News January 28, 2025

డీప్‌సీక్‌ AIపై సైబర్ అటాక్స్.. రిజిస్ట్రేషన్లు నిలిపివేత

image

సైబర్ దాడుల నేపథ్యంలో కొత్త యూజర్ల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా ఆపేస్తున్నామని చైనీస్ స్టార్టప్ డీప్‌సీక్ తెలిపింది. పాత యూజర్లు నిరభ్యంతరంగా తమ AIను వాడుకోవచ్చని సూచించింది. ChatGPT, Gemini వంటి AI యాప్స్‌కు డీప్‌సీక్ పెనుసవాళ్లు విసురుతోంది. కొత్త వెర్షన్ విడుదలయ్యాక అనేక దేశాల్లో దీనినే ఎక్కువగా వాడుతున్నారు. అమెరికాలో APPLE యాప్‌స్టోర్‌లో ఎక్కువ డౌన్‌లోడ్ చేసుకున్న ఫ్రీ యాప్‌గా నిలిచింది.

News January 28, 2025

ఉదయాన్నే పరగడుపున ఇవి తింటున్నారా?

image

ఉదయాన్నే పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కాఫీ, స్పైసీ ఫుడ్స్, సిట్రస్ పండ్లు, చక్కెర పదార్థాలు, డీప్ ఫ్రై ఆహారం తీసుకోకూడదు. ఇవి తింటే జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరానికి దారి తీస్తాయి. దీనివల్ల డయాబెటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓట్ మీల్, గుడ్లు, గ్రీన్ టీ, బెర్రీలు, చియా విత్తనాలు, బాదంపప్పు వంటివి తీసుకోవాలి. వీటిని తింటే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది.

News January 28, 2025

సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు: అంబటి ఎద్దేవా

image

AP: పథకాల అమలుపై సీఎం చంద్రబాబు చేసిన <<15282237>>కామెంట్లకు<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో కౌంటరిచ్చారు. ‘సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు. జగన్ మీద తోసేసి చంద్రబాబు, లోకేశ్ చేతులెత్తేశారు. హామీలు గాలికి వదిలేశారు. గోవిందా.. గోవిందా!!’ అని ఎద్దేవా చేశారు. అప్పుల పేరుతో CBN పథకాలు అమలు చేయడం లేదని అంబటి నిన్న విమర్శించిన విషయం తెలిసిందే.

News January 28, 2025

BREAKING: ఘోర ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. HYD రాజేంద్రనగర్ పరిధిలో ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇక ఏపీలోని నంద్యాల చాపిరేవులలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News January 28, 2025

అమెరికాకు ఐరన్ డోమ్ అత్యవసరం: ట్రంప్

image

ఇజ్రాయెల్ తరహాలోనే అమెరికాకూ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ మేరకు చట్టసభల సభ్యులకు వెల్లడించారు. త్వరలోనే అందుకు సంబంధించిన ఆదేశాలపై సంతకం చేస్తానని స్పష్టం చేశారు. USకి రక్షణ కవచం అత్యవసరమని, ఐరన్ డోమ్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని వారితో పేర్కొన్నారు. దేశ గగనతలంలోకి దూసుకువచ్చే క్షిపణుల్ని ఐరన్ డోమ్ వ్యవస్థ నేలకూలుస్తుంది.

News January 28, 2025

ఆత్మీయ భరోసాపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: పట్టణాల్లోని రైతు కూలీలకూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలనే వినతిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రామాల్లోని కూలీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారని, మున్సిపాలిటీల పరిధిలో ఉండే వారికి అన్యాయం జరుగుతోందని కోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో మున్సిపాలిటీల్లో పలు గ్రామాలను విలీనం చేశారని, రైతు కూలీలందరినీ ఒకేలా చూడాలని పిటిషనర్లు కోరారు.

News January 28, 2025

ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ

image

దక్షిణ భారతదేశం నుంచి ఈశాన్య రుతుపవనాలు నిన్న నిష్క్రమించాయి. 10 రోజుల ముందే ఈ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా వాతావరణ మార్పులతో కాస్త ఆలస్యమైంది. అక్టోబర్ 15న రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వగా ఈ సీజన్‌లో APలో 286.5MM వర్షపాతానికి గాను 316.5MM(10% అధికం) నమోదైంది. రాయలసీమలో 46% అధిక వర్షపాతం కురవగా, ఉత్తర కోస్తాలో తక్కువ వర్షం కురిసింది. మొత్తంగా 2 తుఫాన్‌లు, 3 వాయుగుండాలు, 3 అల్పపీడనాలు వచ్చాయి.

News January 28, 2025

నేడు స్కూళ్లకు సెలవు!

image

షబ్ ఎ మిరాజ్ సందర్భంగా తెలంగాణలోని పలు స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28న ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. దీంతో మైనార్టీ విద్యాసంస్థలు హాలిడే ప్రకటించాయి. మిగతావి తమ స్వీయ నిర్ణయం ప్రకారం సెలవును ఇవ్వవచ్చు లేదా తరగతులు నిర్వహించవచ్చు. ఏపీలో సెలవుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మీకు ఈరోజు సెలవు ఉందా? కామెంట్ చేయండి.

News January 28, 2025

ఏపీ డీజీపీ నియామకంపై హైకోర్టులో పిల్

image

AP: DGP నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవడం లేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. UPSCకి పేర్లు పంపి షార్ట్ లిస్ట్ చేసిన వారిలో ఒకరిని డీజీపీగా నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ నెల 31న DGP తిరుమలరావు పదవీకాలం ముగుస్తున్నందున అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రేపు విచారణ చేస్తామని సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ధర్మాసనం తెలిపింది.

News January 28, 2025

భారత్-చైనా కీలక నిర్ణయం

image

మానస సరోవర్ యాత్రను పున:ప్రారంభించాలని భారత్, చైనా కలిసి నిర్ణయించాయి. ఇందుకోసం ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని అంగీకరించాయి. ఈ మేరకు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ ఉప మంత్రి సన్ వెయ్‌డాంగ్‌ భేటీ అయ్యారు. అంతర్జాతీయ నదులు, జల వనరులకు సంబంధించి డేటాను ఇచ్చిపుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నాయి. కాగా కొవిడ్-19 కారణంగా మానస సరోవర్ యాత్రను 2020లో నిలిపివేశారు.