India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని, రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా ఎంతో చేయాలని ఉందని, కానీ గల్లా పెట్టె సహకరించడం లేదన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ జరుగుతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఓ ఫొటో పంచుకోగా వైరలవుతోంది. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిరును షూటింగ్ సెట్స్‌లో కలవగా.. మరో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. నుదిటిపై బొట్టుతో ఇంద్రసేనా రెడ్డిలా కనిపించారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

రోహిత్, విరాట్, జడేజాకు ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి ICC ఈవెంట్ అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. బరువెక్కిన హృదయంతో తాను ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. తరచూ వస్తున్న రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో వీరు 2027 వన్డే WC వరకు కొనసాగకపోవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది టీ20 WC ఉన్నా రోహిత్, కోహ్లీ, జడేజా ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని చోప్రా గుర్తు చేశారు.

AP: పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేందుకు నెలలో ఓరోజు కేటాయించాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదని కందుకూరు సభలో చెప్పారు. చెత్త పన్ను వేసిన గత చెత్త ప్రభుత్వం దాన్ని తొలగించలేదని మండిపడ్డారు. ప్రస్తుతం చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. OCT 2 నాటికి 85 లక్షల మె.టన్నుల చెత్తను తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించామన్నారు.

AP: రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై CM చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరులో మాట్లాడుతూ ‘ఇటీవలే గుర్రంకొండలో యువతిని ఒకడు పొడిచేశాడు. పైగా ఇద్దరూ కలిసి విషం తాగినట్లు డ్రామా చేశాడు. మొన్న గుంటూరులో ఒకడు ఇద్దరిపై అత్యాచారం చేసి జైలుకెళ్లాడు. బయటికొచ్చి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంకోచోట ఆరేళ్ల బాలికను 75ఏళ్ల వృద్ధుడు రేప్ చేశాడు. ఈ మానవ మృగాలను కఠినంగా శిక్షిస్తాం’ అని హెచ్చరించారు.

TG: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. మెదక్‌లోని గద్వాల్‌లో నిర్వహించనున్న ఎస్సీ వర్గీకరణ సభతో పాటు సూర్యాపేటలో జరిగే కులగణన సభకు రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో స్థానిక సంస్థల సమాయత్తం, పాలనాపరమైన అంశాలు, మంత్రివర్గ విస్తరణ ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రానుంది. ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలో నటించిన ‘రేఖా చిత్రం’ మార్చి 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. కేవలం రూ.9కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న విడుదలై దాదాపు రూ.55 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీకి జోఫిన్ టి.చాకో దర్శకత్వం వహించారు.

ఇతరుల ప్రతిభతో పోల్చుకుని మనల్ని తక్కువ చేసుకోరాదని ఎవరి ప్రతిభ వారికే ప్రత్యేకమని సద్గురు జగ్గీవాసుదేవ్ తెలిపారు. ‘పరీక్షా పే చర్చ’లో భాగంగా స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వినియోగం పై విద్యార్థులకు సూచనలిచ్చారు. పరీక్ష ఫలితాలనేవి పై చదువులకు అర్హతలుగానే భావించాలని వాటి గురించి అతిగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇంటర్నెట్‌ను సరిగ్గా వినియోగిస్తే సమాచార సేకరణకు ఎంతో ఉపయోగకరమన్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీలో నటించేందుకు తాను అప్లై చేసుకున్నానంటూ హీరో మంచు విష్ణు తెలిపారు. ‘స్పిరిట్’ టీమ్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి నటుడు బ్రహ్మాజీ సైతం అప్లై చేసినట్లు రిప్లై ఇవ్వడంతో ఈ చిత్రం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. కాగా విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే

TG: డ్రగ్స్, న్యూడ్ వీడియోల కేసులో అరెస్టైన మస్తాన్ సాయికి కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ్టితో మస్తాన్ కస్టడీ ముగియనుండగా పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. డ్రగ్స్ పార్టీ, న్యూడ్ వీడియోలు తీయాల్సిన అవసరంపై కస్టడీలో ప్రశ్నించినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.