News August 4, 2024

ఒలింపిక్స్: THE WALL OF INDIA!.. అదరగొట్టిన శ్రీజేశ్

image

హాకీలో ప్రపంచ నం-2 బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ మన జట్టుకు వెన్నెముకగా నిలిచారు. రెడ్ కార్డు వల్ల డిఫెండర్ అమిత్ రోహిదాస్ దూరం కావడంతో మన జట్టు 10 మందితోనే ఆడింది. బ్రిటన్ కంటిన్యూగా అటాక్ చేసినా శ్రీజేశ్ పట్టువదలని విక్రమార్కుడిలా డిఫెండ్ చేశారు. షూటౌట్‌లోనూ అడ్డుగోడగా నిలిచారు. అతడిని ‘THE WALL OF INDIA!’ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

News August 4, 2024

ప్రభుత్వం ఇలా వ్యవహరించడం బాధాకరం: హరీశ్ రావు

image

TG: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు, కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘నిజామాబాద్(D) కొత్తపల్లి ప్రభుత్వ స్కూల్‌లో శుక్రవారం సరైన భోజనం లేకపోవడంతో విద్యార్థులు కారం, నూనె కలిపిన అన్నంతో కడుపు నింపుకున్నారు. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం. బిల్లులు, వేతనాల పెండింగ్‌ వల్లే సరైన భోజనం అందడం లేదు’ అని ట్వీట్ చేశారు.

News August 4, 2024

గంభీర్ ఎక్కువ కాలం కోచ్‌గా ఉండలేడు: జోగిందర్

image

ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్‌గా ఎక్కువ కాలం ఉండలేడని మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు. తనకు అతడిపై వ్యక్తిగత ద్వేషమేమీ లేదని చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్‌గా ఉండలేడు’ అని ఆయన పేర్కొన్నారు.

News August 4, 2024

అది తప్పుడు ప్రచారం.. నమ్మొద్దు: TTD

image

AP: తిరుమలకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు నేరుగా ప్రత్యేక దర్శనం కల్పిస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని TTD కోరింది. 3 నెలల ముందే ప్రతి నెలా 23న ఆన్‌లైన్ కోటా(రోజుకి 1000 మంది) విడుదల చేస్తామంది. అలా బుక్ చేసుకుని టికెట్లతో వచ్చిన వారినే అనుమతిస్తామని తెలిపింది. తిరుమలలోని నంబి ఆలయం వద్ద ఉన్న సీనియర్ సిటిజన్/PHC లైన్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతిస్తారని చెప్పింది.

News August 4, 2024

Olympics: క్వార్టర్స్‌లో ఓడిన లవ్లీనా

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గైన్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ బాక్సర్‌ లీ కియాన్(చైనా) చేతిలో 1-4 తేడాతో ఆమె ఓడిపోయారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా బ్రాంజ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.
<<-se>>#Olympics2024<<>>

News August 4, 2024

టీమ్ ఇండియాలో ప్రయోగాలు కొనసాగిస్తాం: బౌలింగ్ కోచ్

image

టీమ్ ఇండియా కోచ్‌గా గంభీర్ తన మొదటి సిరీస్‌లోనే ప్రయోగాలకు తెర తీశారు. గిల్, సూర్య, రింకూ వంటి బ్యాటర్లతో బౌలింగ్ చేయించారు. ఇకపైనా ప్రయోగాలు కొనసాగుతాయని భారత బౌలింగ్ కోచ్ బహుతులే వెల్లడించారు. ‘మన బ్యాటర్లలో బౌలింగ్ సత్తా కూడా ఉంది. కానీ దానిపై దృష్టి పెట్టడం లేదంతే. టాప్ ఆర్డర్ బ్యాటర్లు బౌలింగ్ చేయడం జట్టుకు అవసరం. మున్ముందూ వారితో బౌలింగ్ చేయిస్తాం’ అని వెల్లడించారు.

News August 4, 2024

భావితరాలు సంప్రదాయాలను కొనసాగించాలి: మంత్రి అనిత

image

AP: నేతన్నల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో నిర్వహించిన శారీ వాక్‌లో ఆమె పాల్గొన్నారు. భారతదేశం అంటే గుర్తొచ్చేది చీరకట్టు సంప్రదాయం అని అన్నారు. చీరలో అమ్మతనం, కమ్మదనం ఉంటుందని మంత్రి తెలిపారు. భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. సుమారు 8 వేల మంది యువతులు, మహిళలు ఈ శారీ వాక్‌లో పాల్గొన్నారు.

News August 4, 2024

రాష్ట్రంలో భారీగా పెరిగిన BSNL యూజర్లు

image

AP: ఇటీవల పలు టెలికం సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచడంతో BSNL వైపు యూజర్లు మొగ్గు చూపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో 2.17 లక్షల కొత్త కనెక్షన్లు రాగా ఆ సంస్థకు చెందిన మొత్తం కనెక్షన్ల సంఖ్య 40 లక్షలకు చేరింది. ఈ నెలాఖరులోగా 4జీ సేవలు అందుబాటులోకి రానుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా కనెక్షన్లు తీసుకుంటున్న వారు 45 రోజుల కాలపరిమితితో కూడిన రూ.249 రీఛార్జి ప్లాన్‌కే మొగ్గు చూపిస్తున్నారు.

News August 4, 2024

WPLలోకి మరో జట్టు?

image

WPLలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ బీసీసీఐని కోరారట. వచ్చే సీజన్‌లో తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థించినట్లు సమాచారం. కాగా డబ్ల్యూపీఎల్‌లో ప్రస్తుతం ఐదు జట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు కొనసాగుతున్నాయి.

News August 4, 2024

కేరళకు చిరంజీవి, రామ్‌చరణ్ రూ.కోటి విరాళం

image

కేరళలోని వయనాడ్ బాధితులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ అండగా నిలిచారు. తామిద్దరం కలిసి కేరళ CMRFకు రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు చిరు ట్వీట్ చేశారు. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు అల్లు అర్జున్ <<13774559>>రూ.25లక్షల<<>> విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.