News January 28, 2025

మేం విఫలమైతే పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు: రేవంత్

image

TG: దావోస్ పెట్టుబడులపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పెట్టుబడులు స్వాగతించకపోయినా అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. తాము వెళ్లింది పెట్టుబడుల కోసమేనని పేర్కొన్నారు. ఒప్పందాలకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసూయ ఎందుకని ప్రశ్నించారు. తాము విఫలమైతే కొందరు పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

News January 28, 2025

దారుణం.. బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్

image

MP జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంద్రజిత్(66) అనే వృద్ధుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా చనిపోయినట్లు నిర్ధారించి వైద్యులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. కుటుంబీకులు బాడీని తీసుకెళ్తుండగా చలనం కనిపించింది. సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం రోగికి చికిత్స అందిస్తున్నారు.

News January 28, 2025

గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు: సీపీ

image

TG: మీర్‌పేటలో గురుమూర్తి భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడని రాచకొండ CP సుధీర్‌బాబు వెల్లడించారు. ఇలాంటి కేసు ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు. హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు. గురుమూర్తిలో ఎటువంటి పశ్చాత్తాపం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా భార్యతో గొడవపడి గోడకేసి కొట్టి, గొంతునులిమి చంపాడని తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పిల్లలను తీసుకొచ్చి ఇంట్లోనే పడుకున్నట్లు వివరించారు.

News January 28, 2025

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిల్

image

AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు గుంటూరు జిల్లా నాలుగో అదనపు కోర్టులో ఊరట దక్కింది. రూ.10 వేల పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

News January 28, 2025

SSC GD ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటించిన 39,481 జనరల్ డ్యూటీ(GD) కానిస్టేబుల్ పోస్టుల పరీక్ష తేదీలు, అప్లికేషన్ స్టేటస్‌ వివరాలను SSC ప్రకటించింది. ఈ నెల 31న అడ్మిట్ కార్డులు విడుదల చేయనుంది. ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో షిఫ్టుల ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు <>ssc.gov.in<<>> అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News January 28, 2025

పెట్టుబడులపై ఏపీ అలా.. తెలంగాణ ఇలా!

image

దావోస్‌లో ఒప్పందాలు ఉండవు, కేవలం చర్చలే ఉంటాయని.. ఆ తర్వాత కంపెనీల ఆసక్తి మేరకు ఒప్పందాలు చేసుకుంటాయని మంత్రి లోకేశ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అటు దావోస్, సింగపూర్ పర్యటనల్లో రూ.1.80లక్షల కోట్లకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టి వివరించింది. పెట్టుబడులపై తెలుగు రాష్ట్రాలు రెండు విధాలుగా చెప్పడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై మీ COMMENT.

News January 28, 2025

అప్పుడే మా ప్రభుత్వ విజయం: శ్రీధర్ బాబు

image

TG: దావోస్ సదస్సులో భారీ ఎత్తున పెట్టుబడులు రావడం ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గతేడాది కంటే 4 రెట్లు ఎక్కువగా ఒప్పందాలు జరిగాయని మీడియా సమావేశంలో తెలిపారు. ప్రత్యక్షంగా 49,500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. వన్ ట్రిలియన్ ఎకానమీ దిశగా గొప్ప అడుగు పడిందన్నారు. ఒప్పందం జరిగినంత మాత్రాన విజయం సాధించినట్టు కాదని, కంపెనీలన్నీ స్థాపించినప్పుడే విజయమని తెలిపారు.

News January 28, 2025

మార్కెట్ లాభాలకు కారణం ఇదే!

image

చైనా Deepseek AI వ‌ల్ల IT స్టాక్స్, ఎయిడ్స్ మందుల సరఫరాకు ఇచ్చే నిధులను నిలిపేస్తామన్న US ప్రకటనతో ఫార్మా రంగాలు నష్టపోయినా దేశీయ స్టాక్ మార్కెట్లు Tue లాభాలతో ముగిశాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో లిక్విడిటీ పెంపు నిర్ణ‌యాల‌తో రెపో రేటును RBI త‌గ్గించ‌వ‌చ్చ‌న్న ఉహాగానాలు సెంటిమెంట్‌ను బ‌ల‌ప‌రిచాయి. దీంతో బ్యాంకు, ఫైనాన్స్ షేర్ల‌కు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో వోలటైల్ మార్కెట్‌లోనూ సూచీలు లాభపడ్డాయి.

News January 28, 2025

జూన్‌లోగా నామినేటెడ్ పదవుల భర్తీ: CBN

image

AP: పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జూన్‌లోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1,100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ సభ్యులనే సిఫారసు చేయాలని సీఎం సూచించారు.

News January 28, 2025

ఏపీ మాజీ గవర్నర్‌ హరిచందన్‌కు అస్వస్థత

image

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. 2019 నుంచి 2023 వరకు బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి గవర్నర్‌గా సేవలు అందించారు.