India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
APలో ప్రభావం చూపలేని కాంగ్రెస్ గురించి చర్చ <<14602051>>అనవసరమన్న <<>>జగన్ వ్యాఖ్యలపై PCC చీఫ్ షర్మిల స్పందించారు. ‘బడ్జెట్ బాగోలేదని జగన్ కంటే ముందే చెప్పాం. 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు వాళ్లకు, మాకు తేడా లేదు. ఆ పార్టీకి ప్రజలు ఓట్లేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ఎవరు ఇంపార్టెంటో తెలుస్తుంది’ అని సవాల్ విసిరారు.
AP: టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి విశాఖలోనే రూ.40,000 కోట్లు దోచేశారన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. తాను అవినీతిని నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు.
జవహర్‌లాల్ నెహ్రూకు PM మోదీ, LoP రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే సహా ప్రముఖులు నివాళులు అర్పించారు. ‘మాజీ ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘ఆధునిక భారత పిత, ఇనిస్టిట్యూట్ల సృష్టికర్త, ప్రథమ ప్రధాని, పండిత నెహ్రూకు గౌరవనీయ వందనాలు. మీ ప్రజాస్వామ్య, ప్రగతిశీల, నిర్భయ, దార్శనిక, సమ్మిళత విలువలను దేశం మర్చిపోదు’ అని రాహుల్ అన్నారు.
కరుణ కుమార్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్-మీనాక్షి చౌదరి నటించిన ‘మట్కా’ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినప్పటికీ కథలో కొత్తదనం లేదని, చాలా స్లోగా ఉందని, పాటలు ఆకట్టుకోలేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మెగా ప్రిన్స్ లుక్‌లో వేరియేషన్స్, యాక్టింగ్ బాగుందని మరికొందరు చెబుతున్నారు.
కాసేపట్లో WAY2NEWS రివ్యూ
TG: నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పరీక్ష సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు.
దేశ తొలి PM నెహ్రూ పిల్లలతో సమయం గడపడాన్ని ఇష్టపడేవారు. స్వాతంత్ర్యోద్యమం కారణంగా తన సొంత బిడ్డ అయిన ఇందిరకూ దూరంగానే గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో PM అయిన తర్వాత క్రమం తప్పకుండా పిల్లల్ని కలుస్తూ వారి సమక్షంలో సంతోషాన్ని పొందేవారు. 1964లో ఆయన కన్నుమూసిన తర్వాతి నుంచి జవహర్‌లాల్ జయంతిని భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా జరుపుతోంది. అప్పటి వరకు అంతర్జాతీయ తేదీ అయిన నవంబరు 20న వేడుకలు జరిగేవి.
స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. సూచీల గమనం చూస్తుంటే రికవరీ బాట పడతాయో, మరింత పతనమవుతాయో తెలియడం లేదని ఇన్వెస్టర్లు వాపోతున్నారు. నిఫ్టీ 23,591 (+32), సెన్సెక్స్ 77,829 (+141) వద్ద చలిస్తున్నాయి. మీడియా, బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. FMCG, ఆటో, O&G రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. శ్రీరామ్ ఫిన్, M&M, అల్ట్రాటెక్ సెమ్, BEL, ట్రెంట్ లాప్ లూజర్స్.
TG: గల్లీ లీడర్లే దేశ ప్రధాని స్థాయిలో వీఐపీ ట్రీట్‌మెంట్ కావాలని ఫీలయ్యే రోజులివి. అలాంటిది ఇల్లెందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య 5సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా నిరాడంబరంగా జీవిస్తున్నారు. సైకిల్, RTC బస్సులే ఆయనకు ప్రయాణ సాధనాలు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంటి పరీక్షల కోసం వెళ్లారు. అందరితో పాటు వేచి చూసి తన వంతు వచ్చాక వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 16వరకు కుండపోత వర్షాలు పడతాయని అంచనా వేసింది. HYD వాతావరణంలో మార్పులు ఉంటాయని పేర్కొంది.
ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి బైడెన్‌తో ట్రంప్ <<14604330>>భేటీ<<>> అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై ఆసక్తికర చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయడం నేషనల్ సెక్యూరిటీకి ముఖ్యమని బైడెన్ చెప్పారు. యూరప్ బలంగా, స్థిరంగా ఉంటేనే యుద్ధం నుంచి US దూరంగా ఉండటం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు, యూరప్ అంశాల్లో ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.