India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాను చేసిన <<14525601>>వివాదాస్పద<<>> వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తమిళ నటి కస్తూరి ప్రకటన విడుదల చేశారు. ‘రెండ్రోజులుగా నాకు బెదిరింపులు వస్తున్నాయి. నేను నిజమైన జాతీయవాదిని. కుల, ప్రాంతీయ భేదాలకు నేను అతీతం. తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉంది. నేను మాట్లాడింది నిర్దిష్ట వ్యక్తుల గురించి మాత్రమే. ఎవరినైనా బాధపెడితే క్షమించండి. నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
అక్టోబర్‌లో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దసరా, దీపావళి పండుగలు ఉండటంతో ప్రజలు భారీగా ఫోర్ వీలర్స్ కొనుగోలు చేశారు. ఒక్క నెలలోనే దేశంలో 4,01,447 కార్ల అమ్మకం జరిగింది. వీటిలో మారుతీ సుజుకి అధికంగా 1,59,591 కార్లను విక్రయించింది. వీటి తర్వాత హుండాయ్(55,568), మహీంద్రా (54,504), టాటా మోటార్స్ (48,131), టయోటా (30,845), కియా మోటార్స్(28,545) ఉన్నాయి.
TG: కొన్ని రోజుల క్రితం HYDలో మోమోస్ తిని ఓ మహిళ మరణించిన ఘటన మరవకముందే మరో విషాదం జరిగింది. నిర్మల్ జిల్లాలో బిర్యానీ తిని ఫుడ్ పాయిజన్‌తో యువతి మరణించింది. ఈ నెల 2న బోథ్‌కు చెందిన 15-20 మంది నిర్మల్‌లోని గ్రిల్ నైన్ రెస్టారెంట్‌లో చికెన్ మండీ బిర్యానీ తిన్నారు. ఆ వెంటనే వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఇవాళ పూల్ కలి బైగా(19) మృతి చెందింది.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల కూతురు కాట్రిస్ లీ 43 ఏళ్ల క్రితం జర్మనీలోని బ్రిటిష్ మిలిటరీ సూపర్ మార్కెట్‌లో తప్పిపోయింది. ఇప్పటికీ ఆమె జాడ కోసం తండ్రి ఆర్మీ వెటరన్ రిచర్డ్ వెతుకుతూనే ఉన్నారు. ప్రతి ఏటా కాట్రిస్ తప్పిపోయిన ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. పోలీసులు సైతం వారికి హెల్ప్ చేస్తున్నారు. రిచర్డ్‌కు 75 ఏళ్లు కాగా తాను చనిపోయేవరకూ బిడ్డ కోసం వెతకడం ఆపనని ఆయన చెబుతున్నారు.
బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్ రంగ షేర్లకు మంగళవారం కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. సెన్సెక్స్ 694 పాయింట్ల లాభంతో 79,476 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 24,213 వద్ద స్థిరపడ్డాయి. 78,300 పరిధిలో సెన్సెక్స్‌కు, నిఫ్టీకి 23,850 పరిధిలో కీలక మద్దతు లభించింది. JSW Steel 4.5%, Tata Steel 3.7% లాభపడ్డాయి. Trent 1.7%, Adni Ports 1.5% మేర నష్టపోయాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపించారు. దీనికి నటి జియా ఖాన్ విషాదాంతాన్ని ఉదహరించారు. జియా గర్భవతిగా ఉన్నప్పుడు ఉరివేసుకొని కనిపించిందని, ఆమె మరణం తర్వాత సల్మాన్ సలహాలను సూరజ్ పంచోలీ కోరారని ఆరోపించారు. సల్మాన్ కంటే సీరియల్ కిల్లర్ టెడ్ బండీ నయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
TG: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు తేదీలను బోర్డు ఖరారు చేసింది. విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా రేపటి నుంచి ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.100ఫైన్‌తో NOV 27-డిసెంబర్ 4, రూ.500తో DEC 5-11, రూ.1000తో డిసెంబర్ 12-18, రూ.2వేల ఫైన్‌తో DEC 19-27 వరకు చెల్లించవచ్చు.
* ఫస్టియర్ రెగ్యులర్ ఫీజు-రూ.520
* సెకండియర్ రెగ్యులర్ ఫీజు:రూ.520-రూ.720.
విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా ఉండటానికి బ్లాక్ వాటర్ కూడా ఓ కారణమని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఐరోపాలోని ఎవియన్ లెస్ బైన్స్ సరస్సు నుంచి సేకరించిన నీటిని కోహ్లీ & అనుష్క సేవిస్తుంటారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గించి & చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్‌ను కూడా తగ్గిస్తుంది. లీటరుకు రూ.4వేలు చెల్లించి కోహ్లీ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
అమెరికా 47వ అధ్యక్ష ఎన్నికకు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 24 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే 7.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రెడ్, బ్లూ స్టేట్స్‌లో పెద్దగా హడావుడి లేకపోయినా స్వింగ్ స్టేట్స్‌లో ఉత్కంఠ నెలకొంది. డెమోక్రాట్ల నుంచి కమల, ఆమె రన్నింగ్ మేట్‌గా టీమ్ వాల్జ్, రిపబ్లికన్ల నుంచి ట్రంప్, ఆయన రన్నింగ్ మేట్‌గా జేడీ వాన్స్ బరిలో ఉన్నారు.
TG: రాష్ట్రంలో రేపట్నుంచి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల టీచర్లను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉ.9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. అటు ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.