News January 21, 2025

బిజీబిజీగా తొలిరోజు!

image

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తొలిరోజు ట్రంప్ బిజీబిజీగా గడిపారు. ఎక్కడా సమయాన్ని వృథా చేయకుండా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన తొలిరోజున 42 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్/ మెమోరాండం/ ప్రకటనలు చేశారు. 115 మంది సిబ్బందిపై, 200 కంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 60 నిమిషాల పాటు ప్రెస్‌తో మాట్లాడారు. ఒక్కరోజులో 3 చారిత్రక ప్రసంగాలు ఇచ్చి తన మార్క్ చూపించారు.

News January 21, 2025

హీరో అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్?

image

హీరో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. మార్చి 24న అఖిల్-జైనబ్ రవ్జీల వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య జరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. త్వరలోనే పెళ్లి పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనిపై అక్కినేని కుటుంబం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కొన్ని నెలల కింద వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

News January 21, 2025

ఆటోమేటిక్ US బర్త్‌రైట్ రద్దు: భారతీయులకు బిగ్ షాకే!

image

ఆటోమేటిక్ బర్త్‌రైట్ రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రభావం భారతీయులపై విపరీతంగా ఉండనుంది. ఇకపై పిల్లలకు ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం వర్తించాలంటే వారి పేరెంట్స్‌లో ఒకరు US పౌరులు/ గ్రీన్ కార్డు హోల్డర్ (PR)/ US మిలిటరీలో పనిచేస్తుండాలి. గతంలో మాదిరిగా టెంపరరీ వర్క్ వీసా (H1B), స్టూడెంట్ వీసా (F1), గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వారు, విజిటింగ్ వీసాపై అక్కడ కన్న పిల్లలకు వర్తించదు.

News January 21, 2025

ఈ వారమే హిందీలో ’డాకు‘ రిలీజ్

image

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ హిందీ వెర్షన్ ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. ఎమోషన్, సహజత్వం కొనసాగేలా ఇందులో కూడా తన రోల్‌కు బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బీటౌన్‌లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

News January 21, 2025

లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేదా? ఇలా చేయండి!

image

TG: ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి అమలు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి జరుగుతుందని చెప్పారు. నేటి నుంచి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, అర్హత ఉండి లిస్టులో పేరు లేని వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు.

News January 21, 2025

WEF: నేడు ఈ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు

image

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రెండో రోజున CM రేవంత్ పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. IT, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

News January 21, 2025

పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి?

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన <<15211460>>ఎన్‌కౌంటర్‌లో <<>>14 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు సమాచారం. చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు వాసి కాగా, ఆయనపై గతంలోనే రూ.కోటి రివార్డు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో రెండ్రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

News January 21, 2025

GOOD NEWS.. జీతాలు పెంపు

image

TG: సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు, స్వీపర్ల జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మండల లెవల్ స్టాక్ పాయింట్లు, GCC పాయింట్ల వద్ద పనిచేస్తున్న హమాలీలకు క్వింటాల్‌కు ప్రస్తుతం ఇస్తున్న రూ.26 ఛార్జీకి రూ.3 అదనంగా, గోదాముల్లో పనిచేసే స్వీపర్లకు వేతనం రూ.1000 పెంచింది. ఇకపై వారు రూ.6000 జీతం అందుకోనున్నారు. అలాగే హమాలీ డ్రెస్సు స్టిచ్చింగ్ ఛార్జీలు రూ.1300 నుంచి రూ.1600కు పెంచినట్లు జీవోలో పేర్కొంది.

News January 21, 2025

టెట్ అభ్యర్థులకు అలర్ట్

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ప్రిలిమినరీ ‘కీ’ని ఈనెల 24న విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 27న సా.5 గంటల వరకు పూర్తి ఆధారాలతో https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపారు. పరీక్షలు నిన్నటితో ముగియగా, మొత్తం 2.05 లక్షల మంది హాజరయ్యారు. 74.44% హాజరు నమోదైంది.

News January 21, 2025

నకిలీ వెబ్ సైట్లను గుర్తించండిలా

image

☛ వెబ్‌సైట్ https://తో ప్రారంభం అవుతుంది. తర్వాత కంపెనీ నేమ్ ఉంటుంది. స్పెల్లింగ్‌లో మిస్టేక్స్ ఉంటే నకిలీదని అనుమానించాలి.
☛ సైట్ డొమైన్ చెక్ చేయాలి. సైట్ ఇటీవలే ప్రారంభించినట్లు ఉంటే నకిలీదయ్యే ఛాన్సుంది.
☛ అడ్రస్ బార్/URL వద్ద ప్యాడ్ లాక్‌పై క్లిక్ చేస్తే సైట్ info వస్తుంది.
నకిలీ సైట్లలో డేటాను ఎంటర్ చేసినప్పుడు డేటా చోరీపై హెచ్చరిస్తుంది.
☛ ప్రభుత్వ వెబ్ సైట్లకు చివరన gov.in అని ఉంటుంది.