News November 5, 2024

లారెన్స్ బిష్ణోయ్ ఫొటోలతో టీషర్ట్‌లు.. విమర్శలు!

image

ఈకామర్స్ వెబ్‌సైట్ మీషోలో గ్యాంగ్‌స్టర్ల ఫొటోలతో టీషర్టులు అమ్మడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయ్ ఫొటోలతో ఉన్న టీషర్టులను మీషోలో విక్రయించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మరో గ్యాంగ్‌స్టర్ దుర్లభ్ కశ్యప్ ఫొటోలతోనూ టీషర్టులు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటితో యువతలో నేరపూరిత ఆలోచనలు పుట్టుకొస్తాయని అంటున్నారు.

News November 4, 2024

DANGER: డైలీ ఎంత ఉప్పు తింటున్నారు?

image

ఉప్పుతో ఆహారానికి రుచి. అందుకే చాలామంది తినాల్సిన దానికంటే అధికంగా ఉప్పు తింటున్నారు. అయితే ఉప్పు ఎక్కువ లేక తక్కువ తిన్నా ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏటా దాదాపు 20లక్షల మరణాలకు ఉప్పు కారణమవుతోందంటున్నారు. ఒక వ్యక్తి రోజుకు 5గ్రా.లు లేదా టీస్పూన్ ఉప్పు వాడాలని WHO చెబుతోంది. కానీ చాలామంది 11గ్రాములు తీసుకుంటున్నారు. అందుకే కొన్ని దేశాలు ఉప్పు వాడకం తగ్గించడంపై ఫోకస్ పెట్టాయి.

News November 4, 2024

పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలి: మంత్రి

image

TG: గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పనిలో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

News November 4, 2024

రేపు సరస్వతి పవర్ భూములను పరిశీలించనున్న పవన్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పల్నాడులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములు పరిశీలించనున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. సరస్వతి శక్తికి సంబంధించిన భూ ఉల్లంఘనలను తనిఖీ చేస్తానని పవన్ కళ్యాణ్ సైతం వెల్లడించారు. కాగా సరస్వతి భూముల విషయంలో వైసీపీ అధినేత జగన్, షర్మిల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

News November 4, 2024

స్టిక్క‌ర్ స్కాం.. అమెజాన్‌కు ₹1.29 కోట్లు టోక‌రా పెట్టిన యువ‌కులు

image

రాజ‌స్థాన్‌కు చెందిన రాజ్‌కుమార్‌, సుభాశ్‌ అమెజాన్‌కు ₹1.29Cr టోక‌రా పెట్టి మంగళూరులో దొరికిపోయారు. వీరు అమెజాన్‌లో త‌క్కువ ధర, లక్షలు విలువైన ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ పెట్టేవారు. ఆర్డర్ వచ్చాక డెలివరీ బాయ్‌ కళ్లుగప్పి లక్షల విలువైన వస్తువుల స్టిక్కర్లను తక్కువ విలువైన వాటి స్టిక్కర్లతో మార్చేవారు. తీరా హైవాల్యూ ఐటం క్యాన్సిల్ చేసేవారు. తద్వారా లక్షల విలువైన వస్తువులను తక్కువ ధరకే కొట్టేసేవారు.

News November 4, 2024

మార్కెట్లో చైనా డేంజర్ వెల్లుల్లి! గుర్తించండిలా

image

కేంద్రం 2014లోనే చైనా వెల్లుల్లిని నిషేధించినా అధిక లాభాలకు కొందరు దీన్ని అక్రమంగా దిగుమతి చేసి విక్రయిస్తున్నారు. దీన్ని పండించేందుకు వాడే మిథైల్ బ్రోమైడ్ వంటి రసాయనాలు అల్సర్లు, జీర్ణ, కిడ్నీ సమస్యలు, తీవ్ర దగ్గు, మెదడు దెబ్బతినడం, కాళ్లు/చేతులు మొద్దుబారడానికి కారణమవుతాయి.
☞ఈ వెల్లుల్లి సైజులో చిన్నగా, బాగా తెల్లగా/పింక్ రంగులో ఉంటుంది. తక్కువ ఘాటు వస్తుంది. సులువుగా పొట్టు తీయొచ్చు.
Share It

News November 4, 2024

పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి: సీఎం

image

TG: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు మంచిర్యాల విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ, ITIలు ATCలుగా మార్పు, స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి వారికి వివరించారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. గంజాయి బారిన పడొద్దన్నారు.

News November 4, 2024

భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్

image

మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన భర్త డేనియల్‌ వెబర్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరు 2011లోనే పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయి 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇద్దరూ వధూవరుల్లా ముస్తాబై మాల్దీవ్స్‌లో తమ ముగ్గురు పిల్లల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వీరు ఓ పాపను దత్తత తీసుకొని, మరో ఇద్దరిని సరోగసి ద్వారా పొందారు. కాగా వీరి రీవెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

News November 4, 2024

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి

image

APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలన్న dy.cm <<14527352>>పవన్ కళ్యాణ్<<>> వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘శాంతి భద్రతలపై CM, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. వాటిలో పవన్ కళ్యాణ్ భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు. పవన్ ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తెలుసు. త్వరలో ఆయనతో మాట్లాడుతా’ అని BBCతో అన్నారు.

News November 4, 2024

అగ్రరాజ్యంలో పోలింగ్‌కు వేళాయే

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు కౌంట్‌డౌన్ పూర్తికానుంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పెద్దఎత్తున జ‌రిగింది. మంగ‌ళ‌వారం పేప‌ర్ బ్యాలెట్ ఓటింగ్ జరగనుంది. USలో 24.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎల‌క్ట‌ర్ల‌ను ఎన్నుకొనే ఈ ప్రక్రియలో 50 Statesలో 538 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. 270 గెల‌వాల్సి ఉంటుంది. రేపు 4:30PMకి పోలింగ్ ప్రారంభమై Wed 10.30AMలోపు(అన్ని చోట్ల) ముగుస్తుంది. ఆ వెంటనే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.