India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వచ్చే ఎన్నికలు 2027లోనే జరుగుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి కుంటుపడింది. సీఎం చంద్రబాబుపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ విజయం సాధిస్తుంది. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
టీ20 సిరీస్ కోసం భారత జట్టు సౌతాఫ్రికాకు బయలుదేరింది. సహచర ఆటగాళ్లతో కలిసి విమానంలో దిగిన ఫొటోను T20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవంబర్ 8 నుంచి 15 వరకు జరిగే ఈ సిరీస్‌లో 4 మ్యాచుల్లో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.
TG: మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి రేవంత్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ దుయ్యబట్టింది. గతంలో ప్రతి మహిళకు ఇచ్చే దీపావళి కానుక ఇదేనని కాంగ్రెస్ చేసిన ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఇప్పటికీ రేవంత్ హామీ అమలుకు నోచుకోలేదని మండిపడింది. ఆడబిడ్డల ఉసురు రేవంత్‌ను ఊరికే వదిలిపెట్టదని హెచ్చరించింది.
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించారు. భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ముంబైలోని వాంఖడేలో అజాజ్ 23 వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ బోథమ్ (22-వాంఖడే) రికార్డును ఆయన బ్రేక్ చేశారు. వీరిద్దరి తర్వాత రిచీ బెనాడ్ (18-ఈడెన్ గార్డెన్స్), కర్ట్నీ వాల్ష్ (17-వాంఖడే) ఉన్నారు.
AP: చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మహిళలపై నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయని విమర్శించారు. ‘సీఎం కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఓటాన్ అకౌంట్‌తోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. జగన్ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కన్నడ నటుడు, డైరెక్టర్ గురుప్రసాద్ (52) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు. 3 రోజుల క్రితం సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గురుప్రసాద్ మాత, ఇడ్డేలు మంజునాథ, రంగనాయక సినిమాలకు దర్శకత్వం వహించారు. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డునూ అందుకున్నారు. బాడీ గాడ్, కుష్క, విజిల్, హుడుగురు, మైలారీ, జిగర్తాండ తదితర మూవీల్లో నటించారు.
మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత జిల్లా గోండియాకు చెందిన జగదీశ్ ఉయికే(35) తాను టెర్రరిజంపై రాసిన పుస్తకం పబ్లిష్ చేసేందుకు అనుమతివ్వాలని PMOకు, ఇతర అధికారులకు పలుమార్లు ఈమెయిల్ పంపాడు. అక్కడి నుంచి అతడికి ఆశించిన ఫలితం రాలేదు. దీంతో నిరాశకు గురై తప్పుడు బెదిరింపులు చేయడం మొదలుపెట్టాడు. జనవరి నుంచి దాదాపు 100సార్లు విమానాలు, రైళ్లకు బాంబు బెదిరింపులు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యల్ప పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా ఆయన నిలిచారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో హిట్ మ్యాన్ 6 ఇన్నింగ్స్‌లో కలిపి 91 పరుగులే చేశారు. ఈ జాబితాలో రామ్‌చంద్ (68-1959/60), అజిత్ వాడేకర్ (82-1974), పటౌడీ (85-1974/75) తొలి 3 స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ (97-1989/90) ఉన్నారు.
ఇండియా ఏ, ఆస్ట్రేలియా ఏ మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టులో బాల్ ట్యాంపరింగ్ జరగలేదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ‘ఆటకు ముందే బంతి పాడైపోయింది. దీంతో ఈ రోజు ఆట ప్రారంభానికి ముందే ఇరు జట్ల కెప్టెన్లకు తెలియజేసి బంతిని మార్చాం. ఇది తెలియని ఇషాన్ కిషన్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు’ అని పేర్కొంది. కాగా ఇషాన్ కిషన్ సహా భారత ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు దుండగులు మెసేజ్ పంపారు. 10 రోజుల్లోగా ఆయన రాజీనామా చేయకుంటే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని చంపినట్లే యోగిని హతం చేస్తామని ఆ సందేశంలో ఉంది. మెసేజ్ ఎవరు పంపారో తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీని కాల్చి చంపిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.