News November 4, 2024

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంబటి సెటైర్లు

image

AP: రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై స్పందిస్తూ తాను హోం మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘హోం మినిస్ట్రీ తీసుకుని ప్రతాపం చూపండి. స్వామి ఆదిత్యనాథ్ అవుతారో? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణయిస్తుంది’ అని ట్వీట్ చేశారు.

News November 4, 2024

నార్త్ లేబర్ క్రైసిస్: సౌత్ స్టేట్స్‌కు ఇబ్బంది

image

చెన్నై మెట్రో రెండో దశ పనులకు 40% లేబర్ షార్టేజ్ సౌత్ స్టేట్స్‌ను ఇబ్బంది పెడుతోంది. లోక్‌సభ పోలింగ్ కోసం ఝార్ఖండ్, బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లినవాళ్లు మళ్లీ తిరిగి రావడం లేదు. మెట్రో, రోడ్లు, ఇన్ఫ్రా ప్రాజెక్టులతో UP సహా నార్త్‌లోనే వారికి చేతినిండా పని దొరుకుతోంది. ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. పైగా వారిపై వెగటు వ్యాఖ్యలూ ప్రభావం చూపాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. మీ కామెంట్.

News November 4, 2024

బెట్టింగ్ మార్కెట్‌లో ట్రంప్‌దే హవా

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు మ‌రికొన్ని గంటలే గ‌డువు ఉంది. ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ముంద‌స్తు పోల్ స‌ర్వేలు క‌మ‌ల‌, ట్రంప్ మ‌ధ్య హోరాహోరీ త‌ప్ప‌ద‌ని స్ప‌ష్ట‌ం చేస్తున్నాయి. అయితే బెట్టింగ్ మార్కెట్‌లో మాత్రం ట్రంప్ దూసుకుపోతున్నారు. ప్ర‌తి వేదిక ట్రంప్ అనూహ్య విజ‌యాన్ని అంచ‌నా వేస్తున్నాయి. BetOnline, Betfair, Bovada, PolyMarket వేదికలపై ట్రంప్ 50%పైగా విజయావకాశాలతో ముందున్నారు.

News November 4, 2024

పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ

image

AP: అవసరమైతే తాను హోంమంత్రి పదవి చేపడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మంత్రి నారాయణ స్పందించారు. ఏ శాఖపైనైనా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించే అధికారం ఉంటుందని మంత్రి అన్నారు. పవన్ వ్యాఖ్యలను అలర్ట్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్నచిన్న సమస్యలుంటే సీఎం సమన్వయం చేస్తారని నారాయణ అన్నారు.

News November 4, 2024

విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలపై కీలక ప్రకటన

image

AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్తుకు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. దీంతో ఒక్కో యూనిట్‌కు 0.40 పైసలు సర్దుబాటు ఛార్జీలు విధించేందుకు ఏపీఈఆర్సీ నిర్ణయించింది. ఈ ట్రూఅప్ ఛార్జీలపై ఈ నెల 19లోగా అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలపాలంది.

News November 4, 2024

ప్రతి న్యూడ్ పెయింటింగ్ అశ్లీలం కాదు: బాంబే HC

image

ప్రతి నగ్న పెయింటింగ్ అశ్లీలమైనది కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రఖ్యాత భారతీయ కళాకారులు ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా, అక్బర్ పదమ్‌సీల 7 చిత్రాలను విడుదల చేయాలని కస్టమ్స్ అధికారులను ఆదేశించింది. ‘అసభ్యకరం’ అనే కారణంతో ఆ కళాకృతులను జప్తు చేసిన అధికారులను హెచ్చరించింది. మైఖేలాంజెలో చెక్కిన నగ్న శిల్పం ఇండియాలోకి వచ్చినపుడు దానికి బట్టలు వేయాలని ఇండియన్ కస్టమ్స్ చట్టాలు చెప్పలేదని గుర్తు చేసింది.

News November 4, 2024

కేంద్రమంత్రితో MP శ్రీకృష్ణదేవరాయలు భేటీ

image

AP: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాతో TDP MP లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. NIPER ఏర్పాటుకు భూమితో పాటు అన్ని విధాలుగా సహకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని నడ్డాను కోరారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఆరోగ్య పరీక్షలు చేసే కేంద్రాలను ఉత్తరాంధ్రలో లేదా రాయలసీమలో ఏర్పాటు చేయాలని విన్నవించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచేలా వెసులుబాటు కల్పించాలని కోరారు.

News November 4, 2024

‘ఆమె’ కాదు ‘అతను’..? ఖెలీఫ్‌లో XY క్రోమోజోమ్‌లు?

image

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్‌కు XY క్రోమోజోమ్‌లు, అంతర్గత వృషణాలు ఉన్నట్లు ఇటీవ‌ల లీకైన వైద్య నివేదిక ద్వారా తెలుస్తోంది. స‌హ‌జంగా XY క్రోమోజోమ్‌లు పురుషుల్లో ఉంటాయి. ఖెలీఫ్‌ను మ‌హిళ‌ల విభాగంలో అనుమ‌తించ‌డం గ‌తంలో తీవ్ర వివాదం రేపింది. ఖెలీఫ్‌కు ఇచ్చిన స్వ‌ర్ణాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని ICONS కో ఫౌండర్ మార్షీ స్మిత్ డిమాండ్ చేశారు.

News November 4, 2024

రైల్వే సూపర్ యాప్ వచ్చేస్తోంది.. ఇక అన్ని సేవలు ఒకే చోట

image

రైల్వే సేవ‌ల్ని పొంద‌డానికి నాలుగైదు యాప్‌లు ఓపెన్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా ఒకే యాప్‌లో అన్ని సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం రైల్వే ‘సూప‌ర్ యాప్‌’ను తీసుకురానుంది. దీని ద్వారా టికెట్ బుకింగ్ మొద‌లుకొని, ఫుడ్ ఆర్డ‌ర్‌, స‌ర్వీస్ ట్రాకింగ్‌, ఫిర్యాదులు వంటి అన్ని సేవ‌ల‌ను ఒకే చోట పొంద‌వ‌చ్చు. డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న ఈ సూపర్ యాప్‌ IRCTCతో సమాంతరంగా పనిచేస్తుంది.

News November 4, 2024

ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు

image

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ GOVT నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో తీసుకొచ్చిన నూతన క్రీడా పాలసీకి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. APని క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో పాలసీకి రూపకల్పన చేశారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచారు. అలాగే స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపైనా చర్చించారు.