News November 4, 2024

Stock Market: భారీగా నష్టపోయాయి

image

చైనా మ‌రో ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌ట‌న వార్త‌ల నేప‌థ్యంలో FIIలు భారీగా అమ్మ‌కాల‌కు దిగ‌డంతో స్టాక్ మార్కెట్లు నేడు భారీగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు న‌ష్టపోయి 78,782 వ‌ద్ద‌, నిఫ్టీ 309 పాయింట్ల న‌ష్టంతో 23,995 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. రియ‌ల్టీ, OIL & GAS రంగాలు 2%పైగా న‌ష్ట‌పోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, స‌హా అన్నిరంగాల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. సెన్సెక్స్‌లో 25 Stocks రెడ్‌లో ముగిశాయి.

News November 4, 2024

WORLD RECORD: గుమ్మడికాయపై 70kmల ప్రయాణం

image

USకి చెందిన గ్యారీ క్రిస్టెన్సేన్ విచిత్రమైన రికార్డు నెలకొల్పారు. 2011 నుంచి గుమ్మడికాయలు సాగు చేస్తున్నారు. అయితే సాధారణ సాగు కాదండోయ్.. బోట్‌గా ఉపయోగించగలిగేంత పెద్ద గుమ్మడికాయ(555kg)ను పండించి తన జీవితకాల కలను సాకారం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా కొలంబియా నది‌లో 24hrsలో 73.5kmలు ప్రయాణించి గుమ్మడికాయపై సుదీర్ఘ ప్రయాణం చేసిన రికార్డును నెలకొల్పారు.

News November 4, 2024

నాసిరకం EV బ్యాటరీ.. OLAకి రూ1.7 లక్షలు ఫైన్

image

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో నాసిరకం బ్యాటరీలను వాడుతున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సునీల్ అనే వ్యక్తి నాసిరకం బ్యాటరీపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నోటీసులిచ్చినా సంస్థ పట్టించుకోలేదు. దీంతో రూ.1.73లక్షలు జరిమానా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఓలాను ఆదేశించింది. అతను పడిన మానసిక క్షోభకు రూ.10వేలు అదనంగా చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.

News November 4, 2024

శీతాకాల స‌మావేశాల్లో వ‌క్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం!.. ఎన్డీయే ప్రయత్నాలు

image

శీతాకాల స‌మావేశాల్లో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు పార్ల‌మెంటు ఆమోదం పొందేలా ఎన్డీయే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అమిత్ షా కూడా ఈ మేరకు గతంలో నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. న‌వంబ‌ర్ 25 నుంచి డిసెంబ‌ర్ 20 వ‌ర‌కు శీతాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు కూడా స‌భ ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ రెండు బిల్లుల‌పైనే కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

News November 4, 2024

మూసీ నది పరివాహక ప్రాంతాల్లో రేవంత్ పాదయాత్ర!

image

TG: మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ యాదాద్రి ఆలయంలో పూజలు చేయనున్నారు. అదే రోజు భువనగిరి నుంచి వలిగొండ వైపు నది వెంబడి ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉంది. అలాగే భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పైపులైన్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

News November 4, 2024

ఐబీపీఎస్ RRB మెయిన్స్ ఫలితాలు విడుదల

image

ఐబీపీఎస్ RRB పీవో మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.ibps.in వెబ్‌సైట్‌‌లో లాగిన్ అయి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1 2 ,3 ఉద్యోగాలకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మెయిన్స్ ఎగ్జామ్‌ను ఐబీపీఎస్ నిర్వహించింది. మెయిన్స్‌లో పాసైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది.

News November 4, 2024

తెలుగు గడ్డ నా మెట్టినిల్లుతో సమానం: కస్తూరి

image

తాను తెలుగు వారికి వ్యతిరేకంగా <<14525601>>మాట్లాడానంటూ<<>> DMK పార్టీకి చెందిన వారు ఫేక్ ప్రచారం చేస్తున్నారని నటి కస్తూరి అన్నారు. తెలుగు గడ్డ తనకు మెట్టినిల్లుతో సమానమని, తెలుగు వాళ్లను కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. తన వ్యాఖ్యలను తమిళ మీడియాలో వక్రీకరించి చూపిస్తున్నారని ఆమె చెప్పారు. తెలుగు ప్రజల ప్రేమను తనకు దూరం చేసేందుకే కొందరు కుట్ర చేశారని పేర్కొన్నారు. ఆమె కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు.

News November 4, 2024

Ecommerce Festive Sales: నెల రోజుల్లో రూ.లక్ష కోట్లు

image

ఈ పండగ సీజన్లో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ సేల్స్ ఏకంగా రూ.లక్షకోట్లు దాటేశాయి. నాన్ మెట్రో కస్టమర్ల నుంచి ప్రీమియం బ్రాండ్లకు డిమాండ్ పెరిగిందని డాటమ్ ఇంటెలిజెన్స్ తెలిపింది. దీంతో సేల్స్ 23% వృద్ధితో రూ.81వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెరిగాయంది. సీజన్ మొదటి వారంలోనే సగం అమ్మకాలు నమోదయ్యాయని, స్మార్ట్ ఫోన్లు, గ్రాసరీ, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్, కిచెన్ ఐటెమ్స్ ఎక్కువగా అమ్ముడయ్యాయని పేర్కొంది.

News November 4, 2024

లోయలో పడిన బస్సు.. 36కు చేరిన మృతులు

image

ఉత్తరాఖండ్‌ అల్మోరాలోని మార్చుల వద్ద లోయలో బస్సు పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరుకుంది. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. NDRF, SDRF, స్థానిక పోలీసులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. కాగా, సీఎం పుష్కర్ సింగ్ ధామి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

News November 4, 2024

గబ్బర్ సింగ్ హోంమంత్రి అయితే..?

image

‘నేను హోంమంత్రి అయితే పరిస్థితి మరోలా ఉంటుంది’ అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాదు, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. వరుస ఘటనలపై ఆవేదనతోనే ఆయన అన్నారా? లేక ఇతర కారణాలున్నాయా? అనేది మున్ముందు తెలియనుంది. కానీ రీల్ లైఫ్ గబ్బర్ సింగ్ రియల్ లైఫ్‌లో హోం మినిస్టర్ అయితే? పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.