News October 30, 2025

పత్తిలో 20% తేమ ఉన్నా కొనండి.. CCIకి లేఖ

image

TG: భారీ వర్షాల నేపథ్యంలో పత్తిలో 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని CCIకి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ మల్లు రవి లేఖ రాశారు. తేమ పెరగడం వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే రబీ సీజన్ కోసం నెలకు 2 లక్షల టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కాగా క్షేత్రస్థాయిలో పత్తిలో 12% తేమ దాటితే <<18118478>>మద్దతు ధర<<>> దక్కడం లేదు.

News October 30, 2025

ఏడాది తర్వాత పిల్లలకు ఏం పెట్టాలంటే?

image

పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. కానీ చాలామంది పేరెంట్స్ ఏడాది దాటాక కూడా పిల్లలకు పెరుగన్నం, నెయ్యి, ఉప్పు కలిపి అన్నం పెడుతుంటారు. బాల్యంలో పిల్లలకు సరైన పోషకాలు అందిస్తేనే పెద్దయ్యాక కూడా ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నిపుణులు. వారికి ఏడాది దాటాక నెమ్మదిగా అన్నిరకాల ఆహారాలు అలవాటు చెయ్యాలి. కిచిడీ, పొంగల్‌, పాలకూర పప్పు, వెజిటబుల్‌ రైస్‌ వంటివి తినిపించాలంటున్నారు.

News October 30, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. మరి ఎమ్మెల్సీ ఎప్పుడు?

image

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన MLA/MLC కాదు. ఈ రెండూ కాకపోయినా మంత్రివర్గంలో చేరవచ్చు. 6 నెలల్లోపు ఏదో ఒక పదవికి ఎన్నిక కావాలి. లేదంటే మంత్రి పదవి కోల్పోవాల్సిందే. గవర్నర్ కోటా MLCలుగా అజహరుద్దీన్, కోదండరామ్ పేర్లను ప్రభుత్వం 2నెలల కిందట సిఫారసు చేయగా గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News October 30, 2025

US కీలక నిర్ణయం.. ఇండియన్స్‌కు భారీ నష్టం!

image

ఎంప్లాయిమెంట్ ఆటోమేటిక్ ఆథరైజేషన్‌ను రద్దు చేస్తూ US నిర్ణయం తీసుకుంది. గతంలో వర్క్ పర్మిట్ రెన్యూవల్‌కు అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నా 540 రోజులు వర్క్ చేసే వీలుండేది. ఇప్పుడు గడువు ముగిసేలోగా రెన్యూవల్ కాకపోతే మైగ్రెంట్స్ వర్క్ పర్మిట్ ఆథరైజేషన్ కోల్పోతారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ స్పౌజెస్(H4), H1Bs వీసా, STEM వర్క్ ఎక్స్‌టెన్షన్స్‌పై ఉన్న విద్యార్థులు, ఇండియన్ మైగ్రెంట్స్ నష్టపోయే ప్రమాదం ఉంది.

News October 30, 2025

PPPపై జోక్యానికి హైకోర్టు మరోసారి నిరాకరణ

image

AP: రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా హాస్పిటల్స్‌ను PPP విధానంలో నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు మరోసారి నిరాకరించింది. ‘ప్రారంభ దశలోనే ఉన్న టెండర్ ప్రక్రియను ఆపలేం. ప్రభుత్వం పిలవగానే ఇన్వెస్టర్స్ డబ్బు సంచులతో పరిగెత్తుకురారు కదా’ అని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సమయమిస్తూ.. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

News October 30, 2025

ఇవి తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడినిస్తాయి

image

☛ టమాటలో బాక్టీరియా ఎండుతెగులు, ఆకుముడత వైరస్ తెగులు తట్టుకొనే రకాలు: అర్కా అనన్య, అర్కా రక్షక్, అర్కా సామ్రాట్ ☛ వంగలో బాక్టీరియా ఎండు తెగులును తట్టుకునేవి: అర్కా ఆనంద్, అర్కా నిధి, అర్కా కేశవ ☛ బెండలో వైరస్‌ను తట్టుకునేవి: అర్కా అనామికా, అర్కా అభయ్, పర్బానీ కాంతి
☛ మిరపలో వైరస్ తెగుళ్లను అర్కా మేఘన, వైరస్, బూడిద తెగుళ్లను అర్కా హరిత తట్టుకుంటుంది. ☛ వ్యవసాయ సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 30, 2025

బంధాలకు మిడ్‌లైఫ్‌ క్రైసిస్‌ ముప్పు

image

నలభైఏళ్లు దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా బాధిస్తుంటే, కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

News October 30, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* అమరావతి పరిధిలోని భూమిలేని నిరుపేదలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ₹71.09Cr విడుదల చేసింది.
* CRDA తీసుకున్న రుణాలపై వాయిదా చెల్లింపులకు ప్రభుత్వం ₹287Cr కేటాయించింది.
* అమరావతిలోని నెక్కల్లులో యువతకు నైపుణ్య శిక్షణకు L&T సంస్థ ₹369Crతో ఓ కేంద్రాన్ని నిర్మించనుంది. దీనికి సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు.
* అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ₹60Cr మంజూరు చేసింది.

News October 30, 2025

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

image

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం 7 క్యూరేటర్-B ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ/బీఈ/బీటెక్/MS/ఎంటెక్/పీహెచ్‌డీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ncsm.gov.in/

News October 30, 2025

పశువులకు మేలు చేసే సూపర్ నేపియర్ గడ్డి

image

పచ్చి గడ్డిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.