News August 9, 2024

వాలంటీర్లను రెన్యువల్ చేస్తాం: మంత్రి డోలా

image

AP: వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల ఉద్యోగాలను గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. వాలంటీర్లను తాము తొలగించలేదని, వైఎస్ జగన్ చేసిన పాపం వల్లే వారికి జీతాలు రావడం లేదని అన్నారు.

News August 9, 2024

UAN ఎందుకు స్తంభిస్తుంది? ఏం చేయాలి?

image

ఏదైనా మోసం లేదా ABRY(ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన) ప్రయోజనాల దుర్వినియోగం జరుగుతున్నట్లు గుర్తిస్తే ఖాతాదారుల UAN(యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఫ్రీజ్ చేస్తామని EPFO వివరించింది. ఖాతాదారుల PF డబ్బును రక్షించేందుకే అలా చేస్తామని చెప్పింది. సరైన ధ్రువీకరణ తర్వాత అది అన్‌ఫ్రీజ్ అవుతుందని తెలిపింది. మీరు UANను అన్‌ఫ్రీజ్ చేయడానికి EPFiGMS పోర్టల్‌లో ‘Blocked UAN’ విభాగంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.

News August 9, 2024

ఆ హీరోల‌పై జాన్ అబ్ర‌హం ఫైర్‌

image

కొంత మంది ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూనే పాన్ మ‌సాలా బ్రాండ్లను ప్రోత్సహిస్తున్నారంటూ పలువురు నటులను ఉద్దేశించి బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్ర‌హం వ్యాఖ్యానించారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ‘నేను నా జీవితాన్ని నిజాయితీతో జీవిస్తే, నేను చెప్పేది ప్ర‌తీది ఆచరిస్తే, అప్పుడు నేనో రోల్ మోడల్. ఏదేమైనా నేను పబ్లిక్‌లోనూ నటిస్తూ చావును అమ్మబోను’ అని చెప్పాడు.

News August 9, 2024

కాసేపట్లో ఈ 9 జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మీ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయా? కామెంట్ చేయండి.

News August 9, 2024

కొత్త బంధాలకు రైట్ టైం: BNP నేత

image

భారత్- బంగ్లా ద్వైపాక్షిక సంబంధాలు అవామీ లీగ్‌పై ఆధారపడి లేవని, మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై బంగ్లాదేశ్‌లో వ్యతిరేకత రావడం సహజమే అని BNP సీనియర్ నేత ముషారఫ్ PTIతో అన్నారు. బంగ్లాకు భారత్ ఎంతో ముఖ్యమని, ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శ‌కం ప్రారంభించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం అన్నారు. మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వానికి ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు చెప్ప‌డాన్ని ఆయ‌న స్వాగతించారు.

News August 9, 2024

హీరో సూర్య కోలుకుంటున్నారు: నిర్మాత

image

తమిళ హీరో సూర్య తలకు గాయమైందని వస్తున్న వార్తలపై నిర్మాత రాజశేఖరన్ స్పందించారు. అది చిన్న గాయమేనని, సూర్య కోలుకున్నారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’ మూవీ షూటింగ్ ఊటీలో జరుగుతోంది. అక్కడే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు సమాచారం.

News August 9, 2024

పతకాలు తేని గుజరాత్‌కే ఎక్కువ ఫండ్స్: ఆజాద్

image

మణిపుర్, హరియాణా ఎక్కువ ఒలింపిక్ పతకాలు సాధించినా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ పేరుతో గుజరాత్‌కు ఎక్కువ ఫండ్స్ అందుతున్నాయని మాజీ క్రికెటర్, AITC MP కీర్తి ఆజాద్ ఆరోపించారు. ఈ మేరకు Xలో ఆయన ఓ రిపోర్ట్ పంచుకున్నారు. అందులో ఖేలో ఇండియా స్కీమ్ కింద UPకి రూ.438.27కోట్లు, గుజరాత్‌కు రూ.426.13కోట్లు వెచ్చించగా ఎక్కువ పతకాలు గెలుస్తున్న మణిపుర్‌కు రూ.46.71కోట్లు, హరియాణాకు రూ.66.59కోట్లు వెచ్చించినట్లు ఉంది.

News August 9, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: స్కూళ్లలో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్కూళ్ల విద్యార్థులకు ఆగస్టు 15, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్, ఆటల పోటీలు నిర్వహించాలని పంచాయతీల <<13816066>>సర్పంచ్‌లకు<<>> నిర్దేశించారు. పిల్లలకు చాక్లెట్లు అందించి పారిశుద్ధ్యంపై మహాత్మాగాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని చెప్పారు.

News August 9, 2024

వారం రోజులకే రంగు మారిన ఒలింపిక్ మెడల్

image

పారిస్ ఒలింపిక్స్‌లో గెలిచిన మెడల్స్ నాణ్యంగా లేవని USA స్కేట్‌బోర్డర్ నైజా హస్టన్ ఆరోపించారు. జులై 29న జరిగిన పురుషుల స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్ ఫైనల్‌లో అథ్లెట్ హస్టన్ కాంస్య పతకాన్ని గెలిచారు. అయితే, వారం రోజుల్లోనే పతకం పాతదైపోయి రంగు మారిందని ఆయన ఫొటోను పంచుకున్నారు. ఈ మెడల్ యుద్ధానికి వెళ్లి తిరిగివచ్చినట్లు కనిపిస్తోందని ఆయన రాసుకొచ్చారు. నాణ్యతపై దృష్టిసారించాలని ఆయన కోరారు.

News August 9, 2024

ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి: పురందీశ్వరి

image

ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ను ఎంపీలు పురందీశ్వరి, దగ్గుమళ్ల ప్రసాద్ కోరారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు వినతులు సమర్పించారు. ‘తోతాపురి మామిడిని కనీస మద్దతు ధరల జాబితాలో చేర్చాలి. టన్నుకు రూ.25వేలు మద్దతు ధర ఇవ్వాలి’ అని కోరారు. ప్రధానితో చర్చించి మామిడి రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.