India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నేతన్నల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో నిర్వహించిన శారీ వాక్‌లో ఆమె పాల్గొన్నారు. భారతదేశం అంటే గుర్తొచ్చేది చీరకట్టు సంప్రదాయం అని అన్నారు. చీరలో అమ్మతనం, కమ్మదనం ఉంటుందని మంత్రి తెలిపారు. భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. సుమారు 8 వేల మంది యువతులు, మహిళలు ఈ శారీ వాక్‌లో పాల్గొన్నారు.
AP: ఇటీవల పలు టెలికం సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచడంతో BSNL వైపు యూజర్లు మొగ్గు చూపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో 2.17 లక్షల కొత్త కనెక్షన్లు రాగా ఆ సంస్థకు చెందిన మొత్తం కనెక్షన్ల సంఖ్య 40 లక్షలకు చేరింది. ఈ నెలాఖరులోగా 4జీ సేవలు అందుబాటులోకి రానుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా కనెక్షన్లు తీసుకుంటున్న వారు 45 రోజుల కాలపరిమితితో కూడిన రూ.249 రీఛార్జి ప్లాన్‌కే మొగ్గు చూపిస్తున్నారు.
WPLలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ బీసీసీఐని కోరారట. వచ్చే సీజన్‌లో తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థించినట్లు సమాచారం. కాగా డబ్ల్యూపీఎల్‌లో ప్రస్తుతం ఐదు జట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు కొనసాగుతున్నాయి.
కేరళలోని వయనాడ్ బాధితులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ అండగా నిలిచారు. తామిద్దరం కలిసి కేరళ CMRFకు రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు చిరు ట్వీట్ చేశారు. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు అల్లు అర్జున్ <<13774559>>రూ.25లక్షల<<>> విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
టీమ్ ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్: రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, దూబే, సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
శ్రీలంక: నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, కమిందు మెండిస్, లియానగే, వెల్లలగే, అకిల ధనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే
TG: కుటుంబ అనుబంధాలను చాటుతూ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ‘బలగం’, ‘దసరా’ చిత్రాలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కించుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డైరెక్టర్ వేణుతో పాటు బలగం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా శ్రీకాంత్ ఓదెల పురస్కారాలు దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈమేరకు సీఎంవో ట్వీట్ చేసింది.
తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజుల్లో గంటకు 30-40కి.మీ వేగంతో స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎలాంటి ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు జారీ చేయలేదు.
AP: గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన YCP నేతలందరూ జైలుకెళ్లడం ఖాయమని జమ్మలమడుగు BJP MLA ఆదినారాయణరెడ్డి అన్నారు. ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. ‘వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం. 200 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. సీఎం చంద్రబాబు పరిపాలన బాగా చేస్తున్నారు. మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
చైనాలో జననాల శాతం పడిపోతుండటంతో పెళ్లిపై ఓ డిగ్రీ కోర్సును ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ‘మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్‌మెంట్’గా పేరు పెట్టింది. పౌర వ్యవహారాల విశ్వవిద్యాలయంలో వచ్చే నెల నుంచి ఈ కోర్సు మొదలుకానుంది. 12 ప్రావిన్సుల నుంచి 70మంది అండర్‌గ్రాడ్యుయేట్లకు తొలి ఏడాది అడ్మిషన్ ఇవ్వనున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఇది చదివిన వారికి వివాహ సంబంధిత రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయని పేర్కొంది.
భారీ వర్షాలకు ఆలయం గోడ కూలి 9 మంది పిల్లలు మరణించిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని షాపూర్‌లో జరిగింది. స్థానిక హర్దౌల్ బాబా ఆలయంలో జరుగుతున్న సావన్ వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు వెళ్లారు. ఈక్రమంలోనే వర్షాలకు తడిసిన టెంపుల్ గోడ అక్కడ కూర్చున్న పిల్లలపై పడింది. దీంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 14 ఏళ్లలోపు వారే. గాయపడ్డ మరికొందరిని ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.