India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తేది: నవంబర్ 5, మంగళవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5:02 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:16 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:07 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5:43 గంటలకు ✒ ఇష: రాత్రి 6.57 గంటలకు ✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ తేది: నవంబర్ 5, మంగళవారం ✒ చవితి: రాత్రి 12.17 గంటలకు ✒ జ్యేష్ఠ ఉ.9.45 గంటలకు ✒ వర్జ్యం లేదు ✒ దుర్ముహూర్తం: ఉ.8.25-9.10 గంటల వరకు ✒ తిరిగి రా.10.35-11.26 గంటల వరకు
➥అత్యాచారాలపై హోం మంత్రి బాధ్యత వహించాలి: పవన్
➥నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి: పవన్ కళ్యాణ్
➥పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: మంత్రి అనిత
➥ఈ నెల 8న మూసీ నది వెంబడి CM రేవంత్ పాదయాత్ర
➥రేషన్ కార్డు లేనివారికీ ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి
➥సర్పంచులకు మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం: పొన్నం
➥ కెనడాలో హిందువులపై ఖలిస్థానీల దాడి.. ఖండించిన మోదీ
AP: నేరాల విషయంలో అందరికీ బాధ ఉందని, పవన్ కళ్యాణ్ బయటపడ్డారని, తాము పడలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆయన మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేస్తామని చెప్పారు. లా అండ్ ఆర్డర్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ పాలనలో పోలీసులు విధులు నిర్వహించేందుకు ఇబ్బంది పడ్డారని అనిత ఆరోపించారు. గతంలో రాజకీయంగా నేరాలను ప్రోత్సహించారని మండిపడ్డారు.
లైసెన్స్, స్ట్రీమింగ్ హక్కులు, సేల్స్, ఇతర రూపాల్లో మరణానంతరం రూ.వేల కోట్లు ఆర్జిస్తున్న ప్రముఖ సెలబ్రిటీల వివరాలను ఫోర్బ్స్ విడుదల చేసింది.
మైకేల్ జాక్సన్(2009 మరణం): 600మి.డాలర్లు, ఫ్రెడ్డీ మెర్క్యురీ(1991):250మి. డా, స్యూస్(1991): 75 మి.డా, ఎల్విస్ ప్రెస్లీ(1977): 50 మి.డా,
రిక్ ఒకాసెక్(2019): 45 మి.డా, ప్రిన్స్(2016):35 మి.డా, బాబ్ మార్లే(1981): 34 మి.డా, చార్లెస్ షుల్జ్(2000): 30 మి.డాలర్లు.
AP: తిరుపతి జిల్లా యర్రావారిపాలెంలో ఓ బాలికపై అత్యాచారం జరిగిందన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు. విచారణ పూర్తికాక ముందే కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. కాగా ఈ ఘటనపై వైసీపీ మండిపడింది. ‘ఇంకెంత మంది ఆడబిడ్డలు మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి బలవ్వాలి చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్, లోకేశ్?’ అని ట్వీట్ చేసింది.
షూటింగ్‌లో హీరో విజయ్ దేవరకొండ గాయపడ్డారు. తన కొత్త సినిమా ‘VD 12’ షూట్‌లో భాగంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఆయనకు గాయమైంది. వెంటనే చిత్ర బృందం ఆస్పత్రికి తరలించి ఫిజియోథెరపీ చేయించారు. అనంతరం విజయ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.
స్కామర్లు ఎస్బీఐ కస్టమర్లకు మోసపూరిత సందేశాలను పంపుతున్నారని PIB తెలిపింది. SBI రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్‌లోడ్ చేయమని APK ఫైల్స్ పంపుతున్నారని పేర్కొంది. అలాంటి లింకులపై క్లిక్ చేయడం, యాప్స్ డౌన్‌లోడ్ చేయడం వంటివి చేయొద్దని హెచ్చరించింది. ఇలాంటి మోసాలకు చాలా మంది బలైపోయారని, జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.
SHARE IT
AP: కర్నూలు(D) కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలపై కొనసాగుతున్న ఆందోళనలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కూటమి నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. త్వరలో జరగబోయే సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు నిమ్మల పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.