినట్లు ఫీల్ అయ్యానని చెప్పారు. తానెప్పుడూ RCBకి ఆడాలని తహతహలాడుతుంటానని చెప్పారు. కాగా తమ జట్టు కెప్టెన్‌గా RCB పాటిదార్‌ను నియమించిన విషయం తెలిసిందే.

ఎట్టకేలకు నష్టాలకు తెరపడింది. స్టాక్‌మార్కెట్లు నేడు లాభపడ్డాయి. ఉదయం 180 Pts పతనమైన నిఫ్టీ 22,959 (+30), 600 pts కోల్పోయిన సెన్సెక్స్ 75,996 (+57) వద్ద ముగిశాయి. ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. M&M, ఎయిర్‌టెల్, ఇన్ఫీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ లూజర్స్.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ఈమేరకు రేపు సౌదీఅరేబియాలో అమెరికా, రష్యా ప్రతినిధులు భేటీ కానున్నారు. యుద్ధం ముగింపుతో పాటు ఇరు దేశాల సంబంధాలపైనా చర్చించనున్నారు. మరోవైపు బైడెన్ హయాంలో ఉక్రెయిన్‌కు US నుంచి సాయం అందగా ట్రంప్ అధికారంలోకి రాగానే నిలిచిపోయింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈయూ దేశాల సాయం కోరుతున్నారు.

TG: BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో బిల్లును ప్రవేశపెడతామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ప్రధాని మోదీని ఒప్పించి ఆ బిల్లును 9వ షెడ్యూల్‌లో పెట్టించే దమ్ము బండి సంజయ్‌కు ఉందా? అని సవాల్ విసిరారు. అలాగే దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని ఆయన ప్రధానిని అడగగలరా? అని నిలదీశారు. బీసీల్లో ఐక్యత లోపించిందని, వారంతా ఏకతాటిపైకి రావాలని మహేశ్ పిలుపునిచ్చారు.

ఖరీదైన కారుకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉండాలని చాలా మందికి ఉంటుంది. దానికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు కొందరు వెనకాడరు. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా HK$14.2 మిలియన్లు (రూ.15.83 కోట్లు) పెట్టి అరుదైన సింగిల్-లెటర్ రిజిస్ట్రేషన్ మార్క్ ‘S’ను కొనుగోలు చేశారు. ఇది హాంకాంగ్ దేశంలో రవాణా శాఖ నిర్వహించిన వేలంలో జరిగింది. అలాగే ‘88’ అనే నంబర్ ప్లేట్‌ను HK$11 మిలియన్లకు (రూ.12 కోట్లు) మరో వ్యక్తి దక్కించుకున్నారు.

AP: విశాఖపట్నం కేజీహెచ్‌లో GBSతో ఓ మహిళ మృతి చెందిందన్న ప్రచారాన్ని ఆసుపత్రి సూపరింటెండ్ శివానందం కొట్టిపారేశారు. ఇప్పటివరకు ఐదు అనుమానిత కేసులు నమోదయ్యాయని, ఎవరూ మరణించలేదని చెప్పారు. ఇది అంటువ్యాధి కాదని వెల్లడించారు. కాగా ఛాతిలో నొప్పితో ఎల్.కోట మండలం మల్లివీడుకు చెందిన రేణుకా మహంతి ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వార్తలొచ్చాయి.

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. కొత్త కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లను పరిశీలించారు.

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేస్తారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ క్లార్క్ జోస్యం చెప్పారు. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆయన తిరిగి ఫామ్‌లోకి వచ్చారని చెప్పారు. మరోవైపు ENG ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్లు తీస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్‌లో జోఫ్రాను ఎదుర్కోవడం కష్టమేనని తెలిపారు. అయితే ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్తుందన్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలను ‘బర్డ్ ఫ్లూ’ భయం వెంటాడుతోంది. కొంతకాలం చికెన్ తినకపోవడమే బెటర్ అని చాలామంది దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం చికెన్ దుకాణాలపైనే కాకుండా ఫుడ్ డెలివరీ సంస్థలపైనా పడింది. జొమాటో, స్విగ్గీ తదితర యాప్స్‌లో చికెన్ ఐటమ్స్ ఆర్డర్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బదులుగా ఫిష్, మటన్ వంటకాలు ఆర్డర్ చేస్తున్నారు. అటు చికెన్ ఆర్డర్లు లేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ వెలవెలబోతున్నాయి.

AP: రాజమండ్రి దివాన్‌చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్‌లోని కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. వ్యాపారులు వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.