India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రార్థనా స్థలాల చట్టం కేసుపై కుప్పలు తెప్పలుగా కొత్త పిటిషన్లు రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ముగ్గురు సభ్యుల బెంచ్ వాదనలు వినడంతో ఇద్దరితో కూడిన తమ బెంచ్ పెండింగ్ పిటిషన్లను తీసుకోబోదని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘పిటిషన్లు వేయడానికీ ఓ పరిమితి ఉంటుంది. తాజాగా మరిన్ని వచ్చాయి. వాటిని మేం స్వీకరించలేం. మార్చిలో కొత్త తేదీ ఇస్తాం’ అని తెలిపారు.

TG: జనాభా ప్రకారం BCలకు రిజర్వేషన్లు కల్పించాలని కులగణన చేపట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లిలో పట్టభద్రుల MLC అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో ఆయన మాట్లాడారు. BC రిజర్వేషన్ల కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో మిగతా అన్ని మ్యాచుల్లాగానే IND-PAK పోరు ఉంటుందని హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఈ మ్యాచ్‌పై ఓవర్‌హైప్ నెలకొందని తెలిపారు. ‘భారత్ పటిష్ఠమైన జట్టు. పాకిస్థాన్ నిలకడలేమితో ఉంది. ఐసీసీ టోర్నీల్లో రెండు టీమ్‌ల నంబర్లను పోల్చి చూస్తే మీకే అర్థమవుతుంది’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవల సొంత గడ్డపై జరిగిన ట్రైసిరీస్(PAK-NZ-SA)లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

AP: గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని A, B, C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, నిన్న మూడో రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.

బీసీసీఐ టీమ్ఇండియాకు పెట్టిన షరతులు కోహ్లీకి ఇబ్బందికరంగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఫ్యామిలీ, వ్యక్తిగత సిబ్బందికి బోర్డ్ నో చెప్పింది. దీంతో కోహ్లీ తన చెఫ్‌ను వెంట తీసుకెళ్లలేకపోయారు. డైట్ విషయంలో చాలా కఠినంగా ఉండే విరాట్‌కి అక్కడి ఫుడ్ తినటం ఇబ్బందిగా మారిందట. దీంతో మేనేజర్‌తో తనకు కావాల్సిన ఆహారాన్ని ఓ ఫేమస్ ఫుడ్ పాయింట్ నుంచి తెప్పించుకొని తింటున్నారని సమాచారం.

TG: ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండికొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

పాకిస్థాన్ పౌరుడు అలీ తాఖీర్ షేక్‌పై అస్సాంలో FIR నమోదైంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్‌తో అతడు కాంటాక్టులో ఉన్నాడని సమాచారం. ఢిల్లీ అల్లర్లపై గౌరవ్ ఇచ్చిన స్పీచ్‌కు అతడు సంబరపడ్డాడని తెలిసింది. గౌరవ్, ఎలిజబెత్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలపై అస్సాం క్యాబినెట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే పని మొదలు పెట్టిన సీఐడీ నేడు ఒకరిపై FIR నమోదు చేయడం గమనార్హం.

APలో GBS <<15485860>>కేసులు <<>>భారీగా పెరుగుతుండటంపై ఆందోళన నెలకొంది. దీంతో గిలియన్ బార్ సిండ్రోమ్ వ్యాధిపై తన నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి సత్యకుమార్, అధికారులతో కలిసి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు.

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. గురువారం సాయంత్రం 4:30కు ప్రధాని మోదీ, HM అమిత్ షా, కేంద్ర మంత్రుల సమక్షంలో రామ్‌లీలా మైదానంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. మంత్రివర్గమూ అదే రోజు ప్రమాణం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ, రేఖా గుప్తా, ఆశీశ్ సూద్ ముందు వరుసలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.