News February 1, 2025

కేంద్ర బడ్జెట్‌‌లో ఏపీకి కేటాయింపులు ఇలా..

image

ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 DEC 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్‌లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936cr
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157cr
* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295cr
* విశాఖ పోర్టుకు రూ.730cr
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162cr
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186cr

News February 1, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఎదురు‌కాల్పులు జరగ్గా 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.

News February 1, 2025

ఎల్లుండి ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్

image

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా నుంచి ఎల్లుండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ రివీల్ కానుంది. రెండు రోజుల్లో రెబల్ స్టార్ లుక్ రివీల్ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. గతంలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ పాత్రలో అక్షయ్ కుమార్ పోస్టర్ రిలీజైంది. దీంతో ప్రభాస్ పాత్రతో పాటు లుక్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

News February 1, 2025

ఏపీకి అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు: రామ్మెహన్

image

AP ప్రజల తరఫున నిర్మలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. YCP ప్రభుత్వంలో జల్ జీవన్ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 2028 వరకు జల్ జీవన్ పథకం పొడిగింపుతో APకి మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రానికి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామన్నారు. ఎంత వీలైతే అంత రాష్ట్రానికి నిధులు తెస్తామని చెప్పారు. రాష్ట్రంలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని తెలిపారు.

News February 1, 2025

రంజీల్లో కోహ్లీ.. రోజుకు జీతం ఎంతంటే?

image

విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నారు. రంజీలు ఆడితే కోహ్లీకి రోజుకు రూ.60,000 జీతం అందుకోనున్నారు. మ్యాచ్ జరిగే 4 రోజులకు కలిపి రూ.2.40 లక్షలు పారితోషికం తీసుకుంటారు. రంజీల్లో 40 మ్యాచులకు పైగా ఆడితే రోజుకు రూ.60వేలు, 21-40 మ్యాచులకు రూ.50వేలు, 20 కంటే తక్కువ ఆడితే రూ.40వేలు, ఆరంగేట్ర ఆటగాడికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఇస్తారు.

News February 1, 2025

సాయి పల్లవికి బెడ్ రెస్ట్ అవసరమన్న వైద్యులు!

image

నటి సాయి పల్లవికి విశ్రాంతి అత్యవసరమని వైద్యులు సూచించినట్లు ‘తండేల్’ దర్శకుడు చందూ మొండేటి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘జ్వరంతోనే ఆమె డబ్బింగ్ చెప్పారు. ప్రమోషన్ కార్యక్రమాల కోసం తిరిగి తిరిగి అలసిపోయారు. రికవర్ అయ్యేందుకు కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. అందుకే ముంబై ఈవెంట్‌కూ ఆమె హాజరుకాలేదు’ అని పేర్కొన్నారు.

News February 1, 2025

కేంద్రానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి?

image

నేడు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రానికి ఆదాయం ఏ రూపంలో ఎంత వస్తోందో ఓసారి చూద్దాం.
* అప్పులు, ఇతర మార్గాలు: 24%
* ఇన్‌కమ్ ట్యాక్స్: 22%
* జీఎస్టీ, ఇతర పన్నులు: 18%
* కార్పొరేషన్ ట్యాక్స్: 17%
* పన్నేతర ఆదాయం: 9% * కేంద్ర ఎక్సైజ్ పన్ను: 5
* కస్టమ్స్ పన్ను: 4% * రుణేతర పెట్టుబడులు: 1%

News February 1, 2025

BUDGET: కేంద్ర ప్రభుత్వ ఖర్చుల అంచనాలు

image

భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో రూ.50.65 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. రంగాల వారీగా చూస్తే..
*వడ్డీలు- రూ.12.76 లక్షల కోట్లు
*రవాణా- రూ.5.48 లక్షల కోట్లు
*రక్షణ రంగం- రూ.4.91 లక్షల కోట్లు
*మేజర్ సబ్సిడీలు- రూ.3.83 లక్షల కోట్లు
*పెన్షన్లు- రూ.2.76 లక్షల కోట్లు
*గ్రామీణాభివృద్ధి- రూ.2.66 లక్షల కోట్లు
*హోంశాఖ- రూ.2.33 లక్షల కోట్లు

News February 1, 2025

2005 నుంచి పన్ను మినహాయింపు ఇలా!

image

నెలకు రూ.1 లక్ష సంపాదించినా రూపాయి ట్యాక్స్ చెల్లించకుండా ఉండేలా నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్ తీసుకొచ్చారు. అయితే, గతంలో ఆదాయ పన్ను శ్లాబులిలా ఉన్నాయి. 2005లో వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. 2012లో రూ.2 లక్షలు, 2014లో రూ.2.5లక్షలు, 2019లో రూ.5లక్షలు, 2023లో రూ.7 లక్షల వరకూ ఎగ్జెంప్షన్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రూ.12 లక్షల వరకూ పెంచారు.

News February 1, 2025

రంజీ మ్యాచ్‌కి ఇంత క్రేజా?

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో ఢిల్లీ vs రైల్వేస్‌ రంజీ మ్యాచ్‌కి భారీగా క్రేజ్ పెరిగింది. ఈ రంజీ మ్యాచ్‌ను ప్రసారం చేస్తున్న ‘జియో సినిమా’కు అభిమానులు పోటెత్తారు. ఆయన ఆడుతున్న ఈ మ్యాచ్‌కి మాత్రమే కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇది 1.8 కోట్ల వ్యూస్‌తో అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన రంజీ మ్యాచ్‌‌గా నిలచింది. కోహ్లీ కోసం స్టేడియానికి కూడా అభిమానులు భారీగా తరలివస్తున్న విషయం తెలిసిందే.