News November 3, 2024

హాంకాంగ్ సిక్సెస్ విజేత ఎవరంటే?

image

హాంకాంగ్ సిక్సెస్ 2024 విజేతగా శ్రీలంక నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 5.2 ఓవర్లలో 72 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. శ్రీలంక బ్యాటర్లలో వీరక్కొడి(13 బంతుల్లో 34), మధుశంక(5 బంతుల్లో 19), రత్నాయకే(4 బంతుల్లో 16) పరుగులు చేశారు. ఈ ట్రోఫీలో భారత్ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది.

News November 3, 2024

రాహుల్‌ను వ‌య‌నాడ్ ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారు: ప‌్రియాంకా గాంధీ

image

రాహుల్‌కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్పుడు స‌త్యం కోసం పోరాడుతున్న‌ ఆయ‌న్ను వ‌య‌నాడ్ ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌ని ప్రియాంకా గాంధీ అన్నారు. ఆదివారం మనంతవాడి స‌భ‌లో ఆమె మాట్లాడుతూ స్థానిక ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చేలా వైద్య స‌దుపాయాలు, రోడ్లు, ఉపాధి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. మోదీ వ్యాపారవేత్తల కోసం మినహా ప్రజల కోసం పనిచేయరని విమర్శించారు.

News November 3, 2024

యూపీ సీఎంకు బెదిరింపులు.. పోలీసుల అదుపులో మహిళ

image

UP CM యోగీని హ‌త్య చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిన మ‌హిళను మ‌హారాష్ట్ర యాంటీ టెర్ర‌రిజ‌మ్ స్క్వాడ్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని ఉల్హాస్‌న‌గ‌ర్‌కు చెందిన ఫాతిమా ఖాన్ ఈ బెదిరింపులు పంపిన‌ట్టు గుర్తించి ఆమెను స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే ఆమె మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు. త‌దుప‌రి విచారణ, ప‌రీక్ష‌ల నిమిత్తం ఆమెను ముంబై తరలించారు.

News November 3, 2024

వైట్‌వాష్ అవ్వడంపై ఫ్యాన్స్ అసంతృప్తి!

image

సొంతగడ్డపై సిరీస్ క్లీన్‌స్వీప్ అవ్వడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. టీ20, వన్డే మ్యాచులు ఆడే టీమ్‌తో టెస్టు ఆడిస్తే ఫలితం ఇలానే ఉంటుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 3 టెస్టుల సిరీస్‌లో సొంతగడ్డపై భారత్ తొలిసారి క్లీన్‌స్వీప్ అయిందని, ఇది తమకు హార్ట్ బ్రేకింగ్‌గా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కోచ్ గంభీర్ వల్లేనని, టెస్టులకు ఆయన ఆలోచనలు పనికిరావంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. మీ కామెంట్?

News November 3, 2024

తరచూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

image

కొందరు అదే పనిగా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. కానీ అలా తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుందని, బలహీనంగా మారి విరిగిపోయే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫీన్ వల్ల శరీరంలోని కాల్షియం శోషించుకుపోతుంది. ఫలితంగా ఎముకలు పెళుసుబారుతాయి. చక్కెర కూడా ఎక్కువగానే ఉండటంతో మూత్ర విసర్జన చేసినప్పుడు కాల్షియం బయటకు పోతుంది.

News November 3, 2024

ఈ పరాభవం తప్పెవరిది?

image

భారత్ తొలిసారి సొంతగడ్డపై 3-0తో టెస్ట్ సిరీస్‌ కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో గౌతం గంభీర్‌ కోచింగ్‌పై, రోహిత్‌శర్మ కెప్టెన్సీతో పాటు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపైనా తీవ్ర విమర్శలొస్తున్నాయి. సిరీస్‌కు ముందు ‘అవసరమైతే టెస్టుల్లో ఒకేరోజు 400 కొడతాం, 2 రోజులు బ్యాటింగ్ చేస్తాం’ అని గంభీర్ చెప్పిన మాటలు చేతల్లో కనిపించలేదు. రోహిత్ కెప్టెన్సీలోనూ పస కనిపించలేదు. తప్పెవరిదని మీరు భావిస్తున్నారు?

News November 3, 2024

ఈ సినిమాల టైటిల్ ఒక్క అక్షరమే

image

కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా టైటిల్‌ ప్రకటన నాటి నుంచే ఆసక్తి నెలకొంది. అయితే ఇలా సింగిల్ లెటర్‌ టైటిల్‌తో గతంలోనూ సినిమాలు వచ్చాయి. మహేశ్‌బాబు మూవీ ‘1’(వన్ నేనొక్కడినే), నాని సినిమా ‘వీ’, విక్రమ్ ‘ఐ’, రాజమౌళి-నితిన్ ‘సై’, ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ‘అ’, ధనుష్-శృతిహాసన్ ‘3’, మంచు విష్ణు ‘ఢీ’ ఈ కోవలోకే వస్తాయి. మీకు తెలిసిన ఇలాంటి మూవీస్ పేర్లు కామెంట్ చేయండి.

News November 3, 2024

కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించలేకపోయా: రోహిత్

image

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ తాను అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయానని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఈ సిరీస్ ఓటమి తనను బాధిస్తుందని చెప్పారు. జట్టుగానూ సరైన ప్రదర్శన చేయలేకపోయామని, పరాజయాలకు ఇదే కారణమని పేర్కొన్నారు. తొలి ఇన్నింగ్సులో మరో 30 పరుగులు చేయాల్సి ఉందన్నారు. అయితే NZ తమకంటే మెరుగ్గా ఆడిందని, ఓటమిని స్వీకరిస్తున్నామని తెలిపారు.

News November 3, 2024

సూపర్ సిక్స్ కాదు.. సూపర్ చీటింగ్: రోజా

image

AP: చంద్రబాబు అమలు చేసేది సూపర్ సిక్స్ కాదని, సూపర్ చీటింగ్ అని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఆదివారం జరిగిన YCP కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘అబద్ధాలు చెప్పి చంద్రబాబు CM అయ్యారు. ఓట్లేసిన జనాన్ని మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు నట్టేట మునిగిపోయారు. పాలిచ్చే ఆవును వదులుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.

News November 3, 2024

మూడు రోజుల్లోనే రూ.107 కోట్ల కలెక్షన్లు

image

తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ సినిమా వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లోనే రూ.107 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన నాలుగో తమిళ నటుడిగా శివ కార్తికేయన్ నిలిచారు. ఈ ఘనత సాధించిన సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్, కమల్ హాసన్ సరసన SK చేరారు. ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మించారు.