News November 6, 2024

నాన్న గెలవకపోతే దేశం వదిలి వెళ్లిపోతా: జూనియర్ ట్రంప్

image

అమెరికా ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లైవ్‌ సెషన్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఫలితాల ప్రకటన తర్వాత తన ప్రణాళిక ఎలా ఉంటుందో వెల్లడించారు. ఒకవేళ తన తండ్రి గెలవకపోతే డెమొక్రట్ల పనితీరు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను వేరే దేశానికి వెళ్లిపోతానని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ట్రంప్ 188 ఓట్లతో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.

News November 6, 2024

మందుబాబులకు BIG SHOCK?

image

తెలంగాణలో లిక్కర్ రేట్ల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీరుపై రూ.15-20, క్వార్టర్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.10 నుంచి రూ.80 వరకు పెంచే అవకాశం ఉంది. సగటున 20-25శాతం వరకు ధరలు పెంచి, నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం.

News November 6, 2024

కుటుంబ సర్వే.. ఫొటోలు తీయరు, పత్రాలేమీ తీసుకోరు

image

TG: నేటి నుంచి ప్రారంభం కానున్న కుటుంబ సర్వేలో 75 ప్రశ్నలను అడగనున్నారు. అయితే సర్వేలో భాగంగా కుటుంబ ఫొటోలు ఏమీ తీయరు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. ఇంట్లో అందరూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ యజమాని వివరాలు చెబితే సరిపోతుంది. కుటుంబీకుల్లో ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తే ఆ వివరాలు నమోదు చేస్తారు. ప్రజాప్రతినిధులు వారి ప్రస్తుత, పూర్వపు పదవీ వివరాలు చెప్పాలి. సమాచారం గోప్యంగా ఉంచుతారు.

News November 6, 2024

తప్పు గుణపాఠాన్ని నేర్పుతుంది: PGK

image

జీవితంలో ఎన్నో ఒడిదొడుకులతో పాటు తప్పులు కూడా జరుగుతుంటాయి. అలాంటప్పుడు కొందరు తప్పు చేశామని ఎంతో బాధపడుతుంటారు. అయితే, మనం చేసే ప్రతి తప్పు ఒక గుణపాఠాన్ని నేర్పుతూ ఉంటుందని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ‘తప్పు దిద్దుకొని ముందడుగు వెయ్యకపోతే ఓటమి నుంచి బయటపడలేమని తెలుసుకొని మసలుకోండి సన్నిహితులారా’ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

News November 6, 2024

ఎల్లుండి ఓటీటీలోకి ‘వేట్టయన్’

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ ఫిక్స్ అయింది. ఈనెల 8 నుంచి మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు.

News November 6, 2024

నీరు పొదుపుగా వాడుకోండి: KRMB లేఖ

image

సాగునీటి ప్రాజెక్టుల్లోని నీటిని తాగు, సాగుకి వాడుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. 2025 వానాకాలం వరకు రిజర్వాయర్లలో నీరు ఉండేలా చూసుకోవాలని సూచించింది. విద్యుదుత్పత్తి కోసం నీటిని దిగువకు విడుదల చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని, అవసరం లేకుండా ఇతర కాంపోనెంట్ల ద్వారా నీటి తరలింపు ఆపాలంది.

News November 6, 2024

నటి కస్తూరిపై కేసు నమోదు

image

తెలుగు వారిపై అనుచిత<<14525601>> వ్యాఖ్యలు<<>> చేసిన నటి కస్తూరిపై తమిళనాడులో కేసు నమోదైంది. ఆమెపై పలు తెలుగు, తమిళ సంఘాలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే భారీ నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు సెక్షన్లతో ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ కస్తూరి క్షమాపణలు తెలిపారు.

News November 6, 2024

YCP సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులు

image

AP: రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా సభ్యులపై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీందర్ రెడ్డి, కల్లి నాగిరెడ్డి, కళ్లం హరికృష్ణారెడ్డి, బోడే వెంకటేశ్, మేకా వెంకట్రామిరెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎన్నారై పంచ్ ప్రభాకర్‌పై విజయవాడలో పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 6, 2024

ఒంటిపూట బడులు వద్దని హరీశ్ డిమాండ్

image

TG: కులగణన నుంచి ప్రభుత్వ స్కూళ్ల టీచర్లను మినహాయించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. వారి సేవలను ఇలా వినియోగించుకోవడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. సర్వే కోసం స్కూళ్లను మధ్యాహ్నం వరకే నడపడం సరికాదన్నారు. అకస్మాత్తుగా <<14536930>>ఒంటిపూట<<>> బడులు నడపడం వల్ల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం దిగజారిపోతోందన్నారు.

News November 6, 2024

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా జోస్ ఇంగ్లిస్

image

ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్‌ను సీఏ నియమించింది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ గైర్హాజరీ నేపథ్యంలో ఆయన సారథ్య బాధ్యతలు అందుకున్నారు. అలాగే కమిన్స్, స్మిత్, హేజిల్‌వుడ్‌కు రెస్ట్ ఇవ్వడంతో పాక్‌తో జరగబోయే మూడో వన్డేకు కూడా ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. కాగా ఇంగ్లిస్ ఇప్పటివరకు 26 అంతర్జాతీయ టీ20లే ఆడారు. 100 మ్యాచులు ఆడిన సీనియర్లను కాదని ఆయనను సారథిగా నియమించారు.