India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో పరిస్థితులపై పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఆ దేశంలోని హిందువులు, భారతీయుల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. అటు అక్కడి హింసాత్మక ఘటనల దృష్ట్యా పలువురు భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో ఫైనల్ చేరిన తనకు సిల్వర్ మెడల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ చేసిన అభ్యర్థనపై CAS(కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్) స్పందించింది. ఈ ఒలింపిక్ క్రీడలు ముగిసేలోపు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా 100గ్రాముల అధిక బరువు వల్ల ఫైనల్స్‌లో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. <<-se>>#Olympics2024<<>>
ముంబైలోని చెంబూరు కళాశాల హిజాబ్, బుర్ఖాను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. సర్క్యులర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు ఈరోజు విచారించింది. తిలకం, బొట్టుబిల్లలకు మాత్రం ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రశ్నించింది. విద్యార్థులకు ఇష్టమైన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నవంబరుకు వాయిదా వేసింది.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటు చేసింది. మొత్తం 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీకి, ఏపీ నుంచి లావు కృష్ణ దేవరాయలుకి చోటు దక్కింది. జేపీసీలో సభ్యులు కాబోయే రాజ్యసభ ఎంపీల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నారు
తెలంగాణలోని పలు యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన CPGET-2024 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జులై 6 నుంచి 16వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 73,342 మంది దరఖాస్తు చేసుకోగా, 64,765 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ <
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఆరంభ లాభాలను చివరి వరకు కొనసాగించడంతో సూచీలు లాభాలతో వీకెండ్‌ను ముగించాయి. ఉదయం భారీ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్సులు చివరిదాకా కన్సాలిడేట్ అయ్యాయి. డే High – Low మధ్య రేంజ్ బౌండ్ అవుతూనే సెన్సెక్స్ 790, నిఫ్టీ 247 పాయింట్ల లాభంతో ముగించాయి. BSE మిడ్ క్యాప్ 1%, స్మాల్ క్యాప్ 0.8% గెయిన్ అయ్యాయి.
హీరోయిన్ తాప్సీ తన భర్త మథియాస్ బో గురించి ఓ టీవీ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మథియాస్‌తో నాకు పదేళ్ల నుంచే పరిచయం ఉంది. ఈ దశాబ్దకాలంలో మమ్మల్ని ఎవరూ విడదీయలేకపోయారు. ఫస్ట్ డేట్ కోసం మేం ఓసారి దుబాయ్ వెళ్లాం. కానీ మథియాస్ నన్ను దుబాయ్ షేక్‌లకు అమ్మేస్తాడేమో జాగ్రత్తగా ఉండాలంటూ వెళ్లేముందు నా ఫ్రెండ్స్ ఆటపట్టించారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా మథియాస్ డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్.
TG: అడోబ్ సిస్టమ్స్ (Adobe Systems) CEO శంతను నారాయణ్‌తో CM రేవంత్ అమెరికాలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తలపెట్టిన హైదరాబాద్ 4.0, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై ఆయన ఆసక్తి కనబరిచారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడానికి అంగీకరించారని, ఆయనను కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
రాజ్యసభ ఛైర్మన్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మధ్య మరోసారి పేరు వివాదం తలెత్తింది. ఛైర్మన్ ధన్‌ఖడ్ మరోసారి జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పాలని జయా డిమాండ్ చేయగా తనకు పాఠాలు చెప్పవద్దంటూ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయాకు సోనియా మద్దతుగా నిలవగా ఛైర్మన్ తీరును నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి.
AP: ఉమ్మడి విశాఖ MLC ఉపఎన్నికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో విశాఖ జిల్లా నేతలతో ఆయన సమావేశం అయ్యారు. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిని బరిలో దింపాలని నిర్ణయించారు. ప్రస్తుత భేటీలో MLC అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేయనున్నారు. పీలా గోవింద్, గండి బాబ్జిల్లో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. కాగా వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును జగన్ ఖరారు చేశారు.
Sorry, no posts matched your criteria.