India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేఎల్ రాహుల్ NZతో తొలి టెస్టులో విఫలం అయ్యారని తర్వాతి రెండు టెస్టులకు దూరం పెట్టారు. కానీ గణాంకాల ప్రకారం చూస్తే KL.. రోహిత్, విరాట్ కంటే ఎక్కువ రన్స్ చేశారు. టెస్టుల్లో గత 10 ఇన్నింగ్సుల్లో రోహిత్ 13.3 సగటుతో 133, విరాట్ 21.33 సగటుతో 192 రన్స్ చేశారు. ఇద్దరూ కలిపి 325 రన్స్ చేస్తే రాహుల్ ఒక్కడే 339 పరుగులు చేశారు.
గుజరాత్‌లోని అమ్రేలిలో ఘోరం జరిగింది. నలుగురు పిల్లలు కారులో ఊపిరాడక చనిపోయారు. పేరెంట్స్ పనులకు వెళ్లగా 2 నుంచి 7 ఏళ్ల వయసు ఉన్న నలుగురు పిల్లలు ఆడుకుంటూ యజమాని కారులోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. సాయంత్రం వచ్చి చూడగానే నలుగురు విగతజీవులుగా కనిపించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.
**పిల్లలు ఆడుకునే సమయంలో ఓ కన్నేసి ఉంచండి.
TG: బస్సు టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదని TGSRTC ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ‘దీపావళి తిరుగుప్రయాణ రద్దీ నేపథ్యంలో ఏర్పాటుచేసిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం ఛార్జీలను సవరించాం. తిరుగు ప్రయాణంలో రద్దీ ఉండకపోవడంతో బస్సులు ఖాళీగా వెళ్తుంటాయి. కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని 2003లో ప్రభుత్వం జీవో 16 తీసుకొచ్చింది’ అని వివరించారు.
ప్రముఖ లగ్జరీ బ్రాండ్ NIKE లోగోను డిజైన్ చేసేందుకు గ్రాఫిక్ డిజైనర్ కరోలిన్ డేవిడ్‌సన్ ఎంత తీసుకున్నారో తెలుసా? ఆమె డిజైన్ స్టూడెంట్ కావడంతో లోగోను చేసినందుకు 1971లో $35లను పొందారు. ఈ లోగోకు మంచి రెస్పాన్స్ రావడంతో కంపెనీ ప్రతినిధులు డేవిడ్‌సన్‌కు 500 షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఆ షేర్లను ఇప్పటికీ అలానే ఉంచగా వాటి విలువ $3 మిలియన్లకు చేరింది.
TG: హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. బీసీ రిజర్వేషన్లపై నెలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విశ్రాంత ఐఏఎస్ బూసాని వెంకటేశ్వరరావును ఛైర్మన్‌గా నియమించింది. కాగా, సంక్రాంతిలోపు స్థానికసంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కెనడా బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయంపై జరిగిన ఉద్దేశపూర్వక దాడిని ప్రధాని మోదీ ఖండించారు. అలాగే దౌత్యవేత్తలను బెదిరించే పిరికి ప్రయత్నాలు గర్హనీయమని పేర్కొంటూ Xలో పోస్ట్ చేశారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత స్థైర్యాన్ని ఎన్నటికీ బలహీనపరచలేవని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో న్యాయం జరిగేలా కెనడా ప్రభుత్వం చట్టాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.
TG: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు.
AP: హోంమంత్రి ఫెయిల్ అయ్యారని తామంటే ఎగిరిపడ్డ అనిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏం చెబుతారని YCP నేత రోజా ప్రశ్నించారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేరాలను నియంత్రించలేకపోతున్న CM చంద్రబాబును కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేయాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. రాష్ట్రంలో పోలీసులను తిట్టడం ఫ్యాషన్ అయిపోయిందని ఆమె విమర్శించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీని ఖరారు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11న ఉదయం 10గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
TG: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. మొదటి విడతలో రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. రెండో విడత నుంచి కార్డు ఉంటేనే అర్హులు అవుతారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.