India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ ప్రభుత్వం రూ.2.94లక్షల కోట్లతో నిన్న బడ్జెట్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో 4నెలల కాలానికి వైసీపీ ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ తీసుకొచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే మరోసారి 4నెలలకు, తాజాగా సోమవారం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీంతో ఒకే ఏడాది 3సార్లు బడ్జెట్ ప్రకటించినట్లు అయింది. బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభం కాగా, ఇవాళ సెలవు ఇచ్చారు. తిరిగి రేపు ప్రారంభం కానున్నాయి.
AP: సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి జనసేన నేతలు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. 2022లోనే ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటంతో కోర్టుకు వెళ్లామని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలతో కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే జస్టిస్ సంజీవ్ ఖన్నా 45 కేసులు విచారించారు. ఆయన నిన్న రాష్ట్రపతి సమక్షంలో CJIగా ప్రమాణస్వీకారం చేశారు. హోదాతో సంబంధం లేకుండా పౌరులందరినీ సమానంగా చూడటం న్యాయవ్యవస్థ రాజ్యాంగపరమైన కర్తవ్యమని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థ అందరికీ చేరాలంటే న్యాయప్రక్రియ మరింత సరళంగా ఉండాలన్నారు.
TG: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్లిన సిబ్బందికి తమ ఆస్తులు, అప్పుల వివరాలు చెప్పేందుకు ప్రజలు సుముఖత చూపడం లేదు. ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా కేవలం కులం చెప్పడంతోనే సరిపెడుతున్నారు. సర్వే ఎందుకనే విషయంలో ఎన్యుమరేటర్లు ఇచ్చే వివరణలతో ప్రజలు తృప్తి చెందడం లేదు. ఒక్కో ఫాం నింపేందుకు సిబ్బందికి గంట సమయం పడుతోంది. రోజుకు 6-7ఇళ్లలో మాత్రమే వివరాలు సేకరిస్తున్నారు.
నీళ్లు ఎక్కువగా తాగకపోవడం, ఫిజికల్ యాక్టివిటీలు తక్కువవడం, పీచు పదార్థాలు తక్కువ తినడం పిల్లల్లో మలబద్ధకానికి కారణాలని వైద్యులు అంటున్నారు. నీటి శాతం పెంచడం, ఆకుకూరలు, కూరగాయలు భోజనంలో అందిస్తే పిల్లల్లో మలబద్ధకం లేకుండా చేయవచ్చంటున్నారు. పండ్లు తినిపించడంతో పాటు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచడం మంచిదని చెబుతున్నారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. బీజేపీ ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు. పవన్‌తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం వివిధ ప్రచార సభల్లో పాల్గొననున్నారు.
AP: నిన్నటి బడ్జెట్ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది. రాబోయే 5ఏళ్లలో 25లక్షల ఇళ్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. PM ఆవాస్ యోజన-ఎన్టీఆర్ నగర్ పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే పురోగతిలో ఉన్న ఇళ్లు కాకుండా అదనంగా మరో 16లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాది రూ.4,012 కోట్లు కేటాయించింది.
TG: CM రేవంత్‌రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఒక సదస్సులో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య మూడో టీ20 రేపు జరగనుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ వేదికగా రాత్రి 8.30గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై పట్టుబిగించాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.
TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కొనుగోళ్లు జరుగుతాయని రైతులకు హామీ ఇచ్చారు. తాను కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో మాట్లాడానని తెలిపారు. గతేడాది పాటించిన నిబంధనలే ఈసారి కూడా సీసీఐ అనుసరిస్తుందని ఆయన చెప్పారు. రైతులు ఆందోళనకు గురై దళారులకు పత్తిని అమ్ముకోవద్దని సూచించారు.
Sorry, no posts matched your criteria.