News November 5, 2024

రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేస్తారని సమాచారం. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వేసేలా ఏర్పాట్లు చేసింది.

News November 5, 2024

HBD KOHLI: సచిన్, గంగూలీ కలిస్తే..

image

మైదానంలో పరుగుల వరదను పారించిన గ్రేటెస్ట్ క్రికెటర్ సచిన్. భారత క్రికెట్‌కు దూకుడైన కెప్టెన్సీ నేర్పించిన నాయకుడు గంగూలీ. ఒకరిది కామ్ అండ్ కంపోజ్డ్ ఆటతీరు. మరొకరిదేమో అగ్రెషన్, ప్రత్యర్థికి వెరవని ధీరత్వం. వీరిద్దరినీ పుణికిపుచ్చుకున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. బ్యాటుతో సునామీ సృష్టించిన అతడు కెప్టెన్‌గా అంతకుమించే రాణించారు. SENA కంట్రీస్‌లో ప్రత్యర్థి మాటలకు నోటితో, బౌన్సర్లకు బ్యాటుతో జవాబిచ్చారు.

News November 5, 2024

OTTలోకి ‘దేవర’ సినిమా.. ఎప్పుడంటే?

image

Jr.NTR హీరోగా నటించిన ‘దేవర’ పార్ట్-1 ఈనెల 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ తదితరులు నటించారు. సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రూ.500కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

News November 5, 2024

ఇవాళ కూరగాయలు తరగకూడదా?

image

కార్తీకమాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థ తిథినే నాగులచవితిగా జరుపుకుంటాం. చవితిరోజున చిన్న చిన్న ప్రాణులకు కూడా హానీ తలపెట్టరు. భూమి దున్నడం, మట్టి తవ్వడం, చెట్టు, పుట్టలను కొట్టడం వంటి పనులకు దూరంగా ఉంటారు. కత్తులు, సూదులు, కత్తెర వంటివి వాడరు. కూరగాయలు తరిగి వంట చేయరు. మట్టి పాత్రల్లోనే వంట చేసుకుంటారు. దుంపలు వంటివి ఉడికించుకుని తింటారు. ఈ ఆచారాన్ని భక్తులు అనాదిగా నమ్ముతున్నారు.

News November 5, 2024

రాహుల్ గాంధీకి స్వాగతం: సీఎం రేవంత్

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయనను స్వాగతిస్తూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘బలహీనుడి గళం. సామాజిక న్యాయ రణం. రాహుల్ గాంధీకి స్వాగతం’ అని పేర్కొన్నారు. ఇవాళ HYDకు రానున్న రాహుల్, కులగణనపై మేధావులు, పలువురు నేతలతో సమావేశమై అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన అశోక్ నగర్‌‌కు వెళ్లి నిరుద్యోగులతో చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.

News November 5, 2024

రైళ్లలో సీటు బెల్టులు ఎందుకు ఉండవు?

image

ఫ్లైట్, ఫోర్ వీలర్‌తో పోలిస్తే రైలు ప్రయాణ పరిస్థితులు భిన్నం. విమానాలు, వెహికిల్స్ వెళ్లే ఎత్తు-ఒంపుల/గతుకుల రూట్ కాకుండా స్థిర, చదునైన మార్గంలో ఇవి వెళ్తాయి. పైగా అకస్మాత్తుగా వేగం తగ్గి ప్రయాణించడం అరుదు. మిగతా వాటితో పోలిస్తే ప్రమాదాలు, మరణాలూ తక్కువే. అటు పట్టాలు తప్పడం, ఢీకొనడం, మంటలు రావడం లాంటి దుర్ఘటనల్లో సీటు బెల్టులతో వెంటనే బయటపడలేరు. ఇలా రైళ్లో సీటు బెల్టుతో లాభాల కంటే రిస్కులెక్కువ.

News November 5, 2024

కళ్యాణం.. ఇండియన్ ఎకానమీకి వైభోగం

image

ఈ దీపావళి పెళ్లిళ్ల సీజన్ భారత ఎకానమీకి భారీ స్థాయిలో కాంట్రిబ్యూట్ చేయబోతోంది. ఈ నెల రోజుల్లోనే దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరుగుతాయని CAIT తెలిపింది. దీంతో రూ.6లక్షల కోట్ల బిజినెస్ జనరేట్ అవుతుందని అంచనా వేసింది. ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని, దాంతో రూ.1.5లక్షల కోట్ల వ్యాపారం నమోదవుతుందని పేర్కొంది. గతేడాది ఇదే సీజన్లో 38 లక్షల పెళ్లిళ్లతో రూ.4.2 లక్షల కోట్ల బిజినెస్ జరిగింది.

News November 5, 2024

ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు DSP ఉద్యోగానికి రాజీనామా

image

TG: ప్రజాసేవ చేయాలన్న తపన ఆయనతో DSP ఉద్యోగానికి రాజీనామా చేయించింది. నిజామాబాద్(D) ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్ DSP ఉద్యోగం నుంచి VRS తీసుకున్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల MLC ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆయన చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన గంగాధర్ 1998 బ్యాచ్ ఎస్సైగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించారు.

News November 5, 2024

SUPER: 150కి 150 మార్కులు

image

AP: టెట్ ఫలితాల్లో పలువురు పేదింటి విద్యార్థులు సత్తా చాటారు. 150కి 150 మార్కులు సాధించి అదరగొట్టారు. విజయనగరానికి చెందిన కొండ్రు అశ్విని, నంద్యాల(D) గొర్విమానుపల్లె వాసి మంజుల, నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతికుమార్ వంద శాతం మార్కులు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. టీచర్ ఉద్యోగం సాధించి పేద విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడమే లక్ష్యమని వారు వెల్లడించారు.

News November 5, 2024

డెమొక్రాట్VSరిపబ్లికన్: ఎవరిది ఆధిపత్యం?

image

అమెరికాలో చిన్నాచితకా పార్టీలు ఎన్ని ఉన్నా డెమొక్రటిక్(గుర్తు గాడిద), రిపబ్లికన్ల(సింబల్ ఏనుగు) మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. 1854 నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. 1790లో ఏర్పడిన డెమొక్రటిక్ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పార్టీల్లో ఒకటి. ఆ పార్టీ తరఫున ఇప్పటి వరకు 16 మంది అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1854లో ప్రారంభమైన రిపబ్లికన్ పార్టీ నుంచి 19 మంది ప్రెసిడెంట్లుగా పనిచేశారు.