India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘దేవర’ సినిమా నుంచి రెండో పాటను రేపు సా.5:04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. Jr.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా, రేపు రిలీజయ్యే లవ్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
శ్రీశైలం నుంచి భారీ వరద కొనసాగుతుండటంతో రేపు నాగార్జునసాగర్ జలాశయం గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 3.21 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 575 అడుగులుగా ఉంది. జలాశయం ఫుల్ కెపాసిటీ 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 269 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాలువల ద్వారా 38వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
భారత్‌తో రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 240/9 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఆవిష్క ఫెర్నాండో 40, వెల్లలాగే 39, కమిందు మెండిస్ 40, కుశాల్ 30 రన్స్ చేశారు. భారత బౌలర్లలో సుందర్ 3, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా, సిరాజ్, అక్షర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే IND 50 ఓవర్లలో 241 రన్స్ చేయాలి.
ఆండ్రాయిడ్ 4, IOS 11, KAI OS 2.4 వెర్షన్లతో పాటు వాటికంటే పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. యాపిల్, సాంసంగ్, హువాయి, మోటరోలా కంపెనీలకు చెందిన 35 ఫోన్లు ఈ <
రిజర్వేషన్లపై చెలరేగిన <<13679462>>హింస<<>> చల్లారిందనుకున్న తరుణంలో మరోసారి బంగ్లాదేశ్‌లో ఘర్షణలు మొదలయ్యాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రోడ్డెక్కారు. ఈ క్రమంలో హసీనా మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈరోజు సా.6.30 నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇది అమలు కానుంది.
IPL-2025 మెగా వేలానికి ముందు కెప్టెన్ హార్దిక్ పాండ్యను వదులుకోవాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో అతడి కెప్టెన్సీలో MI లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా హార్దిక్ విఫలమయ్యారు. దీంతో అతడిని రిటైన్ చేసుకోకూడదని MI నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్థానంలో SKYను కెప్టెన్‌గా నియమించుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి భారత అభిమానులను నిరాశపర్చింది. అయితే సేన్ ఒలింపిక్ మెడల్ సాధించేందుకు మరో అవకాశం ఉంది. రేపు జరిగే మ్యాచ్‌లో మలేషియా ఆటగాడు లీ జీపై గెలిస్తే కాంస్య పతకం లక్ష్యసేన్‌ను వరిస్తుంది. రేపు సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా సెమీస్‌లో లక్ష్యసేన్‌పై గెలిచిన విక్టర్ అక్సెల్‌సెన్, విటిడ్‌సార్న్‌తో (థాయ్‌లాండ్) ఫైనల్‌లో తలపడనున్నారు. <<-se>>#Olympics2024<<>>
AP: రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారిపోయిందని వైఎస్ జగన్ విమర్శించారు. ‘ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో దాడులు జరుగుతున్నాయి. హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో ఎవరూ ప్రశ్నించకూడదని వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని #SaveAPFromTDP హ్యాష్‌ట్యాగ్‌తో మాజీ సీఎం ట్వీట్ చేశారు.
AP: పింఛన్ల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన ఆప్షన్‌ను గ్రామ, వార్డు సచివాలయాలల్లో అందుబాటులో ఉంచింది. కొందరు ఉపాధి కోసం APలోని వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరు పింఛను కోసం ప్రతి నెలా సొంతూరు రావాల్సి వస్తోంది. ఇకపై ఇలాంటి వారు పెన్షన్ ట్రాన్స్‌ఫర్‌కు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ఎక్కడికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం, సచివాలయ వివరాలు అందించాల్సి ఉంటుంది.
AP: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. ఫ్యాక్షన్‌ను అణచివేయడంలో చంద్రబాబు దిట్ట అని తెలిపారు. మోదీ ఆశీస్సులతో AP అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాయలసీమనే కాదు రాష్ట్రాన్నే అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబుకి ఉందన్నారు. పెన్నా-గోదావరి నదుల అనుసంధానానికి CBN భగీరథ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. విభజన హామీల్లో వచ్చిన మేరకు తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.