News November 6, 2024

BIG BREAKING: అల్లు అర్జున్‌కు ఊరట

image

AP: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. నంద్యాలలో ఆయనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాలకు వెళ్లగా, అనుమతి లేని పర్యటన, కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పిచ్చింది.

News November 6, 2024

పుంజుకున్న కమలా హారిస్.. తేడా 20 ఓట్లే

image

అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ అనూహ్యంగా పుంజుకున్నారు. ప్రత్యర్థితో పోలిస్తే కేవలం 20 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ 230, కమల 210తో నిలిచారు. ఒకానొక దశలో 100 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమెను కాలిఫోర్నియా, హవాయి, వర్జీనియా, నెబ్రాస్కా, న్యూమెక్సికో, వాషింగ్టన్ ఆదుకున్నాయి. నార్త్ కరోలినాను దక్కించుకోవడంతో వైట్‌హౌస్‌కు ట్రంప్ మార్గం సుగమమైందని తెలుస్తోంది.

News November 6, 2024

T-HUB స్టార్టప్‌ కంపెనీ ఘనత.. KTR విషెస్

image

TG: హైదరాబాద్‌లోని టీహబ్‌లో ఏర్పాటైన తెలంగాణకు చెందిన స్టార్టప్ కంపెనీ మారుత్ డ్రోన్స్ 6.2మిలియన్ డాలర్ల ఫండింగ్ సాధించడం పట్ల కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. T-HUB 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించడం సంతోషంగా ఉందన్నారు. మారుత్ డ్రోన్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

News November 6, 2024

సర్వేకు ప్రజలు సహకరించాలి: మంత్రి పొన్నం

image

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు. అందరికీ న్యాయం చేయడం కోసమే సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను, అపోహలను నమ్మొద్దని సూచించారు.

News November 6, 2024

విద్యార్థులకు శుభవార్త

image

JEE అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఇకపై వరుసగా మూడేళ్లు రాయొచ్చు. ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే రాసేందుకు అవకాశం ఉండగా, 2025లో నిర్వహించే అడ్వాన్స్‌డ్ పరీక్ష నుంచి మూడు సార్లు అటెంప్ట్ చేయొచ్చని కేంద్రం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2023లో ఇంటర్ పాసైన వారు కూడా ఈ సారి పరీక్ష రాయవచ్చని పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. 2000 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొంది.

News November 6, 2024

రోహిత్ శర్మ రిటైర్ కావొచ్చు: శ్రీకాంత్

image

ఆస్ట్రేలియాతో జరిగే BGTలో విఫలమైతే రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పొచ్చని మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు BCCI ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అతడి వయసు పెరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి. కివీస్ సిరీస్‌లో ఆడలేదని రోహిత్ అంగీకరించడం గ్రేట్. అతను గాడినపడేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ విఫలమైతే అతడే తప్పుకుంటాడు’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

News November 6, 2024

ట్రంప్ గెలిస్తే.. పాలనలో జోక్యంపై మస్క్ హింట్

image

డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ప్రభుత్వ పాలనలో ఆయనకు సాయపడతానని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. ఫెడరల్ ఏజెన్సీల సంఖ్యను కుదిస్తానని పేర్కొన్నారు. ‘మన బ్యూరోక్రసీ చాలా పెద్దది. పైగా మన దేశంలో నియంత్రణలు ఎక్కువ. వాటిని తగ్గించాల్సి ఉంది. అమెరికాను మరింత మెరుగ్గా నిర్మించేవాళ్లకు సాయపడాలి’ అని టక్కర్ కార్ల్‌సన్‌షోలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ కచ్చితంగా గెలుస్తారని మస్క్ నమ్మకంతో ఉన్నారు.

News November 6, 2024

రైల్వే లైన్ల సర్వే కోసం నిధులు

image

AP: మచిలీపట్నం-రేపల్లె, రేపల్లె-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్ల నిర్మాణాల సర్వే కోసం రైల్వే బోర్డు నిధులు విడుదల చేసింది. మచిలీపట్నం-రేపల్లె మధ్య 45.30KM DPR కోసం ₹1.13 కోట్లు, బాపట్ల-రేపల్లె మధ్య 45.81KM మేర DPRకై రూ.1.15 కోట్లు విడుదలయ్యాయి. ఈ 2 రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే చెన్నై-హౌరా వెళ్లే రైళ్లు విజయవాడ వెళ్లకుండా మచిలీపట్నం మీదుగా రాకపోకలు సాగించవచ్చు. విజయవాడ స్టేషన్‌పై భారం తగ్గుతుంది.

News November 6, 2024

APPLY: భారీ జీతంలో 1500 ఉద్యోగాలు

image

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI)లో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. APలో 200, TGలో 200 ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ, పది/ఇంటర్‌లో స్థానిక భాషను చదివి ఉన్నవారు అర్హులు. వయసు OCT 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించొద్దు. NOV 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే అలవెన్సులతో కలిపి జీతం రూ.77 వేల వరకు పొందొచ్చు. వెబ్‌సైట్: https://www.unionbankofindia.co.in/

News November 6, 2024

‘ఆవేశం’ మూవీని రీమేక్ చేయనున్న రవితేజ?

image

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన ‘ఆవేశం’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను మాస్ మహారాజా రవితేజ కొనుగోలు చేశారని, దీనిని ఆయన రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ జరగనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. జీతూ మాధవన్ ‘ఆవేశం’ మూవీని తెరకెక్కించగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజై రూ.150కోట్లు వసూలు చేసింది.