News November 3, 2024

రుషికొండ భవనాలపై తప్పుడు ప్రచారం: మాజీ మంత్రి అమర్నాథ్

image

AP: రుషికొండ భవనాలు జగన్ ఇల్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ‘అలాంటి భవనం కట్టలేకపోయామనే బాధలో చంద్రబాబు ఉన్నట్లున్నారు. మా ప్రభుత్వ విధానంలో భాగంగానే వాటిని నిర్మించాం. ఇది జగన్ ఆస్తి అని మీరు చెప్పగలరా? ఆ భవనాలు మీరు ఎలా వినియోగిస్తారో మీ ఇష్టం. వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది’ అని దుయ్యబట్టారు.

News November 3, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

News November 3, 2024

రేపు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్

image

నిఖిల్ సిద్దార్థ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. ఈనెల 8న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా స్వయంభు, ఇండియా హౌస్ అనే రెండు సినిమాలు కూడా రూపొందుతున్నాయి.

News November 3, 2024

సిరీస్ క్లీన్‌స్వీప్‌పై సచిన్ తీవ్ర అసంతృప్తి

image

సొంతగడ్డపై భారత్ 3-0తో ఓడిపోవడంపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ ఓటమి జీర్ణించుకోలేనిది. ఓసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది ప్రిపరేషన్ లోపమా? పేలవమైన షాట్ ఎంపికనా? లేక ప్రాక్టీస్ లోపమా? తొలి ఇన్నింగ్స్‌లో గిల్ నిలకడగా రాణించారు. రెండు ఇన్నింగ్సుల్లోనూ పంత్ ప్రదర్శన బాగుంది. అతడి ఆట పూర్తిగా భిన్నంగా అనిపించింది. సిరీస్ అంతా నిలకడగా ఆడిన NZకు పూర్తి క్రెడిట్ దక్కుతుంది’ అని ట్వీట్ చేశారు.

News November 3, 2024

బాధితులకు వైసీపీ రూ.10 లక్షల సాయం

image

AP: పలాసలో ఇటీవల లైంగిక దాడికి గురైన మైనర్ బాలికలకు వైసీపీ అండగా నిలిచింది. వారి కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులను అందించింది. పలాసలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు ఇందుకు సంబంధించిన చెక్కులను వారికి అందజేశారు.

News November 3, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ కమిషన్ వేయాలి?: KTR

image

TG: సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారని రాష్ట్ర ప్రభుత్వాన్ని KTR ప్రశ్నించారు. ‘కాళేశ్వరంపై కమిషన్ వేసిన మీపై ఇప్పుడు ఏ కమిషన్ వేయాలి? ఢిల్లీ నేస్తం – అవినీతి హస్తం’ అంటూ Xలో విమర్శలు చేశారు. ఉచిత చేపల పంపిణీ చేయకుండా మత్స్యకారుల జీవితాల్లో రేవంత్ సర్కార్ మట్టికొట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పథకాలు నామరూపాలు లేకుండా పోయాయని అన్నారు.

News November 3, 2024

ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే ఆరోగ్య బీమా తీసుకోండి!

image

సామాన్యుల‌కు గ‌త 10-20 ఏళ్ల కింద‌ట వైద్య ఖ‌ర్చులు ఏ మేర‌కు ఉండేవి? ఇప్పుడు ఎంత అవుతున్నాయన్న‌ది ఆలోచిస్తే భ‌విష్య‌త్తులో ఖ‌ర్చులు ఇంకెంత పెర‌గ‌వ‌చ్చ‌న్నది అర్థమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే ఆరోగ్య బీమా తీసుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని స‌ల‌హా ఇస్తున్నారు. వ‌య‌సు పెరిగాక తీసుకుంటే అధిక ప్రీమియం, త‌క్కువ క‌వ‌రేజీ వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వ్వచ్చని చెబుతున్నారు.

News November 3, 2024

ఒకే దేశం-ఒకే ఎన్నికకు మేం వ్యతిరేకం: దళపతి విజయ్ పార్టీ తీర్మానం

image

జమిలి ఎన్నిక‌లకు వ్య‌తిరేకంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ స్థాపించిన త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం తీర్మానం చేసింది. ఇటీవ‌లే మొద‌టి రాష్ట్ర స్థాయి స‌మావేశాన్ని నిర్వ‌హించిన ఆ పార్టీ జాతీయ స్థాయిలో ముడిపడిన అంశాల ప‌ట్ల తన వైఖ‌రిని వెల్ల‌డించింది. అలాగే NEETను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తూ పార్టీ కార్య‌నిర్వాహ‌క మండ‌లి తీర్మానం చేసింది. ఇక కుల‌గ‌ణన నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై డీఎంకే, బీజేపీల తీరును త‌ప్పుబ‌ట్టింది.

News November 3, 2024

భారత్ WTC ఫైనల్ చేరడం సాధ్యమేనా?

image

WTC ఫైనల్ రేసులో టాప్ గేర్‌లో దూసుకెళుతున్న భారత జట్టుకు న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్‌తో షాకిచ్చింది. ఒక్క సిరీస్ ఓటమితో పరిస్థితి మొత్తం తలకిందులైంది. ఇప్పుడు భారత్ WTC ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 4-0తో గెలవాలి. ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఒక్క టెస్టు ఓడించడమే కష్టం.. అలాంటిది సిరీస్ గెలవాలంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇలా చూస్తే భారత్ WTC ఫైనల్ చేరడం కష్టమే!.

News November 3, 2024

ప్రతి మ‌హిళ‌కు నెల‌కు ₹2,100: BJP హామీ

image

ఝార్ఖండ్ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను విడుద‌ల చేసిన BJP ప్ర‌తి మ‌హిళ‌కు నెలకు ₹2,100 ఆర్థిక‌సాయం హామీ ఇచ్చింది. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్‌తోపాటు ఏడాదికి 2 ఉచితం *పార‌ద‌ర్శ‌కంగా 2.87 లక్షల ప్ర‌భుత్వ ఖాళీల భ‌ర్తీ *ఐదేళ్లలో యువతకు 5 లక్షల స్వయం ఉపాధి అవకాశాలు *గిరిజ‌న వ‌ర్గాల‌ను మినహాయించి యూనిఫాం సివిల్ కోడ్ అమ‌లు *చొర‌బాటుదారులు గిరిజ‌న మ‌హిళ‌ను వివాహం చేసుకుంటే గిరిజ‌న కేటగిరీ నిరాక‌ర‌ణ.