India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల పాటు ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమం జరగనుంది. అబ్బాపురంలో మంత్రి సీతక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ‘నా గ్రామం నా గౌరవం’ నినాదంతో గ్రామాలు, పట్టణాల్లో జరిగే పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు, వనమహోత్సవంలో ప్రజలు పాలుపంచుకోవాలని మంత్రి సీతక్క కోరారు. పల్లెలు బాగుంటేనే, తెలంగాణ బాగుంటుందని చెప్పారు.
నేటి నుంచి శ్రావణ మాసం మొదలైంది. ఈ నెల శివపూజకు విశిష్టమైనదిగా పూజలు, వ్రతాలకు ప్రసిద్ధి అని హిందువులు నమ్ముతారు. శ్రావణ సోమవారాలు శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే శుభప్రదమని పండితులు అంటారు. కొత్తగా పెళ్లైన యువతులు ఈ మాసంలో మంగళవారాలు గౌరీ వ్రతాలు చేసుకుంటే సుమంగళిగా ఉంటారని విశ్వసిస్తారు. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీ వత్రం ఆచరిస్తే ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం.
కేరళ వయనాడ్‌లో ప్రకృతి విపత్తు భారీ విధ్వంసం సృష్టించింది. సహాయక చర్యల్లో భారత ఆర్మీ గంటల వ్యవధిలోనే తాత్కాలిక వంతెనను నిర్మించింది. దీంతో పలు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ ఏర్పడింది. ఒకవేళ ఈ ప్రాంతంలో కొత్త వంతెనను నిర్మించినా ఈ బ్రిడ్జిని కూల్చవద్దని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కోరారు. ఇది భారత ఆర్మీకి గౌరవ సూచికగా ఉండటమే కాకుండా వారు ఇచ్చిన భద్రతను గుర్తు చేస్తుందని ట్వీట్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో ఎన్ఆర్‌ఐల సహకారం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూఎస్ పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో NRIలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం అయ్యాకా కుటుంబ పాలనలో పదేళ్ల దోపిడి కాదు.. వందేళ్ల విధ్వంసం జరిగిందని గ్రహించా. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించింది. వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాను’ అని తెలిపారు. అంతకుముందు ఆయనకు స్థానికంగా ఘనస్వాగతం లభించింది.
*1895: జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ సిద్ధాంతవాది ఫ్రెడరిక్ ఎంగెల్స్ మరణం
*1908: పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత చక్రపాణి జననం
*1930: చంద్రునిపై మొట్టమొదటిసారి కాలుమోపిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జననం
*1962: హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో మరణం
*1974: సినీ నటి కాజోల్ జననం
*1991: హోండా కంపెనీని స్థాపకుడు సొయిఛిరో హోండా మరణం
అస్సాంలో లవ్ జిహాద్‌కు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బలవంతపు మతమార్పిడిలకు ప్రయత్నించే వారికి జీవిత ఖైదు విధించే యోచనలో హిమంత సర్కార్ ఉంది. త్వరలోనే దీనిపై చట్టాన్ని తీసుకురానున్నట్లు BJP కార్యనిర్వాహక సమావేశంలో సీఎం తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో జన్మించిన వారినే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులుగా పరిగణిస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
TG: షాద్‌నగర్‌లో ఎస్సీ మహిళను పోలీసులు దారుణంగా కొట్టిన <<13777846>>ఘటనపై<<>> సీఎం రేవంత్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనితో సంబంధం ఉన్నవారిని పోస్టు నుంచి తప్పించి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలన్నారు. బాధ్యులు ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
✒ తేది: ఆగస్టు 5, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:39 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:57 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:47 గంటలకు
✒ ఇష: రాత్రి 8.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
‘తంగలాన్’ అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే మూవీ అని హీరో విక్రమ్ అన్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. రంజిత్ దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకున్నా కొన్ని కారణాలతో కుదరలేదని చెప్పారు. ‘తంగలాన్’ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుందన్నారు. మధ్యలో అభిమానులు ‘ఆస్కార్.. ఆస్కార్’ అని కేరింతలు కొట్టగా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్‌తో రెండు సినిమాలు చేశానని నవ్వుతూ విక్రమ్ సమాధానమిచ్చారు.
Sorry, no posts matched your criteria.