India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దక్షిణ భారతదేశం నుంచి ఈశాన్య రుతుపవనాలు నిన్న నిష్క్రమించాయి. 10 రోజుల ముందే ఈ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా వాతావరణ మార్పులతో కాస్త ఆలస్యమైంది. అక్టోబర్ 15న రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వగా ఈ సీజన్‌లో APలో 286.5MM వర్షపాతానికి గాను 316.5MM(10% అధికం) నమోదైంది. రాయలసీమలో 46% అధిక వర్షపాతం కురవగా, ఉత్తర కోస్తాలో తక్కువ వర్షం కురిసింది. మొత్తంగా 2 తుఫాన్‌లు, 3 వాయుగుండాలు, 3 అల్పపీడనాలు వచ్చాయి.

షబ్ ఎ మిరాజ్ సందర్భంగా తెలంగాణలోని పలు స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28న ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. దీంతో మైనార్టీ విద్యాసంస్థలు హాలిడే ప్రకటించాయి. మిగతావి తమ స్వీయ నిర్ణయం ప్రకారం సెలవును ఇవ్వవచ్చు లేదా తరగతులు నిర్వహించవచ్చు. ఏపీలో సెలవుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మీకు ఈరోజు సెలవు ఉందా? కామెంట్ చేయండి.

AP: DGP నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవడం లేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. UPSCకి పేర్లు పంపి షార్ట్ లిస్ట్ చేసిన వారిలో ఒకరిని డీజీపీగా నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ నెల 31న DGP తిరుమలరావు పదవీకాలం ముగుస్తున్నందున అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రేపు విచారణ చేస్తామని సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ధర్మాసనం తెలిపింది.

మానస సరోవర్ యాత్రను పున:ప్రారంభించాలని భారత్, చైనా కలిసి నిర్ణయించాయి. ఇందుకోసం ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని అంగీకరించాయి. ఈ మేరకు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ ఉప మంత్రి సన్ వెయ్‌డాంగ్ భేటీ అయ్యారు. అంతర్జాతీయ నదులు, జల వనరులకు సంబంధించి డేటాను ఇచ్చిపుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నాయి. కాగా కొవిడ్-19 కారణంగా మానస సరోవర్ యాత్రను 2020లో నిలిపివేశారు.

TG: మాజీ సీఎం కేసీఆర్ సొంతంగా ఫోన్ వాడుతున్నారు. సీఎంగా ఉన్నన్ని రోజులు ఆయన ఫోన్ ఉపయోగించలేదు. కుటుంబసభ్యులు, నేతలు, సిబ్బంది ఫోన్లతోనే ఆయన ఇతరులతో మాట్లాడేవారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ తనయుడు, తన మనవడు హిమాన్ష్ ఫోన్ ఆపరేట్ చేయడం నేర్పించారు. కేటీఆర్, హరీశ్, కవితతోపాటు పార్టీ ముఖ్య నేతలు, సన్నిహితుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.

AP: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుుడు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆకాశానికెత్తారు. అప్పటి నుంచి ఆయన కాషాయ పార్టీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. కాగా రాయుడు గతంలో వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి జనసేన పార్టీతో కనిపించారు.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ మూడో టీ20 జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా 5 మ్యాచుల సిరీస్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.

TG: సీఎం రేవంత్ ఇవాళ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ 150 ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌పీరియం పార్కు’ను ఆయన ప్రారంభిస్తారు. ఇదే కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి కూడా పాల్గొంటారు. కాగా రూ.450 కోట్ల వ్యయంతో రామ్‌దేవ్ రావు ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలు, చెట్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు.

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం నుంచి ఎలాంటి లీక్‌లు బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్తలు పడ్డట్లు టాక్. మహేశ్‌తో సహా ఎవరూ సెట్‌లోకి ఫోన్ తీసుకురాకూడదట. అందరితో నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్(NDA)చేసుకున్నట్లు తెలుస్తోంది. లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించాలి.
Sorry, no posts matched your criteria.