India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా పడింది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో సజ్జల కోర్టును ఆశ్రయించారు. రేపు కోర్టులో ఆయనకు ఊరట దక్కుతుందా? లేదా? అనేది చూడాలి.

AP: YS జగన్ బంధువు YS వెంకట్ రెడ్డి బెరైటీస్ గనుల లీజ్ ఎగ్జిక్యూషన్ నిలుపుదల చేయడంతో పాటు లీజు మంజూరు డీవియేషన్స్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ‘YSR జిల్లా వేములలో వైట్ బెరైటీస్ లీజ్ ఆర్డర్‌ను ఇచ్చారు. క్వారీ లీజు అనుమతి గనులశాఖ డైరెక్టర్ పరిధిలో ఉంటుంది. గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి గతంలో అక్రమంగా అనుమతిచ్చారు. వాటిని రద్దు చేస్తాం’ అని కొల్లు చెప్పారు.

కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత సలాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, పురుషులు సమానం కాదని అన్నారు. స్త్రీలను, పురుషులను సమానంగా చూడటం వాస్తవికతకు వ్యతిరేకమని చెప్పారు. క్రీడల్లో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తారని ఉదహరించారు. అన్ని విషయాల్లోనూ స్త్రీ పురుషులు సమానమని చెప్పగలమా? అని ప్రశ్నించారు. సలాం వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే <<15302571>>తొక్కిసలాట<<>> జరిగిందని మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు. ఘటనలో 30 మంది చనిపోగా, గాయపడిన మరో 60 మంది భక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ఘటన వల్ల ఇవాళ వీఐపీలను కుంభమేళాకు అనుమతించలేదని ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. అదనపు సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1920ను సంప్రదించాలన్నారు.

TG: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మరణించాడు. చికాగోలో జరిగిన ప్రమాదంలో ఖైరతాబాద్‌కు చెందిన మహమ్మద్ వాజిద్ మృతిచెందాడు. వాజిద్ యువజన కాంగ్రెస్ నేతగా ఉన్నాడు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లాడు.

ఢిల్లీకి అందే యమునా నది నీటిలో హరియాణా విషం కలుపుతోందని ఆరోపించిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌పై సోనిపట్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అధికార-విపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలు జాతికే అవమానం అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. హరియాణా CM నాయబ్ సింగ్ యమునా నది నీటిని తాగి ఆరోపణలను తిప్పికొట్టారు.

AP: ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. FEB నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన 15 రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లకు చేరువైనట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. సంక్రాంతికి విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ప్రాంతీయ సినిమాగా ఇప్పటికే చరిత్ర సృష్టించింది.

AP: తాము 2001లో కొనుగోలు చేసిన భూములకు రెవెన్యూ శాఖ సర్వే చేసిందని, వాటిని ఇప్పుడు అటవీ భూములు అంటున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసని విమర్శించారు. అలాగే, ఎంతమంది YCP నుంచి వెళ్లినా పార్టీకి ఏం కాదన్నారు. VSR రాజీనామా ఆయన వ్యక్తిగతం అని చెప్పారు. పెద్దిరెడ్డి భూములపై ఆరోపణలు రాగా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఏపీలో త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై ముగ్గురు మంత్రులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. కాగా వచ్చే నెల 6న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.