News August 19, 2024

సీఎంను అవమానించిన 11 మందిపై కేసు

image

TG: సీఎం రేవంత్ రెడ్డిని అవమానిస్తూ ఆదిలాబాద్(D) రుయ్యాడిలో ఆందోళన చేసిన 11 మంది బీఆర్ఎస్ నాయకులు, రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రుణమాఫీ అమలు కాలేదంటూ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. సీఎం శవయాత్ర పేరిట నిరసన చేపట్టారు. దీంతో సీఎంను కించపరిచేలా వ్యవహరించడం అప్రజాస్వామికమని వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాగే కొనసాగితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

News August 19, 2024

RTV, రవిప్రకాశ్‌కు BRS లీగల్ నోటీసులు

image

TG: బీజేపీలో BRS విలీనం కాబోతోందంటూ కథనాన్ని ప్రసారం చేసిన RTV, ఆ ఛానల్ చీఫ్ రవిప్రకాశ్‌కు BRS లీగల్ నోటీసులు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా BRS, KCRపై తప్పుడు వార్తలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆ తప్పుడు కథనాల లింకులను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News August 19, 2024

BIG ALERT.. ఇవాళ భారీ వర్షాలు

image

AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు TGలోని ADB, మంచిర్యాల, సిరిసిల్ల, KRMR, ములుగు, భద్రాద్రి, WL, జనగామ, HYD, MDK సహా మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

News August 19, 2024

రక్షాబంధన్: మీ అక్కాచెల్లెళ్లకు ఈ గిఫ్ట్స్ ట్రై చేయండి!

image

*స్మార్ట్ వాచ్: హెల్త్ ట్రాకర్ సహా ఎన్నో ఫీచర్స్ ఉంటాయి.
*మొక్కలు: ఓ ఇండోర్ ప్లాంట్ ఇచ్చి ఆశ్చర్యపర్చండి. పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుంది.
*బంగారం: ఇయర్ రింగ్స్, చైన్, రింగ్స్ బహుమతిగా ఇస్తే ఎప్పటికీ గుర్తుంటుంది.
*హెల్త్ ఇన్సూరెన్స్: అత్యవసర సమయాల్లో ఇది ఆర్థిక భద్రతను ఇస్తుంది. మెడికల్ బిల్లుల బాధ తప్పుతుంది.
*ఫిక్స్‌డ్ డిపాజిట్: వడ్డీతో అవసరాలకు డబ్బు వాడుకోవచ్చు.

News August 19, 2024

నేడు శ్రీసిటీకి సీఎం చంద్రబాబు

image

AP: CM చంద్రబాబు తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో నేడు పలు పరిశ్రమలను ప్రారంభించనున్నారు. సీఎంవో వివరాల ప్రకారం ఉండవల్లి నుంచి ఉ.10 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీసిటీకి చేరుకుని పలు పరిశ్రమల్ని ప్రారంభిస్తారు. 7 కొత్త సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అనంతరం మధ్యాహ్నం నెల్లూరులోని సోమశిలకు చేరుకుని జలాశయాన్ని పరిశీలిస్తారు.

News August 19, 2024

రాఖీకి సాధారణ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి

image

TG: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో కొన్ని స్కూళ్లు సెలవు ఇవ్వగా, మరికొన్ని హాలిడే ఇవ్వలేదు. బాలికలు, ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే రాఖీపండుగకు సాధారణ సెలవు ప్రకటించాలని గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే కూడా లేదు.

News August 19, 2024

ఇవాళ్టి నుంచి ఒంగోలు నియోజకవర్గం ఈవీఎంల రీ వెరిఫికేషన్

image

AP: ఇవాళ నుంచి ఈనెల 24 వరకు ఒంగోలు నియోజకవర్గ ఈవీఎంల రీ వెరిఫికేషన్ జరగనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈసీఐని ఆశ్రయించారు. 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ చేయాలంటూ రూ.5.66లక్షలు చెల్లించారు. ఈసీఐ ఆదేశాలతో అధికారులు 6 రోజులపాటు రీ వెరిఫికేషన్ చేయనున్నారు.

News August 19, 2024

అన్న క్యాంటీన్ల నిర్వహణకు గంగరాజు రూ.కోటి విరాళం

image

AP: బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం భారీ విరాళాన్ని అందించారు. మంత్రి లోకేశ్‌ను ఆదివారం కలిసిన ఆయన రూ. కోటి చెక్కును అందించారు. క్యాంటీన్ల నిర్వహణ సాఫీగా సాగేందుకు ప్రతి ఒక్కరు తమకు తోచినంత విరాళాన్ని అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే పలువురు భారీ విరాళాల్ని అందిస్తున్నారు.

News August 19, 2024

వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్?

image

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సర్కారు వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది. ఈమేరకు కసరత్తు చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 19 నుంచి 22 వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశం కానుందని తెలిపాయి. నెలాఖరులోపు బడ్జెట్ అంచనాలను పంపించాలని అన్ని శాఖలకు సూచించిందని వెల్లడించాయి.

News August 19, 2024

తోబుట్టువుల బంధానికి రక్ష ‘రక్షాబంధన్’

image

నేడు రక్షాబంధన్. తోబుట్టువుల మధ్య బంధాన్ని మరింత బలపరిచే రాఖీ పౌర్ణమిని ఒకప్పుడు ఉత్తరాదిలో మాత్రమే జరిపేవారు. కాలక్రమేణా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. సోదరుడు బాగుండాలని సోదరి ఆకాంక్షిస్తుంది. ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటానని సోదరుడు భరోసా ఇస్తాడు. ఇదే రక్షాబంధన్. తోబుట్టువులతో ప్రేమగా మెలగాలని, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలని సూచిస్తుంది రాఖీ పండుగ.