News August 4, 2024

బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 32 మంది మృతి

image

రిజర్వేషన్లపై చెలరేగిన <<13679462>>హింస<<>> చల్లారిందనుకున్న తరుణంలో మరోసారి బంగ్లాదేశ్‌లో ఘర్షణలు మొదలయ్యాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రోడ్డెక్కారు. ఈ క్రమంలో హసీనా మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈరోజు సా.6.30 నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇది అమలు కానుంది.

News August 4, 2024

పాండ్యను ముంబై వదులుకుంటుందా?

image

IPL-2025 మెగా వేలానికి ముందు కెప్టెన్ హార్దిక్ పాండ్యను వదులుకోవాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో అతడి కెప్టెన్సీలో MI లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా హార్దిక్ విఫలమయ్యారు. దీంతో అతడిని రిటైన్ చేసుకోకూడదని MI నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్థానంలో SKYను కెప్టెన్‌గా నియమించుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News August 4, 2024

BADMINTON: ఇక మిగిలింది కాంస్యమే

image

బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి భారత అభిమానులను నిరాశపర్చింది. అయితే సేన్ ఒలింపిక్ మెడల్ సాధించేందుకు మరో అవకాశం ఉంది. రేపు జరిగే మ్యాచ్‌లో మలేషియా ఆటగాడు లీ జీపై గెలిస్తే కాంస్య పతకం లక్ష్యసేన్‌ను వరిస్తుంది. రేపు సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా సెమీస్‌లో లక్ష్యసేన్‌పై గెలిచిన విక్టర్ అక్సెల్‌సెన్, విటిడ్‌సార్న్‌తో (థాయ్‌లాండ్‌) ఫైనల్‌లో తలపడనున్నారు. <<-se>>#Olympics2024<<>>

News August 4, 2024

ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో దాడులు: జగన్

image

AP: రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారిపోయిందని వైఎస్ జగన్ విమర్శించారు. ‘ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో దాడులు జరుగుతున్నాయి. హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో ఎవరూ ప్రశ్నించకూడదని వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని #SaveAPFromTDP హ్యాష్‌ట్యాగ్‌తో మాజీ సీఎం ట్వీట్ చేశారు.

News August 4, 2024

పెన్షన్‌దారులకు సూపర్ న్యూస్

image

AP: పింఛన్ల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన ఆప్షన్‌ను గ్రామ, వార్డు సచివాలయాలల్లో అందుబాటులో ఉంచింది. కొందరు ఉపాధి కోసం APలోని వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరు పింఛను కోసం ప్రతి నెలా సొంతూరు రావాల్సి వస్తోంది. ఇకపై ఇలాంటి వారు పెన్షన్‌ ట్రాన్స్‌ఫర్‌కు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ఎక్కడికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం, సచివాలయ వివరాలు అందించాల్సి ఉంటుంది.

News August 4, 2024

ఫ్యాక్షన్‌ను అణచివేయడంలో చంద్రబాబు దిట్ట: టీజీ

image

AP: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. ఫ్యాక్షన్‌ను అణచివేయడంలో చంద్రబాబు దిట్ట అని తెలిపారు. మోదీ ఆశీస్సులతో AP అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాయలసీమనే కాదు రాష్ట్రాన్నే అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబుకి ఉందన్నారు. పెన్నా-గోదావరి నదుల అనుసంధానానికి CBN భగీరథ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. విభజన హామీల్లో వచ్చిన మేరకు తీసుకోవాలన్నారు.

News August 4, 2024

పెళ్లి కాకుండానే విడిపోయిన ‘దసరా’ విలన్

image

‘దసరా’ మూవీ విలన్ షైన్ టామ్ చాకో మోడల్ తనూజాతో విడిపోయారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించారు. ఓ ఇంటర్వ్యూలో కూడా తాను మళ్లీ సింగిల్ అని తెలిపారు. తమ బంధం కలుషితంగా మారిందని చెప్పారు. కాగా 40 ఏళ్ల టామ్ ఈ ఏడాది జనవరిలో తన స్నేహితురాలు తనూజాతో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నారు. మరోవైపు ఇప్పటికే ఆయనకు పెళ్లి కాగా భార్యకు విడాకులు ఇచ్చారు. ఓ కూతురు కూడా ఉంది.

News August 4, 2024

గాయంతో సెమీస్ నుంచి కరోలినా ఔట్.. సింధూ సపోర్ట్

image

పారిస్: ఉమెన్స్ బ్యాడ్మింటన్ సెమీస్‌‌లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్‌ (SPAIN) గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యారు. ఆట మధ్యలో మోకాలికి గాయం కాగా నొప్పిని భరిస్తూ ఆడేందుకు ప్రయత్నించినా వీలు కాకపోవడంతో కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగారు. కాగా సింధూ ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘నా క్లోజ్ ఫ్రెండ్, ప్రత్యర్థి కరోలినా త్వరగా కోలుకోవాలి. కరోలినా.. నేను నీకు అతిపెద్ద సపోర్టర్‌ని’ అని పేర్కొన్నారు.

News August 4, 2024

భూములు కాజేసేందుకు ప్రభుత్వం కుట్ర: బండి

image

TG: HYD శివారులో ఫోర్త్ <<13756217>>సిటీ<<>> ఏర్పాటు వెనుకు కాంగ్రెస్ ప్రభుత్వ భూదందా కుట్ర ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వేల ఎకరాలను దోచుకోవాలని చూస్తోందని, KCR బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని దుయ్యబట్టారు. ధరణి, భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. KCR కుటుంబ భూదోపిడీపై ఏం చర్యలు తీసుకున్నారని HYD గుర్రంగూడ బోనాల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా బండి ప్రశ్నించారు.

News August 4, 2024

చేజారిన గోల్డ్ ఆశలు.. లక్ష్యసేన్ ఓటమి

image

బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో లక్ష్యసేన్‌కు నిరాశే ఎదురైంది. తొలి సెట్లో మొదట దూకుడుగా ఆడిన సేన్ గేమ్ పాయింట్ వద్ద తడబడ్డారు. దీంతో ప్రత్యర్థి అక్సెల్‌సేన్‌కు వరుస పాయింట్లు దక్కి ఆ సెట్‌ను (22-20) సొంతం చేసుకున్నారు. రెండో సెట్లో వరుసగా ఏడు పాయింట్లు సాధించి ఆధిపత్యం చెలాయించిన సేన్ ఆ తర్వాత పట్టు కోల్పోయారు. దీంతో 14-21 తేడాతో ఆ సెట్ కూడా కోల్పోయి, మ్యాచ్ చేజార్చుకున్నారు. <<-se>>#Olympics2024<<>>