News November 3, 2024

న్యూజిలాండ్.. వాట్ ఎ కంబ్యాక్

image

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు విజయం నల్లేరు మీద నడకే అని ఫ్యాన్స్ భావించారు. దీనికి కారణం టీమ్ ఇండియా ప్రదర్శనతో పాటు శ్రీలంక చేతిలో కివీస్ దారుణంగా ఓడిపోవడమే. ఆ సిరీస్‌‌లో 2 మ్యాచులు ఓడిన NZ రెండో టెస్టులో ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ప్రదర్శనతో భారత్ చేతిలోనూ ఓటమి తప్పదనుకున్నా అంచనాలను తలకిందులు చేస్తూ 3 టెస్టులు గెలిచి సరికొత్త చరిత్ర లిఖించింది.

News November 3, 2024

కాబోయే భార్యను బాగా చూసుకో: బ్యాడ్మింటన్ స్టార్‌కి రష్మిక సూచన

image

భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్యను పెళ్లాడబోతున్నారు. ఈ క్రమంలో వీరు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ‘శ్రీకాంత్.. శ్రావ్య మేడమ్‌ను బాగా చూసుకో. ఇకపై ఆమె నీదే. ఓకేనా’ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై శ్రీకాంత్ స్పందిస్తూ ‘మహారాణిలా చూసుకుంటా’ అని రిప్లై ఇచ్చారు.

News November 3, 2024

WTC: రెండో స్థానానికి పడిపోయిన భారత్

image

న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా రెండో స్థానానికి పడిపోయింది. పాయింట్ల పరంగా ఆస్ట్రేలియా కన్నా ఎక్కువే ఉన్నప్పటికీ టీమ్ ఇండియా PCT(58.33) తగ్గింది. దీంతో ఆస్ట్రేలియా(62.5) మొదటి స్థానంలో నిలిచింది. కాగా WTC ఫైనల్ చేరాలంటే భారత్‌కు BGTలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News November 3, 2024

అలాంటి భవనం కట్టనందుకు సిగ్గు పడండి: అంబటి

image

AP: తమ భవనాలను కూల్చినట్లే రిషికొండను కూడా కూలుస్తావా చంద్రబాబు అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మాట్లాడారు. ‘రిషికొండ భవనాలు అద్భుతమని చంద్రబాబే చెబుతున్నారు. అమరావతిలో అలాంటి భవనం ఒక్కటి కూడా కట్టలేనందుకు ఆయన సిగ్గుపడాలి. జగన్ సంక్షేమ పథకాలతోపాటు అద్భుత భవనాలు కట్టారు. లోకేశ్ రెడ్ బుక్‌కు కుక్కలు కూడా భయపడవు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News November 3, 2024

యూనివర్సిటీలో లోదుస్తులతో యువతి హల్చల్

image

ఇరాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నిబంధనను నిరసిస్తూ ఓ యువతి హల్చల్ చేశారు. లోదుస్తులతో వర్సిటీలో తిరుగుతూ తన నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన యూనివర్సిటీ ప్రతినిధులు ఆ యువతికి మానసిక సమస్యలున్నట్లు చెప్పారు. అయితే వారి మాటలతో ఎవరూ ఏకీభవించడం లేదు.

News November 3, 2024

4.2 ఓవర్లలోనే 120 రన్స్.. భారత్‌పై ఒమన్ గెలుపు

image

హాంకాంగ్ సిక్సెస్ లీగ్‌లో భారత జట్టు మరో ఘోర పరాజయం చవిచూసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 119/3 స్కోర్ చేసింది. ఉతప్ప 13 బంతుల్లో 52 కొట్టారు. కాగా ఛేదనకు దిగిన ఒమన్ జట్టు 4.2 ఓవర్లలోనే 120/0 చేసి గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ వినాయక్ శుక్లా 11 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 రన్స్ చేశారు. భారత్ నిన్న UAE చేతిలోనూ ఓడటం గమనార్హం.

News November 3, 2024

భారత్ ఓటమి.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన NZ

image

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులోనూ భారత జట్టు ఘోరంగా ఓడింది. దీంతో 3 టెస్టుల సిరీస్‌ను 3-0తో కివీస్ క్లీన్‌స్వీప్ చేసింది. గెలుస్తారనుకున్న చివరి టెస్టులోనూ రోహిత్‌ సేన 25 రన్స్ తేడాతో ఓడింది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121కే ఆలౌట్ అయింది. పంత్(64) ఒంటరి పోరాటం చేసినా తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. భారత్ చివరిసారి 2000లో SA చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌కు గురైంది.

News November 3, 2024

పంత్‌ను నాటౌట్ ఇవ్వాల్సింది: AB డివిలియర్స్

image

న్యూజిలాండ్‌తో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్ రిషభ్ పంత్ ఔటైన తీరు వివాదంగా మారింది. దీనిపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం AB డివిలియర్స్ స్పందించారు. బ్యాటుకు బంతి తగిలిందో లేదో సందేహం ఉన్నప్పుడు ఆన్‌ఫీల్డ్ అంపైర్ <<14519397>>నిర్ణయాన్ని<<>> ఫైనల్ చేయాలని AB అన్నారు. అసలు ఇలాంటి కీలక మ్యాచ్‌లో హాట్‌స్పాట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పంత్ ఔట్‌పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News November 3, 2024

రిషభ్ పంత్‌ది ఔటా? నాటౌటా?

image

NZతో మూడో టెస్టులో IND బ్యాటర్ రిషభ్ పంత్ వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. దానిని కీపర్ బ్లండెల్ ఒడిసి పట్టినా అంపైర్ ఔటివ్వలేదు. కివీస్ DRS తీసుకోగా వారికే అనుకూలంగా వచ్చింది. రీప్లేలో బంతి తాకే సమయంలోనే బ్యాట్ ప్యాడ్‌ను కూడా తాకినట్లు కనిపిస్తోంది. పంత్ కూడా బాల్ బ్యాట్‌ను తాకలేదని అంపైర్లతో వాదించారు. ఔటివ్వడంతో క్రీజును వదల్లేక తప్పలేదు.

News November 3, 2024

ఈ సినిమా బడ్జెట్ రూ.3వేల కోట్లు!

image

సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న టామ్ క్రూజ్ ‘మిషన్: ఇంపాజిబుల్ 8’ మూవీకి భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనిని $400 మిలియన్ల(దాదాపు రూ.3వేల కోట్లు)తో నిర్మించినట్లు సినీవర్గాల సమాచారం. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2025, మే 23న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా, పాన్ ఇండియా హీరోల సినిమా బడ్జెట్ కూడా రూ.500 కోట్లు దాటుతుండటం గమనార్హం.