India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. CTకి 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న అతడు అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశారు. ఒక సెంచరీతో పాటు 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. మొత్తం 48 వికెట్లు తీశారు.

TG: కులగణన సర్వే నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలన్నారు. ప్రజల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. సర్వే పేరుతో రూ.100 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. విచారణ జరిగితే అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ అధ్యక్షతన జరిగే సీఎల్పీ సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇదే విషయమై అసెంబ్లీ సెక్రటరీ ఈ ఎమ్మెల్యేలకు నోటిసులు జారీ చేశారు.

విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు PM మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రోగ్రామ్ ‘పరీక్షా పే చర్చా’. FEB 28న ఈ ఈవెంట్ గతానికి భిన్నంగా మరింత ఆసక్తికరంగా జరగనుంది. మోదీతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు స్టూడెంట్స్‌తో మమేకం కానున్నారు. సద్గురు జగ్గీవాసుదేవ్, దీపికా పదుకొణె, విక్రాంత్ మాసె, భూమి ఫెడ్నేకర్, మేరీ కోమ్, అవనీ లేఖర, రుజుతా దివేకర్, సోనాలీ సబర్వాల్, రాధికా గుప్తా అతిథులుగా వస్తున్నారు.

నేటి ODI మ్యాచ్‌లో భారత ప్లేయర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మరో 94 రన్స్ చేస్తే విరాట్ వన్డేల్లో 14వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా దాటిన ప్లేయర్ అవుతారు. 12 రన్స్ చేస్తే ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడవుతారు. ఇక రోహిత్ 11వేల వన్డే రన్స్ పూర్తి చేయడానికి 134 పరుగుల దూరంలో ఉన్నారు. 24 రన్స్ చేస్తే ODIల్లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ 10లోకి చేరుకుంటారు.

ఇండియా కూటమిలో మళ్లీ ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లే ఓటములు ఎదురవుతున్నాయని SP స్పష్టంచేసింది. ఢిల్లీలో Exitpolls ఆప్ ఓటమిని అంచనా వేయడంతో రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ అక్కడ బీజేపీ B టీమ్‌లా పనిచేసిందని SP MP రామ్‌గోపాల్ అన్నారు. రాహుల్, ఖర్గే, వాద్రా BJP భాషలో మాట్లాడారని, ఆప్ పతనానికి ప్రయత్నించారని విమర్శించారు. అహంకారం వల్లే HAR, MHలో ఓడిపోయారన్నారు.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ.79,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.270 పెరగడంతో రూ.86,510 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. వివాహాలు ఉండటంతో కొనుగోలుదారులకు ఇది మరింత భారం కానుంది.

విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో నటించేందుకు తన కూతురు అనన్య పాండే అసౌకర్యంగా ఫీలైనట్లు ఆమె తండ్రి చంకీ పాండే తెలిపారు. ఆ పాత్రకు ఆమె వయసు సరిపోదని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే తానే ఒప్పించినట్లు వెల్లడించారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు కరణ్ జోహర్ ఓ నిర్మాతగా వ్యవహరించారు.

స్టార్ పేసర్ బుమ్రా గాయంపై కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనికి 2 రోజులు స్కాన్స్ జరగాల్సి ఉందన్నారు. అందులో వచ్చిన రిజల్ట్స్‌ను బట్టి ఇంగ్లండ్‌తో మూడో వన్డే, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటంపై క్లారిటీ వస్తుందని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా NCAలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ENGతో ODI సిరీస్‌కు అతని స్థానంలో వరుణ్‌ను BCCI ఎంపిక చేసింది.

AP: లిక్కర్ స్కాంపై ఉదయం సిట్ పడగానే రాత్రి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని TDP ప్రశ్నించింది. ‘సిట్ తనవరకు వస్తుందని స్కాంకి సంబంధించి రాసుకున్న డాక్యుమెంట్లు తగలబెట్టారా? నిన్న సాయంత్రం జరిగితే ఇంకా CC ఫుటేజీ ఎందుకు బయటపెట్టలేదు? తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0? ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది గెట్ రెడీ. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్’ అని ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.