News November 5, 2024

కరీనా ‘దైరా’ చిత్రంలో పృథ్వీరాజ్?

image

మేఘనా గుల్జార్ డైరెక్షన్‌లో కరీనా కపూర్ నటిస్తున్న ‘దైరా’ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన కనిపిస్తారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కాల్‌షీట్లు లేకపోవడంతో ఈ చిత్రం నుంచి ఆయుష్మాన్ ఖురానా, సిద్ధార్థ్ మల్హోత్రా తప్పుకున్నారు.

News November 5, 2024

టెన్త్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 25, రూ.200 జరిమానాతో DEC 3, రూ.500 చెల్లింపుతో DEC 10 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, సప్లిమెంటరీ రాసేవారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి. వృత్తి విద్య విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.

News November 5, 2024

నిద్ర లేవగానే ఇలా చేస్తే..

image

ఉదయం నిద్ర లేవగానే 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ మనసు ప్రశాంతంగా ఉంచడంతో పాటు రోజంతా మీరు సమర్థంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ధ్యానం మీ అంతర్గత శక్తిని పెంచుతుంది. సానుకూల ఫలితాల వైపు పయనించేలా చేస్తుంది. అలాగే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో కాసేపు వర్కౌట్స్ చేస్తే కొవ్వు కరుగుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

News November 5, 2024

నేటి నుంచి టెట్ దరఖాస్తులు

image

TG: విద్యాశాఖ నిన్న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అభ్యర్థులు <>schooledu.telangana.gov.in<<>> సైట్‌లో అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే ఒకసారి ప్రభుత్వం టెట్ నిర్వహించింది. అనంతరం డీఎస్సీ ద్వారా 11వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసింది.

News November 5, 2024

16.82 లక్షల ఉచిత సిలిండర్ల బుకింగ్

image

AP: గత నెల 29న ప్రారంభమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం 16.82 లక్షల మంది బుక్ చేసుకోగా, 6.46 లక్షల గ్యాస్ బండలు డెలివరీ అయ్యాయి. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.97 కోట్లు జమ అయ్యాయి. ప్రస్తుతం మహిళలు డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకున్న తర్వాత 1-2 రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తోంది. త్వరలోనే పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని CM చంద్రబాబు ఇటీవల ప్రకటించారు.

News November 5, 2024

GET READY: రేపే భారీ నోటిఫికేషన్

image

AP: టెట్ ఫలితాలను <<14526055>>వెల్లడించిన<<>> ప్రభుత్వం రేపు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. నెల రోజులపాటు దరఖాస్తులకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఒక రోజు కష్టంగా, మరో రోజు ఈజీగా పేపర్ వచ్చిందనే విమర్శలకు తావులేకుండా రెండు, మూడు జిల్లాలకు కలిపి ఒకే రోజు పరీక్ష నిర్వహించడంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

News November 5, 2024

అమెరికా ఎలక్షన్స్‌లో ‘టై’ అయితే?

image

538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లలో ట్రంప్, కమలకు చెరో 269 సీట్లొస్తే ఎలా? అధ్యక్షుడిని ఎలా డిసైడ్ చేస్తారు? అలాంటి సందర్భమే వస్తే కాంగ్రెస్‌లోని దిగువ సభ(ప్రతినిధుల సభ) ప్రెసిడెంట్‌ని, ఎగువ సభ(సెనెట్) ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటాయి. అందుకే ఆ సభలకు జరుగుతున్న ఎన్నికలూ కీలకంగా మారాయి. అయితే ఆధునిక అమెరికా చరిత్రలో టై అయిన దాఖలాలు లేవు. చివరిసారి 1800లో టై కాగా థామస్ జెఫర్సన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

News November 5, 2024

బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు దరఖాస్తులు

image

AP: బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్లు, రెండేళ్ల కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్‌కు ఎన్టీఆర్ వర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి 7వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. కన్వీనర్ కోటాలో 8,804 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 6,664 భర్తీ అయ్యాయి. మిగిలిన అన్ని సీట్లను రెండో విడతలోనే భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్: https://apuhs-ugadmissions.aptonline.in/MBBS

News November 5, 2024

దాశరథి.. తెలంగాణ నిను మరువదోయి!

image

పెత్తందారులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన యోధుడు దాశరథి కృష్ణామాచార్య. మధ్యయుగాల రాచరికపు బలాన్నే తన కవితకు ప్రేరణగా మలుచుకొన్నారు. ‘ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలినరాజు మాకెన్నడు’ అని గర్జించారు. ‘దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు. ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి పెద్దరికం చేస్తావా? 3కోట్ల చేతులు నీ మేడను పడదోస్తాయి’ అని హెచ్చరించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించారు. నేడు దాశరథి వర్ధంతి.

News November 5, 2024

నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సా.4.45 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి పీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లిలో నిర్వహించనున్న కులగణన సదస్సుకు భారీ ర్యాలీగా వెళ్తారు. అక్కడ కులగణన విధివిధానాలు, సామాజిక న్యాయం కోసం ఏం చేస్తే బాగుంటుందనే అంశాలపై మేధావులు, ప్రజాసంఘాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం రా.7.10 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్తారు.