India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిండే కీలక ప్రకటన చేశారు. మహాయుతి కూటమిలో సీఎం పదవికి ఎలాంటి రేస్ లేదని స్పష్టం చేశారు. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. మహాయుతి కూటమి విజయం సాధిస్తే బీజేపీ నేతకే సీఎం పదవి దక్కే అవకాశం ఉన్నట్టు శిండే వ్యాఖ్యలతో స్పష్టమైంది. అజిత్ పవార్‌కు మరోసారి నిరాశ తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 15 గంటల్లోనే 40 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. దీంతో సౌత్ఇండియాలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి చిత్ర ట్రైలర్‌గా ‘పుష్ప-2’ నిలిచినట్లు మేకర్స్ ప్రకటించారు. స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
వైఎస్ వివేకా హత్య కేసులో మరో నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం పులివెందుల సీఐ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ప్రస్తుతం గజ్జల చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే బెయిల్ మంజూరైంది.
మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఓ అలవాటు ఉందని సినీవర్గాలు చెబుతుంటాయి. ఆయన తీసే సినిమాల్లో షూటింగ్ పూర్తయ్యేవరకూ ఆయన హీరోల లుక్‌లోనే కనిపిస్తారని పేర్కొన్నారు. ‘అర్జున్ రెడ్డి’ తీసినప్పుడు విజయ్ దేవరకొండ లుక్‌లో, ‘యానిమల్’ తీసినప్పుడు రణ్‌బీర్ లుక్‌లో కనిపించారు. తాజాగా ఆయన గడ్డం తీసి కేవలం మీసంతో కొత్త లుక్‌లో కనిపించారు. దీంతో ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్ కోసమే ఇలా మారిపోయారని చర్చ జరుగుతోంది.
తమ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు కూతురు ఐరాతో కలిసి జాయింట్ థెరపీ తీసుకున్నట్లు బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ చెప్పారు. మానసిక సమస్యలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. గతంలో ఐరా డిప్రెషన్‌తో బాధపడిందని, దాంతో తాను కూడా లోన్లీగా ఫీలయ్యానన్నారు. డా.వివేక్ మూర్తితో చర్చించి థెరపీ తీసుకోవడం తమకు ఎంతో సహకరించినట్లు చెప్పారు. మనం చేయలేని పనులకు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు.
Mamaearth పేరెంట్ కంపెనీ Honasa Consumer షేరు ధర సోమవారం 20% వరకు పతనమైంది. Q2 ఫలితాలు ఆశించిన దాని కంటే బలహీనంగా ఉండడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో స్టాకు ధర లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ.297 వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని ఏజెన్సీలు సంస్థకు డౌన్‌గ్రేడ్ రేటింగ్ ఇచ్చాయి. Emkay Global ఏజెన్సీ Sell రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్‌ను ₹600 నుంచి ₹300కు తగ్గించింది.
మణిపుర్‌లో హింసకు కారణమైన మూడు కీలక కేసుల దర్యాప్తు బాధ్యతను NIA స్వీకరించింది. జిరిబమ్‌లో CRPF, కుకీ మిలిటెంట్ల మధ్య కాల్పులు, ఒకే కుటుంబంలోని ఆరుగురిని కిడ్నాప్ చేయడం, వారిని చంపేసిన కేసులను రాష్ట్ర పోలీసులు ఆ సంస్థకు బదిలీ చేశారు. మణిపుర్‌లో హింసకు దారితీసిన పరిస్థితులు, శాంతి భద్రతల ప్రభావంపై NIA దర్యాప్తు చేయనుంది. పరిస్థితుల నియంత్రణకు కేంద్రం మరో 2వేల CAPF అధికారులను మోహరిస్తోంది.
PM మోదీ EX భద్రతా సిబ్బంది లక్కీ బిష్త్‌కు బిగ్‌బాస్-18లో ఛాన్స్ దక్కింది. అయితే, ఆయన ఈ అవకాశాన్ని తిరస్కరించినట్టు తెలిసింది. EX స్నైపర్, RAW ఏజెంట్‌గా పనిచేసిన ఆయన సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. RAW ఏజెంట్‌గా తమ జీవితాలు ఎప్పుడూ గోప్యంగా, మిస్టరీగా ఉంటాయని లక్కీ అన్నారు. వృత్తిగత జీవితాన్ని బహిర్గతం చేయకుండా శిక్షణ పొందామని, తాను దానికే కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.
తన తండ్రి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వేళ అండగా నిలిచిన అందరికీ హీరో నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ముఖ్యంగా ఈ కష్టకాలంలో మాలో ధైర్యాన్ని నింపిన పెదనాన్న(చంద్రబాబు), పెద్దమ్మ(భువనేశ్వరి), లోకేశ్ అన్నయ్య, బ్రాహ్మణి వదినకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అని చెప్పారు. కాగా రోహిత్ తండ్రి, సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 16 మందితో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ ములాఖత్ అయ్యారు. ఫార్మా కంపెనీ కోసం రైతుల నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అరుణ దుయ్యబట్టారు. భూములు ఇవ్వడం ఇష్టం లేకనే ప్రజావేదికను లగచర్ల ప్రజలు బహిష్కరించారని చెప్పారు. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే లగచర్లలో దాడి జరిగిందని అన్నారు.
Sorry, no posts matched your criteria.