News November 5, 2024

బరాక్ ఒబామాకు సిద్ద రామయ్య ఆహ్వానం

image

అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాకు CM సిద్ద రామ‌య్య ప్ర‌త్యేక ఆహ్వానాన్ని పంపారు. 1924లో బెల‌గావిలో జరిగిన 39వ భార‌త జాతీయ కాంగ్రెస్ స‌ద‌స్సు అధ్య‌క్షుడిగా మ‌హాత్మా గాంధీ బాధ్య‌త‌లు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వచ్చే నెల బెలగావిలో శతాబ్ది ఉత్సవాలతోపాటు శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఒబామాను సిద్ద రామయ్య కోరారు.

News November 5, 2024

పెళ్లి కుదర్చలేదని మ్యాట్రిమోనీ సైట్‌కు రూ.60వేలు ఫైన్!

image

బెంగళూరులో దిల్మిల్ మ్యాట్రిమోనీ సైట్ ఓ వ్యక్తికి పెళ్లి కుదర్చలేకపోయినందుకు కన్జూమర్ కోర్టు ₹60వేల ఫైన్ విధించింది. ఆ మొత్తాన్ని సదరు కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశించింది. తన కొడుక్కి 45రోజుల్లో మ్యాచ్ కుదుర్చుతామని హామీ ఇవ్వడంతో ఓ కస్టమర్ ₹30వేలు చెల్లించాడు. రోజులు గడుస్తున్నా ఒక్క మ్యాచ్ కూడా కుదర్చలేదు. దీంతో తన అమౌంట్ రీఫండ్ చేయాలని అతడు కమిషన్‌ను ఆశ్రయించాడు. ఫలితంగా ఈ తీర్పు వచ్చింది.

News November 5, 2024

రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం కేంద్రమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై పవన్ వివరించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా చర్చించే అవకాశం ఉంది. సమావేశం అనంతరం రేపు రాత్రి రాష్ట్రానికి తిరుగుపయనం కానున్నట్లు సమాచారం. కాగా హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.

News November 5, 2024

టెట్ దరఖాస్తులపై విద్యాశాఖ కీలక సూచన

image

TG: టెట్ దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సూచన చేసింది. సాంకేతిక కారణాలతో దరఖాస్తులు ఆలస్యమవుతుండడంపై స్పందించిన విద్యాశాఖ ఈనెల 7 నుంచి అప్లై చేసుకోవాలని సూచించింది. వాస్తవానికి నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తగా అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గడువు పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

News November 5, 2024

45 పైసలకే రూ.10 లక్షల బీమా

image

ప్రయాణికుల భద్రతకు భారతీయ రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో IRCTC కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో మార్పులు చేసింది. రైలు ప్రయాణం చేసేవారికి బీమా ప్రీమియం 45 పైసలుగా నిర్ణయించింది. ఇ-టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇది తప్పనిసరి చేసింది. అయితే టికెట్లు బుక్ చేసుకున్నా 5 ఏళ్ల లోపు వారిని ఈ పాలసీలోకి చేర్చలేదు. టికెట్ బుక్ చేసుకున్నాక బీమా కంపెనీ సైట్‌లో నామినీ వివరాలు సమర్పించాలి.

News November 5, 2024

IPL మెగా వేలం ఎక్కడంటే?

image

ఐపీఎల్ మెగావేలం ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్షన్ సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఆయా జట్లు రిటెన్షన్ జాబితాను సమర్పించాయి. ఈ మెగా వేలం కోసం 1,574 ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 320 మంది క్యాప్‌డ్, 1,224 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు.

News November 5, 2024

సెల్యూట్ తల్లి.. భర్త మరణంతో కుటుంబానికి అండగా!

image

కుటుంబానికి అండగా నిలిచేందుకు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఎంత కష్టమైనా చేసే మహిళలున్నారు. అలాంటి ఓ మహిళ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. MSc చదివిన సుప్రీతి సింగ్ తన భర్త ఆకస్మికంగా మరణించడంతో ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ పర్సన్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అత్తామామ, పిల్లలను సంతోషంగా ఉంచేందుకు ఆమె రేయింబవళ్లు శ్రమిస్తోంది. సుప్రీతి ఎందరికో స్ఫూర్తి అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

News November 5, 2024

జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ పనులు: సీఎం

image

AP: పోలవరం ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రతిరోజూ కీలకమేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 1,396 మీటర్ల పొడవైన నూతన డయాఫ్రం వాల్ పనులు జనవరి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ముఖ్యమని తెలిపారు. 2028 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తిచేసేలా ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు.

News November 5, 2024

కులగణనను 2025 జనగణనలోకి తీసుకోవాలి: రేవంత్

image

TG: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ నేతలకు మాట ఇస్తే అది శాసనమని అన్నారు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని చెప్పారు. దీనిని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని తీర్మానం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

News November 5, 2024

దీపికా-రణ్‌వీర్ కూతురి పేరుపై భిన్న స్పందన

image

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్-దీపికా తమ కూతురికి ‘దువా’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పలువురు సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. దువా అనేది ఇతర మతానికి సంబంధించిన పేరని, హిందూ పేరు పెట్టడానికి మనసు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో పేరు పెట్టడం తల్లిదండ్రుల ఇష్టమని, ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు.