News November 14, 2024

ఉక్రెయిన్‌కు మద్దతివ్వడం US భద్రతకు కీలకం.. ట్రంప్‌తో బైడెన్

image

ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి బైడెన్‌తో ట్రంప్ <<14604330>>భేటీ<<>> అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్‌ పరిస్థితులపై ఆసక్తికర చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయడం నేషనల్ సెక్యూరిటీకి ముఖ్యమని బైడెన్ చెప్పారు. యూరప్ బలంగా, స్థిరంగా ఉంటేనే యుద్ధం నుంచి US దూరంగా ఉండటం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు, యూరప్ అంశాల్లో ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే.

News November 14, 2024

అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి: KTR

image

TG: తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసని KTR ట్వీట్ చేశారు. ‘రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. అరెస్ట్ చేసుకో రేవంత్‌ రెడ్డి. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? 9నెలలుగా రైతులను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో’ అని ఆయన ట్వీట్ చేశారు.

News November 14, 2024

అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లను నామినేట్ చేసిన స్పీకర్

image

AP: అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లుగా పలువురు MLAలకు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అవకాశం కల్పించారు. వైసీపీ MLA దాసరి సుధ, జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలితకుమారి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులకు అవకాశం ఇస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

News November 14, 2024

రైతులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

image

TG: DAP ధర బస్తాపై ఏకంగా ₹300 పెరగడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50KGల DAP ధర ఇటీవల వరకు ₹1350 ఉండగా, తాజాగా ₹1650కు పెంచారు. పాత స్టాక్‌కు కొత్త ధర వర్తించదని ప్రభుత్వం చెబుతున్నా వ్యాపారులు ₹1650 వసూలు చేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. OCT నుంచి యాసంగి సీజన్ ప్రారంభం కాగా, ఇదే అదనుగా భావించి పలువురు వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరకు అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి.

News November 14, 2024

రైతన్నలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: పంట పొలాల్లో సోలార్ పవర్ సృష్టికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చిలోగా 4 వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ‘పీఎం కుసుమ్’ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా పంటలకు తోడుగా విద్యుత్ ఉత్పత్తితోనూ రైతులు ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం రైతులు సొంతంగా లేదా ఏదైనా సహకార, స్వయం సహాయక సంఘం లేదా కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

News November 14, 2024

భారీ జీతంతో GAILలో ప్రభుత్వ ఉద్యోగాలు

image

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(GAIL)లో 261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి బీఏ, బీకాం, BSC LLB, MSC, PG <>ఉత్తీర్ణులైనవారు<<>> అర్హులు. గ్రూప్ డిస్కషన్, ఫిజికల్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీనియర్ ఇంజినీర్/ఆఫీసర్‌కు రూ.60,000-1,80,000, జూ.ఆఫీసర్‌కు రూ.50,000-1,60,000 జీతం ఉంటుంది.
వెబ్‌సైట్‌: https://gailonline.com/

News November 14, 2024

తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన ఖరారు

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 21న హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి NTR స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22న హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో లోక్‌మంతన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

News November 14, 2024

‘సెక్సియెస్ట్‌ మ్యాన్‌’గా జాన్ క్రసిన్‌స్కీ

image

జీవించి ఉన్నవారిలో 2024కు గాను ‘సెక్సియెస్ట్ మ్యాన్’గా అమెరికా నటుడు, డైరెక్టర్ జాన్ క్రసిన్‌స్కీని ఎంపిక చేసినట్లు పీపుల్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ అవార్డు వస్తుందని ఊహించలేదని, చాలా సంతోషంగా ఉందని జాన్ తెలిపారు. అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ‘జాక్ ర్యాన్’ వెబ్‌సిరీస్‌తో ఆయన ఫేమస్ అయ్యారు. హారర్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్’‌కు డైరెక్టర్, కో రైటర్‌గానూ పనిచేశారు.

News November 14, 2024

మెట్‌ఫార్మిన్‌తో పిండం ఎదుగులపై ప్రభావం

image

డయాబెటిస్ రోగుల్లో చక్కెర స్థాయులను నియంత్రించడానికి వాడే ఔషధం మెట్‌ఫార్మిన్. మహిళలకు గర్భదారణ సమయంలో షుగర్ ముప్పును తగ్గించడానికీ దీన్ని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. అయితే ఇది పిండం ఎదుగుదలను అడ్డుకునే ఛాన్స్ ఉందని US సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. గర్భస్థ కోతులకు మెట్‌ఫార్మిన్‌ను ఇవ్వగా అవయవాల ఎదుగుదలను నియంత్రించిందని తేలింది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

News November 14, 2024

రేపు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి

image

TG: కార్తీక పౌర్ణమి సందర్భంగా కులగణన సర్వేకు రేపు సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘం PRTU డిమాండ్ చేసింది. సర్వేలో పాల్గొన్న టీచర్లను కొందరు అధికారులు వేధిస్తున్నారని, సర్వే గడువును పొడిగించాలని CSకు విజ్ఞప్తి చేసింది. కొన్నిచోట్ల ఉ.7-రా.9 వరకు, సెలవు దినాల్లో ఉ.7-సా.6 గంటల వరకు సర్వేలో ఉండాలని అధికారులు ఆదేశించడం సరికాదని పేర్కొంది. అత్యవసర, ఆరోగ్యరీత్యా సెలవు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని CSను కోరింది.