News November 6, 2024

స్టాక్ మార్కెట్లకు కిక్కిచ్చిన US Elections Results

image

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడం, US ఎన్నికల ఫలితాలు ఒకే దిశగా సాగుతుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 5% తగ్గడం అనిశ్చితి తగ్గిందనడానికి నిదర్శనం. సెన్సెక్స్ 79911 (+435), నిఫ్టీ 24,386 (+173) వద్ద ట్రేడవుతున్నాయి. IT, రియాల్టి, Oil & Gas సూచీలు అదరగొడుతున్నాయి. Infy, Trent టాప్ గెయినర్స్.

News November 6, 2024

US ఎలక్షన్స్: పాపులర్, ఎలక్టోరల్ ఓట్లు అంటే ఏంటి?

image

అమెరికా ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కువ ఓట్లు(పాపులర్ ఓటింగ్) పొందిన అభ్యర్థి కాకుండా ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ వచ్చినవారే ప్రెసిడెంట్ అవుతారు. 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుంటాయి. పార్టీలు నిలబెట్టిన ఎలక్టర్లకు ప్రజలు ఓట్లు వేస్తారు. వాళ్లు ప్రెసిడెంట్, వైస్‌ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారు. 2016లో హిల్లరీకి అధిక ఓట్లు వచ్చినా ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ రావడంతో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు.

News November 6, 2024

ఏపీలో మైనర్ బాలికపై అత్యాచారం

image

APలో మరో ఘోరం జరిగింది. నెల్లూరు నగరంలో రీల్స్ పేరుతో బాలిక(14)ను మభ్యపెట్టి ఆటోడ్రైవర్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి, ఇతర బంధువులు ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై నవాబుపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

News November 6, 2024

IPL: రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్ ఆటగాళ్లు వీరే

image

ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో కొందరు విదేశీ స్టార్ ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ప్రకటించుకున్నారు. వీరిలో వార్నర్, స్టార్క్, స్టీవ్ స్మిత్, స్టొయినిస్, బెయిర్‌స్టో, జంపా, అట్కిన్‌సన్, బట్లర్, రబాడ, మ్యాక్స్‌వెల్, విలియమ్సన్, మార్క్ వుడ్, ఆర్చర్, మార్ష్, జంపా తదితరులు ఉన్నారు. వీరిలో ఎవరు అత్యధిక ధర పలుకుతారో కామెంట్ చేయండి.

News November 6, 2024

సర్వేలో ‘స్పెషల్ కాలమ్‌’ విజ్ఞప్తిని పరిశీలించండి: హైకోర్టు

image

TG: సమగ్ర కుటుంబ సర్వేలో వినియోగించే ఫారాల్లో కులం, మతం వెల్లడించని వారి వివరాల నమోదుకు ప్రత్యేక కాలమ్స్ ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులేంటో తెలియజేయాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. రాజ్యాంగంలోని అధికరణ 25(1) ప్రకారం నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొంది. దీనిపై పిటిషనర్ విజ్ఞప్తిని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలంది. విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది.

News November 6, 2024

DON’T MISS.. ఇవాళే లాస్ట్ డేట్

image

తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ <<14532979>>గ్రాడ్యుయేట్<<>>, టీచర్ MLC, APలోని గుంటూరు-కృష్ణా, తూర్పు-ప.గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఓటర్ల <>నమోదుకు <<>>గడువు ఇవాళ్టి(నవంబర్ 6)తో ముగియనుంది. నిన్న వెబ్‌సైటు మొరాయించడంతో చాలా మంది ఓటు నమోదు చేసుకోలేకపోయారు. దీంతో దరఖాస్తు గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు తమ ఫోన్లకు SMS రావడంలేదని వాపోతున్నారు.

News November 6, 2024

వెంకట్రామిరెడ్డిపై విచారణకు ఆదేశం

image

AP: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించడంతో పాటు YCPకి మద్దతుగా ప్రచారం చేసి సర్వీస్ రూల్స్ అతిక్రమించారనే ఫిర్యాదులపై YSR జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారించి, నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఫిర్యాదులతో ఏప్రిల్‌లోనే ఆయనను ఈసీ సస్పెండ్ చేయగా, చర్యల్లో భాగంగా విచారణకు ప్రభుత్వం నిన్న ఆదేశాలిచ్చింది.

News November 6, 2024

20 రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపు

image

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఎన్నికల కౌంటింగ్‌లో దూసుకెళ్తున్నారు. 20 రాష్ట్రాల్లో ఆయన గెలుపొందారు. మిసిసిపీ, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహాయో, ఓక్లహామో, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, టెక్సాస్, మిస్సోరీలో విజయం సాధించారు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ 11 రాష్ట్రాల్లో గెలుపొందారు. ఇల్లినోయీ, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్‌లో గెలిచారు.

News November 6, 2024

IPL AUCTION: ఏ దేశం నుంచి ఎంతమందంటే?

image

ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలానికి మొత్తం 1,574 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో భారత్ నుంచి 1,165 మంది ప్లేయర్లు ఉన్నారు. సౌతాఫ్రికా-91, ఆస్ట్రేలియా-76, ఇంగ్లండ్-52, న్యూజిలాండ్-39, వెస్టిండీస్-33, అఫ్గానిస్థాన్-29, శ్రీలంక-29, బంగ్లాదేశ్-12, నెదర్లాండ్స్-12, యూఎస్ఏ-10, ఐర్లాండ్-9, జింబాబ్వే-8, కెనడా-4, స్కాట్లాండ్-2, యూఏఈ-1, ఇటలీ-1 నమోదు చేసుకున్నారు.

News November 6, 2024

TTD ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణం

image

AP: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈఓ శ్యామలరావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు బోర్డు సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.