News November 4, 2024

రైతన్నలూ.. ఒక్కసారి ఆలోచించండి, ప్రాణాలు కాపాడండి!

image

రోడ్లపై వడ్ల కుప్పలతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా సాగుతుండటంతో కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వస్తోంది. అక్కడ స్థలం సరిపోక చాలా మంది రైతులు రోడ్లపై వడ్లను ఆరబోస్తున్నారు. రాత్రి వేళ కుప్పలు, రాళ్లు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సగం రోడ్డుపైనే వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నా రైతులు పట్టించుకోవట్లేదు.

News November 4, 2024

అమెరికా ఎలక్షన్స్.. రూ.కోట్లల్లో బెట్టింగ్!

image

మన దగ్గర సర్పంచ్, ఎమ్మెల్యే ఎలక్షన్లకే జోరుగా బెట్టింగ్ జరుగుతుంటుంది. అలాంటిది ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను వదిలేస్తారా? సర్వేలను నమ్మి మిలియన్ డాలర్లను బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌పోస్ట్ అమెరికా ప్రకారం US ప్రెసిడెన్షియల్ ఎన్నికలపై కొన్ని చట్టపరమైన ప్లాట్‌ఫామ్‌లలో $100M (రూ.830 కోట్లు) పైగా పందెం వేసినట్లు పేర్కొంది. అనధికారికంగా ఇంకెంత జరిగి ఉంటుందో?

News November 4, 2024

సర్పంచులకు మార్చిలోగా బకాయిలు చెల్లిస్తాం: పొన్నం

image

తెలంగాణలో సర్పంచులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసానిచ్చారు. సర్పంచుల బకాయిలను మార్చిలోగా చెల్లిస్తామన్నారు. రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. గతంలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన BRS, నేడు ధర్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. TGకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. వరదల వల్ల రూ.10 వేల కోట్ల నష్టం కలిగితే, కేంద్రం రూ.400 కోట్లే ఇచ్చిందని ఫైర్ అయ్యారు.

News November 4, 2024

రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ అతడే: కైఫ్

image

రోహిత్ శర్మ తర్వాత టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత జట్టులో కేవలం రిషభ్ పంత్ మాత్రమే అందుకు గట్టి పోటీదారు. కెప్టెన్సీకి అతడు న్యాయం చేయగలడు. అతడు ఏ స్థానంలో వచ్చినా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు న్యూజిలాండ్ భయపడింది’ అని వ్యాఖ్యానించారు.

News November 4, 2024

పంచనామా అంటే ఏమిటి? ఆ పేరెలా వచ్చింది?

image

నేరవార్తల్లో పంచనామా పదం చదివే ఉంటాం. ఘటనాస్థలికి అధికారి వెళ్లి గమనించినవి నమోదు చేయడమే పంచనామా. Ex: అనుమానాస్పద మృతి కేసులో మృతదేహ స్థితి, గది, అక్కడి వస్తువులు సహా చూసిన వివరాలన్నీ రాసుకుంటారు. దర్యాప్తులో ఇవి క్లూ/సాక్ష్యంగా ఉపయోగపడతాయి. గతంలో వివాద పరిష్కారాలకు ఊరి పెద్ద సహా ప్రముఖులు కొందరు కలిసి ఐదుగురు బృందంగా ఉండేవారు. ఏదైనా తగాదాపై వారి ఎదుట పత్రం రాసేవారు కావడంతో పంచనామా పేరు వచ్చింది.

News November 4, 2024

కెనడాలో భారతీయుల భ‌ద్ర‌త‌పై కేంద్రం ఆందోళ‌న‌

image

కెనడాలో భార‌త పౌరుల భ‌ద్ర‌త‌పై కేంద్రం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. బ్రాంప్ట‌న్‌లోని హిందూ స‌భ ఆలయంపై వేర్పాటువాదుల హింసాత్మ‌క చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండించింది. ఈ తరహా దాడుల నుంచి ప్రార్థ‌నా స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు కెన‌డా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. దాడుల‌కు పాల్ప‌డిన వారిపై విచార‌ణ జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నామంది. పౌరులకు తమ కాన్సులర్లు చేస్తున్న సాయాన్ని ఈ దాడులు ఆపలేవని పేర్కొంది.

News November 4, 2024

తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ

image

AP: తనకు ప్రమాదం జరిగిందనే ప్రచారంపై విజయమ్మ స్పందించారు. ‘ఈ ప్రచారంతో నాకు తీవ్ర వేదన కలుగుతోంది. నేను ఖండించకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన కారు ప్రమాదాన్ని ఇప్పుడు నా కుమారుడికి ఆపాదించి దుష్ప్రచారం చెయ్యడం జుగుప్సాకరం. నేను నా మనవడి దగ్గరకు వెళ్లినా తప్పుగా చిత్రీకరించారు. ఇవన్నీ AP ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారు’ అని ఆమె లేఖ విడుదల చేశారు.

News November 4, 2024

BCCI తదుపరి సెక్రటరీగా రోహన్ జైట్లీ?

image

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కార్యదర్శిగా రోహన్ జైట్లీని నియమించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈనెలలో జైషా ఈ పదవికి రాజీనామా చేసి DEC 1న ICC తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. రోహన్ జైట్లీ 2020 నుంచి ఢిల్లీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ సైతం BCCI సెక్రటరీ పదవి కోసం పోటీ పడుతున్నారు. దీనిపై త్వరలో ప్రకటన రానుంది.

News November 4, 2024

లేబర్ షార్టేజ్ వల్ల నష్టాలేంటి?

image

* ఇన్ఫ్రా సహా కంపెనీల ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఇది ఎకనామిక్ ఔట్‌పుట్‌పై ప్రభావం చూపిస్తుంది * వర్కర్స్ మధ్య పోటీతో ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఇన్‌ఫ్లేషన్ ప్రెజర్ పెరుగుతుంది * కంపెనీలు, ప్రాజెక్టుల విస్తరణ ఆగిపోతుంది. దీంతో ఆ ప్రాంతాల డెవలప్మెంట్ లేటవుతుంది* లేబర్ రిక్రూటింగ్, ట్రైనింగ్, రిటైనింగ్‌కు కంపెనీలు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆపరేషనల్ బడ్జెట్ పెరుగుతుంది.

News November 4, 2024

టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

image

ఏపీలో ఖాళీగా ఉన్న తూ.గో- ప.గో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 18వరకు నామినేషన్లు స్వీకరించి, 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. DEC 5న పోలింగ్ నిర్వహించి 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా ఈ స్థానంలో PDF MLC షేక్ సాబ్జీ గతేడాది రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు.