India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఆందోళనలు దృష్ట్యా తవ్వకాలు నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
TG: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చే నెల 1 నుంచి బీజేపీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసన తెలుపుతూ పాదయాత్రను చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ సవాలును స్వీకరిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 15 లేదా 16న మూసీ పరీవాహక ప్రాంతాల్లో బస చేయనున్నారు.
AP: శాసన సభ, మండలిలో చీఫ్ విప్‌లు, విప్‌లను ప్రభుత్వం ఖరారు చేసింది. అసెంబ్లీలో 15 మందిని విప్‌లుగా నియమించింది. అసెంబ్లీ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ ఉండనున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి సీజన్ కోసం కొత్త బౌలింగ్ కోచ్‌ను నియమించింది. IPL-2025 సీజన్‌లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ బౌలింగ్ కోచ్‌గా ఉండనున్నారు. ఈయన భారత్ తరఫున 70 వన్డేలు ఆడి 86 వికెట్లు తీశారు. రికీ పాంటింగ్ ఆ ఫ్రాంచైజీని వీడిన తర్వాత భారత మాజీ క్రికెటర్లు హేమాంగ్ బదానీని హెడ్ కోచ్‌గా, వేణుగోపాలరావును డైరెక్టర్‌గా డీసీ మేనేజ్మెంట్ నియమించింది.
AP: క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) పరిధిని 8,352 చ.కి.మీ.కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు, బాపట్లలో విలీనం చేసిన ప్రాంతాలను CRDAలో కలిపింది. సత్తెనపల్లి పురపాలిక, పల్నాడు అర్బన్ అథారిటీలోని 92 గ్రామాలు, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోని 562చ.కి.మీ. విస్తీర్ణాన్ని CRDAలో కలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
జైనులకు అహింస పరమోత్కృష్టం. ఏ జీవికీ హాని తలపెట్టొద్దనేది వారి ధర్మం. అందుకే వారి ఆహార నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. మద్యమాంసాల్ని, భూమి కింద పెరిగే దుంపల్ని, ఉల్లి, వెల్లుల్లిని తినరు. తేనెటీగలపై హింసను నివారించేందుకు తేనెకు దూరంగా ఉంటారు. పొరపాటున ఏ జీవినైనా తింటామేమోనన్న కారణంతో సూర్యాస్తమయం తర్వాత తినరు. నిల్వ ఉంచిన ఆహారం, ఉపవాస దినాల్లో ఆకుపచ్చ రంగు కూరగాయలు నిషేధం.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముంగిట ప్రాక్టీస్‌ను రహస్యంగా ఉంచాలని టీమ్ ఇండియా భావిస్తున్నట్లు ది వెస్ట్ ఆస్ట్రేలియన్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. IND ప్రాక్టీస్ చేస్తున్న పెర్త్‌కి ప్రేక్షకుల్ని రానివ్వడం లేదని పేర్కొంది. సిబ్బంది సైతం ఫోన్లను తీసుకెళ్లకుండా కఠిన నిబంధనల్ని భారత్ అనుసరిస్తోందని తెలిపింది. ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా కేవలం సిములేషన్‌తోనే సాధన చేస్తున్నట్లు వెల్లడించింది.
పుస్తకాలు చదవడం వల్ల మనిషికి తన గురించీ, సమాజం గురించీ, ప్రకృతి గురించీ అవగాహన పెరుగుతుందంటారు. అయితే, ఏ పుస్తకాలు చదవాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారికోసమే ఓ నెటిజన్ పుస్తకాలు, వాటి రచయితకు సంబంధించిన జాబితాను షేర్ చేశారు. ఇందులో గురజాడ రాసిన కన్యాశుల్కం నుంచి మొదలై వందల పుస్తకాలున్నాయి. వీటిలో మీరెన్ని పుస్తకాలు చదివారు? ఏ పుస్తకమంటే ఇష్టమో కామెంట్ చేయండి. పుస్తక ప్రియులకు షేర్ చేయండి.
AP: రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ 500 బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించనున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ఇవి మూడేళ్లలో పూర్తవుతాయని, ఒక్కో ప్లాంటును ₹131కోట్లతో నిర్మిస్తారని తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ ప్లాంట్ల ద్వారా రాష్ట్రానికి ₹7వేల కోట్ల ఆదాయం వస్తుందని, సీజీబీకి ఉపయోగపడే పంటలతో రైతులకు ఎకరాకు ₹30వేల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.