News November 7, 2024

ఓటమిని ఒప్పుకోవాల్సిందే.. సంతృప్తిగానే ఉన్నా: కమలా హారిస్

image

అమెరికా ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని కమలా హారిస్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తాను ఇప్పటివరకు సాధించినదాని పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా మంది దేశం చీకటిలోకి వెళ్తుందని భావిస్తున్నారు. కానీ అలా జరగదని నేను నమ్ముతున్నా. అమెరికా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ప్రజలందరికీ న్యాయం, గౌరవం, అవకాశాల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.

News November 7, 2024

DSCలో ‘సమగ్ర శిక్ష’ సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్

image

AP: సమగ్రశిక్ష పథకం కింద పనిచేస్తున్న CRP, MIS కోఆర్డినేటర్లు, CRTలకు మెగా డీఎస్సీలో వెయిటేజీ మార్కులు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. వీరు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పేర్కొంది. విధుల్లో బిజీగా ఉన్నందున మిగిలిన అభ్యర్థుల్లా వీరికి సన్నద్ధతకు అవకాశం ఉండదని తెలిపింది. 2019 డీఎస్సీలోనూ వెయిటేజ్ మార్కులు ఇచ్చారని గుర్తు చేసింది.

News November 7, 2024

పచ్చి పాలు తాగుతున్నారా?

image

పాలు తాగడం మంచి అలవాటే. కానీ, పచ్చి పాలను కాచకుండా తాగడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే శరీరానికి కలిగే దుష్ర్పభావాలు ఇవే. ఫుడ్ పాయిజనింగ్, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు సంభవించడం, యువకుల్లో ప్రాణాపాయం కలిగించే ఇన్ఫెక్షన్ రావడం, మహిళల్లో గర్భస్రావ పరిస్థితులు ఏర్పడటం వంటి ప్రమాదాలు జరగవచ్చు.

News November 7, 2024

కులగణనకు మద్దతుగా చైతన్య యాత్ర

image

TG: కులగణనకు మద్దతుగా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు చైతన్య యాత్రను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కులగణన సమగ్రంగా జరిగితే BCల లెక్క తేలుతుందన్నారు. దీంతో జనాభా ప్రకారం బీసీలకు బడ్జెట్, రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ యాత్ర ద్వారా 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, 650 మండలాలు, 12,750 గ్రామాల్లో బీసీలను చైతన్యం చేస్తామని ఆయన చెప్పారు.

News November 7, 2024

అమెరికా CIA చీఫ్‌గా కశ్యప్ పటేల్?

image

ట్రంప్ ప్రభుత్వంలో ఇండో అమెరికన్‌కు అత్యున్నత పదవి దక్కనున్నట్లు సమాచారం. గూఢచార సంస్థ CIA చీఫ్‌గా కశ్యప్ పటేల్‌ను నియమిస్తారని తెలుస్తోంది. గుజరాత్ మూలాలున్న ఈయన పూర్వీకులు తూర్పు ఆఫ్రికా నుంచి USకు వలస వచ్చారు. పటేల్ 1980లో న్యూయార్క్‌లో జన్మించారు. లండన్ వర్సిటీ నుంచి ఇంటర్నేషన్ లా అభ్యసించారు. ట్రంప్ తొలి టర్మ్‌లో డిఫెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాల్లోని అత్యున్నత పదవుల్లో కశ్యప్ పనిచేశారు.

News November 7, 2024

BSNL సంచలనం.. సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్‌లు?

image

సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్‌‌లు చేసేలా సరికొత్త టెక్నాలజీని BSNL త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో నెట్‌వర్క్ లేకపోయినా, సముద్రాలు, విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నా సేవలు పొందవచ్చు. డైరెక్ట్ టూ డివైజ్ టెక్నాలజీ కోసం USకు చెందిన వయాశాత్‌తో కలిసి దీనిని పరీక్షిస్తోంది. శాటిలైట్, ప్రాంతీయ మొబైల్ నెట్‌వర్క్‌లను లింక్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. శాటిలైట్లే సెల్‌ఫోన్ టవర్లు అవుతాయి.

News November 7, 2024

MBBS సీటొచ్చినా.. కూలి పనులకు!

image

TG: సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతికి ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలి పనులకు వెళ్తున్నారు. తుంగతుర్తి మండలం వెంపటికి చెందిన శిగ గౌతమి మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. నీట్‌లో 507 మార్కులు సాధించి మంచిర్యాల మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారు. పుస్తకాలు, దుస్తులు, ఫీజులకు రూ.1,50,000 ఖర్చు అవుతుంది. కానీ అంత డబ్బు తమ దగ్గర లేకపోవడంతో కూలి పనులకు వెళ్తున్నారు. దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు.

News November 7, 2024

US ఎన్నికలు: అమెరికాలో ఎక్కువ సెర్చ్ చేసింది ఏంటంటే?

image

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో గెలుపెవరిదో తెలుసుకునేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. గత నెల 31 నుంచి ఈనెల 6వరకు ఇండియాలో ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేశారో గూగుల్ ట్రెండ్స్ రివీల్ చేసింది. ఇండియాలో అధికంగా డొనాల్డ్ ట్రంప్ గురించి సెర్చ్ చేసినట్లు తెలిపింది. కేవలం తమిళనాడులోనే కమలా హారిస్ గురించి సెర్చ్ చేశారు. అత్యధికంగా సెర్చ్ చేసింది మాత్రం డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిన విషయం గురించే.

News November 7, 2024

ఫార్ములా ఈ-కార్ రేసింగ్.. అసలేం జరిగింది?

image

TG: 2023లో నిర్వహించిన ఫార్ములా- ఈ కార్ రేస్‌కు ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో <<14548797>>KTR <<>>రిక్వెస్ట్‌తో 2024 FEBలో జరగాల్సిన 2వ దఫా రేస్‌ నిర్వహణకు HMDA ₹55 కోట్లు FEOకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ₹55cr ఇవ్వడంపై కాంగ్రెస్ GOVT తప్పుబట్టింది. KTR మౌఖిక ఆదేశాలతోనే చెల్లించినట్లు పురపాలక శాఖ కమిషనర్ విచారణలో తెలిపారు.

News November 7, 2024

131 ఏళ్లలో ఒకే ఒక్కడు ట్రంప్

image

అమెరికా అధ్యక్ష పీఠంపై వరుసగా రెండుసార్లు కూర్చున్న నేతలు 15 మంది ఉన్నారు. వారిలో లింకన్, నిక్సన్, క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా ముఖ్యులు. అయితే తొలి దఫా(2016-20) తర్వాత వెంటనే కాకుండా నాలుగేళ్ల వ్యవధి అనంతరం పదవి చేపట్టిన రెండో నేతగా ట్రంప్ నిలిచారు. గత 131 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. చివరిసారిగా గ్రోవర్ క్లీవ్‌లాండ్(1885-89, 1893-97) ఇలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.