News November 18, 2024

స్కూటీపై 8 మంది.. ప్రాణాలతో చెలగాటం

image

AP: గుంటూరు (D) మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద ఓ స్కూటీపై 8 మంది ప్రయాణిస్తూ కెమెరాకు చిక్కారు. ముందు వైపు ముగ్గురు, వెనక నలుగురితో ప్రయాణించాడు. ఇది ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని, ఆ వ్యక్తికి కామన్ సెన్స్ ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారని, హెల్మెట్ కూడా లేదని ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటని నిలదీస్తున్నారు. ఇతనికి ఎంత ఫైన్ వేయాలి? అని మండిపడుతున్నారు.

News November 18, 2024

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. అంతా క్షేమం

image

TG: గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో జయశ్రీ అనే మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఓ ఆడ, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా ఇటీవల ఏపీలోని కాకినాడ జీజీహెచ్‌లోనూ తపస్విని అనే మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఇద్దరు ఆడ, ఓ మగ శిశువులు ఉన్నారు.

News November 18, 2024

‘బరి తెగించిపోతున్నాడు’ అంటే?

image

ఎవరైనా హద్దుమీరి మాట్లాడినా, చెప్పిన మాటలను లెక్కచేయకున్నా.. బరితెగించి పోతున్నాడు అంటాం. అసలు బరి అంటే ఏంటో తెలుసా? కుస్తీలో పోరాడవలసిన స్థల పరిమితులను బరి అని పిలుస్తుంటారు. దానిని దాటిన వ్యక్తి బరితెగించి పోతున్నాడు అంటారు. సమాజంలో ఉన్నప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అలాంటి వ్యక్తులను బరితెగించి పోతున్నాడు అని అంటుంటారు.

News November 18, 2024

ఎలక్షన్స్.. రూ.1,082 కోట్ల సొత్తు సీజ్

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీలతోపాటు 14 రాష్ట్రాల్లో బై ఎలక్షన్స్ జరుగుతున్న స్థానాల్లో ఇప్పటివరకు రూ.1,082 కోట్ల విలువైన అక్రమ సొత్తును సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో రూ.181కోట్ల నగదు, రూ.119కోట్ల మద్యం, రూ.123కోట్ల మాదక ద్రవ్యాలు, రూ.302కోట్ల ఆభరణాలు, రూ.354కోట్ల గిఫ్ట్స్ ఉన్నట్లు తెలిపింది. ఇవాళ్టితో ప్రచారం ముగియడంతో పోలింగ్ జరిగే ఈ నెల 20 వరకు పటిష్ఠ నిఘా ఉంచినట్లు పేర్కొంది.

News November 18, 2024

ALERT: ఈ రైళ్ల నంబర్లు మారుతున్నాయ్

image

వచ్చే ఏడాది మార్చి నుంచి పలు రైళ్ల నంబర్లను మార్చనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటిలో విశాఖ-కడప, విశాఖ-గుంటూరు, భువనేశ్వర్-రామేశ్వరం, భువనేశ్వర్-పుదుచ్చేరి, భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ రైళ్లు ఉన్నాయి. నంబర్లను మార్చడానికి గల కారణాలను SCR వెల్లడించలేదు. ఏ తేదీ నుంచి ఏ ట్రైన్ నంబర్ మారుతుందో పైన ఫొటోలో చూడొచ్చు.

News November 18, 2024

దారుణం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, బాలిక హత్య!

image

HYDలోని మియాపూర్ అంజయ్య నగర్‌కు చెందిన బాలిక (17) ఈ నెల 8న అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు బాలిక డెడ్‌బాడీని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసరాల్లో గుర్తించారు. బాలికకు ఇన్‌స్టాలో పరిచయమైన ఉప్పుగూడ యువకుడే హత్యకు కారణమై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 18, 2024

గ్రూప్-3: సగం మంది పరీక్షలు రాయలేదు!

image

TG: గ్రూప్-3 పరీక్షలు నేటితో ముగిశాయి. మూడు పేపర్లకు కలిపి 50% మందే హాజరయ్యారు. నిన్న నిర్వహించిన పేపర్-1కు 51.1%, పేపర్-2కు 50.7%, నేడు నిర్వహించిన పేపర్-3కి 50.24% హాజరైనట్లు TGPSC తెలిపింది. ఈ గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా 1363 పోస్టులను భర్తీ చేయనున్నారు.

News November 18, 2024

RCBకి కొత్త బౌలింగ్ కోచ్.. స్పెషాలిటీ ఇదే!

image

IPL2025 కోసం ఓంకార్ సాల్వీని RCB కొత్త బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ముంబై రంజీ టీమ్‌ హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్నారు. గతంలో KKR సపోర్ట్ స్టాఫ్‌లోనూ పనిచేశారు. ఆయన కోచింగ్‌లోనే ముంబై గత ఏడాది రంజీ, ఇరానీ ట్రోఫీలను గెలిచింది. వచ్చే ఏడాది దేశవాళీ సీజన్ ముగియగానే ఆయన RCBతో కలుస్తారు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని వెలికితీస్తుండటంతో రెండేళ్లుగా డొమెస్టిక్ సర్క్యూట్లో ఆయన పేరు మార్మోగుతోంది.

News November 18, 2024

OFFICIAL: నాగచైతన్య-శోభితల శుభలేఖ ఇదే

image

నాగచైతన్య, శోభితల వెడ్డింగ్ కార్డ్ బయటకు వచ్చింది. డిసెంబర్ 4న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో పెళ్లి జరగనుంది. రాత్రి 8.13 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ధూళిపాళ శాంతకామాక్షి, వేణుగోపాలరావుల కూతురైన శోభిత మెడలో చైతూ మూడుముళ్లు వేయనున్నారు.

News November 18, 2024

నాడు కుల గణన చేపట్టకపోవడం తప్పే: రాహుల్

image

UPA హయాంలో ప్రతిపాదన వచ్చినప్పుడు కులగణన చేపట్టకపోవడం తప్పేనని LoP రాహుల్ అంగీకరించారు. దాన్ని సరిదిద్దుకోవడానికే TG, కర్ణాటకలో సర్వేలు ఆరంభించామని తెలిపారు. ప్రజలతో చర్చించాకే ప్రశ్నావళి రూపొందించామన్నారు. కాంగ్రెస్-JMM గెలిచాక ఝార్ఖండ్‌లోనూ ఇలాగే చేస్తామన్నారు. BCలపై డేటా లేకపోవడం వల్లే సరైన విధానాలు రూపొందించడం లేదని, న్యాయబద్ధంగా సంపద పంపిణీ జరగడం లేదని పేర్కొన్నారు.