India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా అంతకుముందు వైజాగ్ ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం లభించింది. కాసేపట్లో కార్మికులతో ముఖాముఖీ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసా హోల్డర్ల పిల్లలకు జన్మత: పౌరసత్వం నిరోధించే బిల్లును రిపబ్లికన్ సెనేటర్లు కొందరు US సెనేట్లో ప్రవేశపెట్టారు. అక్రమ వలసలు, జాతీయ భద్రత బలహీనతకు బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ దోపిడీయే కారణమని సెనేటర్లు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రూడ్, కేటీ బ్రిట్ అంటున్నారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో దీనికి తెరపడుతుందన్నారు. ఇకపై నిర్దేశించిన తేదీ తర్వాత పుట్టే పిల్లలకే బర్త్‌రైట్ ఉండదు.

USలోని వాషింగ్టన్‌లో రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన <<15306564>>విమాన ప్రమాదంలో<<>> ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు బయటపడ్డాయి. విమానంలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఎవరూ బతికి ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. విమాన శకలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రత -1 నుంచి -2 సెల్సియస్ మధ్య ఉంది. ఈ పరిస్థితుల్లో మనుషులు 30-90 నిమిషాలు మించి జీవించలేరని నిపుణులు చెబుతున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ తన తల్లి లివి సురేశ్ బాబును గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘అమ్మా, నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమతో పాటు నా కలలను సాకారం చేసుకునే శక్తినిచ్చావు. నువ్వు నన్ను వదిలి వెళ్లిపోలేదమ్మా. ఎప్పుడూ నా హృదయంలో, నా ప్రతి అడుగులో ఉంటావు. మీ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. నువ్వే నా బలం అమ్మా’ అని ఫేస్‌బుక్ పోస్టులో రాసుకొచ్చారు.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని షరతు పెట్టింది. పాస్ పోర్టులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని ఇద్దరినీ ఆదేశించింది. ఇదే కేసులో తిరుపతన్నకు కూడా కోర్టు ఇటీవలే బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహీరా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇటీవల ఆశా భోస్లే మనవరాలు, సింగర్ జనై భోస్లేతో సిరాజ్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆమె తనకు సోదరిలాంటిదని సిరాజ్ చెప్పడంతో ఆ వదంతులకు తెరపడింది.

హీరోలు శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీల మధ్య టైటిల్స్ వివాదం నెలకొంది. విజయ్ తెలుగులో, శివ తెలుగు, తమిళ భాషల్లో ‘పరాశక్తి’ పేరుతో రానున్నారు. బిచ్చగాడు హీరో PARASHAKTHI స్పెల్లింగ్‌తో రిజిస్టర్ చేస్తే ‘డాక్టర్’ స్టార్ PARASAKTHI అని పేర్కొన్నారు. వేర్వేరు సినీ కౌన్సిళ్లలో భిన్న స్పెల్లింగుల కారణంగా ఈ వివాదం మొదలైంది. దీంతో కౌన్సిల్స్ బేసిక్ చెకింగ్స్ చేయాలి కదా అని సినీ జనాలు పెదవి విరుస్తున్నారు.

రంజీ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు అదరగొట్టారు. 2 పరుగులకే 6 వికెట్లు కూల్చేశారు. శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ సహా 4, మోహిత్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, అర్పిత్ సుభాష్ 2 పరుగులు చేశారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్ చేతిలో ముంబై అనూహ్యంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శార్దూల్ సెంచరీ చేశారు.

TG: సిద్దిపేట(D) అక్కన్నపేట(M) గోవర్ధనగిరిలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బండరాళ్లు మీద పడి తల్లి, కూతురు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

USలోని వాషింగ్టన్‌లో 60 మంది ప్రయాణికులతో వెళ్తోన్న పీఎస్ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే, గతంలోనూ 1982లో ఈ ప్రమాద స్థలానికి దగ్గరలో జరిగిన ఘటనను అమెరికన్లు గుర్తుచేసుకుంటున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంతో ఎయిర్ ఫ్లోరిడా విమానం పోటోమాక్ నదిలో కూలడంతో 78 మంది మరణించారు. తాజా ప్రమాదానికి ఇలాంటిదేమైనా కారణమై ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు.
Sorry, no posts matched your criteria.