India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి శాంతి ప్రియా పాండే దీనికి నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ సహా నలుగురు అధికారులు ఉండనున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 మెగా వేలం ఈనెల 24 & 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరగనుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోందని, త్వరలో ప్రకటన చేస్తుందని వెల్లడించాయి. అయితే, అదే సమయంలో ఈనెల 22-26 వరకు పెర్త్‌లో ఆస్ట్రేలియాతో భారత్ మొదటి టెస్టును ఆడనుంది. ఈ మ్యాచ్ ప్రసారంతో పాటు IPL వేలం ఈవెంట్ ప్రసారం చేయడంలో హాట్‌స్టార్ ఇబ్బందిపడే అవకాశం ఉంది.
హాలీవుడ్ సంగీత నిర్మాత, మ్యూజిక్ లెజెండ్ క్విన్సీ జోన్స్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల జోన్స్ చనిపోయినట్లు కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. మైఖేల్ జాక్సన్, ఫ్రాంక్ సినాట్రా, రే చార్లెస్ వంటి స్టార్లతో ఆయన పనిచేశారు. 1982లో జాక్సన్‌తో థ్రిల్లర్ ఆల్బమ్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించారు. జోన్స్ 80 సార్లు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డులకు నామినేట్ అవ్వగా 28 సార్లు గెలుపొందారు.
హైదరాబాద్‌కు నీళ్లు అందించే వనరుల్లో ఒకటైన హిమాయత్ సాగర్‌పై హైడ్రా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా FTL, బఫర్ జోన్‌లను గుర్తించనున్నట్లు సమాచారం. రెండో విడతగా ORR పరిధిలోని 549 చెరువులపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ప్రతి చెరువు హద్దులు గుర్తించి జియో ట్యాగింగ్ చేయబోతున్నారు.
AP: CRDA అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలపై టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికపై వారితో చర్చిస్తున్నారు. కమిటీ సూచనలు, అదనపు ఆర్థిక భారంపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. మళ్లీ అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్మాణ సంస్థలతో వివాదాల పరిష్కారానికి చర్యలపై సమీక్షిస్తున్నారు.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన అర్హులు. స్కూలు అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందేందుకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో టీచర్లు పనిచేస్తున్న వారు సైతం దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
AP: రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ ఇక్కడ సాగునీటి రంగాన్ని పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్‌ను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కర్నూలు ఉల్లి మార్కెట్‌ను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గతేడాది OCTలో మార్కెట్‌కు 52వేల టన్నుల ఉల్లి వస్తే ప్రస్తుతం 2.5 లక్షల టన్నులు వచ్చిందన్నారు. ఈసారి రైతులు అధిక ధరను పొందారని చెప్పారు.
తన భార్య ఎదుట ‘అంకుల్’ అని పిలిచిన షాప్‌కీపర్‌ను ఓ వ్యక్తి చితకబాదిన ఘటన MP భోపాల్‌లో జరిగింది. రోహిత్ అనే వ్యక్తి భార్యతో కలిసి చీర కొనడానికి ఓ షాప్‌కు వెళ్లాడు. ఏ ధరలో కావాలని షాప్‌కీపర్ అడగగా తన కెపాసిటీని తక్కువగా అంచనా వేయొద్దని రోహిత్ వార్నింగ్ ఇచ్చాడు. ‘మరిన్ని చీరలు చూపిస్తా అంకుల్’ అని అతను అనడంతో గొడవ జరిగింది. కాసేపటికి స్నేహితులతో వచ్చి అతడిని చావబాదాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
AP: గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ నిర్వహిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. త్వరలోనే NTR జిల్లా మూలపాడు క్రికెట్ స్టేడియంలోని రెండో గ్రౌండ్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక్కడ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లోనూ క్రికెట్ మైదానాలు ఏర్పాటుచేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
టాలీవుడ్ నటుడు నిఖిల్, రుక్మిణి వసంత్ జంటగా నటిస్తోన్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, తాజా ఇంటర్వ్యూలో ఇది రెగ్యులర్ మూవీలా ఉండదని, స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని నిఖిల్ చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
Sorry, no posts matched your criteria.