India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్ర నూతన DGP హరీశ్ కుమార్ గుప్తా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న ఆయన తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అటు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత DGP ద్వారకా తిరుమలరావును ఏడాది పాటు RTC MDగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ, రైల్వేస్ మధ్య రేపు రంజీ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ ప్లేయర్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నట్లు ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ బదోని తెలిపారు. అటు 13 ఏళ్ల తర్వాత విరాట్ రంజీ క్రికెట్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోవాలని DDCA కోరగా కోహ్లీ తిరస్కరించిన విషయం తెలిసిందే. Jiocinema ఈ మ్యాచ్‌ను టెలికాస్ట్ చేయనుంది.

AP: ప్రభుత్వ స్కూళ్లలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా కార్యక్రమం చేపట్టాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ప్రైమరీ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి క్లాస్‌కు ఒక టీచర్‌ను నియమించే అంశం పరిశీలించాలన్నారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు, పేరెంట్స్ అభిప్రాయాలు IVRS ద్వారా తీసుకోవాలని సూచించారు. బాలికల స్వీయరక్షణ ట్రైనింగ్ కోసం శిక్షకులను నియమించాలని చెప్పారు.

బ్రెయిన్ హెల్త్‌పై రోజువారీ అలవాట్లు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. *అధిక సమయం కూర్చొని ఉండడం. *సరిపడా నిద్రపోకపోవడం. *ఒంటరిగా గడపడం. *ఆరోగ్యకరమైనదైనా సరే అధికంగా తినడం. *హెడ్‌ఫోన్స్‌లో అధిక వాల్యూమ్‌లో సంగీతం వినడం. *ప్రతికూల ఆలోచనలు, అనవసర భయాందోళనలు-ఒత్తిడికి గురవడం వంటి రోజువారీ అలవాట్లు మెదడు ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

TG: రాష్ట్రంలో ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా అత్యుత్తమ పాలసీ రూపొందించాలన్నారు. సమ్మక్క, సారలమ్మ జాతర సమయంలో పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్త ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జాతర సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ సర్క్యూట్ అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

మహా కుంభమేళా సందర్భంగా పదుల సంఖ్యలో భక్తులు తొక్కిసలాటలో మృతి చెందడంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విచారం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం అరకొర ఏర్పాట్లు చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. వీఐపీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కుంభమేళా ఏర్పాట్లపై ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడం కూడా తొక్కిసలాటకు కారణమని పేర్కొన్నారు.

రైల్వేలో 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి <<15227255>>దరఖాస్తుల <<>>స్వీకరణ కొనసాగుతోంది. అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. వయసు 18-36 ఏళ్లలోపు ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500. ప్రిలిమ్స్‌కు హాజరైతే రూ.400 వెనక్కి వస్తుంది. CBT, PET, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <

PG మెడికల్ కోర్సుల్లో రెసిడెన్స్ బేస్డ్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కోటా కింద PG సీట్ల కేటాయింపు ఆర్టికల్ 14కు వ్యతిరేకమని పేర్కొంటూ ఈ విధానాన్ని రద్దు చేసింది. నీట్ పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఈ సీట్లను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఇదివరకే అమలు చేసిన నివాస ఆధారిత రిజర్వేషన్ల విషయంలో తాజా తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోదని పేర్కొంది.

AP కొత్త డీజీపీగా హరీశ్ గుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుండటంతో హరీశ్ గుప్తాను నియమించింది. కాగా ఎన్నికల సమయంలోనూ హరీశ్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు.

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఇవాళ జరిగిన <<15303488>>తొక్కిసలాట<<>>పై న్యాయ విచారణ జరిపిస్తాం అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. జస్టిస్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఇవాళ అర్ధరాత్రి తర్వాత జరిగిన తొక్కిసలాటలో 30మంది మృతి చెందినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.