India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి లక్ష మందిలో 60,092 మందికి అప్పులు ఉన్నట్లు కేంద్ర గణాంక శాఖ చేపట్టిన శాంపిల్ సర్వేలో తేలింది. దేశంలో ప్రతి లక్ష మందిలో 18,322 మందికి అప్పులు ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోనే అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రం APనేనని తెలిపింది. TGలో ప్రతి లక్ష మందిలో 54,538 మందికి అప్పులున్నట్లు తెలిపింది. అత్యల్పంగా గోవాలో ప్రతి లక్ష మందిలో 2,317 మందికే రుణాలు ఉన్నట్లు పేర్కొంది.
TG: రాష్ట్రంలో కొత్తగా 4,78,838 మంది యువ ఓటర్లు నమోదయ్యారని CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈసారి మొత్తం 8 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు కావడంతో ఓటర్ల సంఖ్య 3,34,26,323కు చేరినట్లు చెప్పారు. ఓటర్ల నమోదుకు ఈనెల 9,10న స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఉ.10 గంటల నుంచి సా.5.30 గంటల వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారన్నారు. 18 ఏళ్లు నిండినవారు ఓటుకు అప్లై చేసుకోవాలన్నారు.
న్యూజిలాండ్‌తో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 29 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్(11), జైస్వాల్(5), కోహ్లీ(1), గిల్(1), సర్ఫరాజ్(1) బంతిని ఎదుర్కోవడానికే వణికిపోయి ఔటయ్యారు. సొంతగడ్డపైనే ఇంతలా తడబడితే ఆస్ట్రేలియాతో వాళ్ల దేశంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎలా ఆడతారోననే కంగారు మొదలైంది.
తాము హిందీకి వ్యతిరేకం కాదని, అయితే బలవంతంగా తమపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. హిందీ పరిశ్రమతో మరాఠీ, గుజరాతీ, బిహారీ ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉనికిని కోల్పోతున్నాయని చెప్పారు. నార్త్ ఇండియా అంటే బాలీవుడ్ మాత్రమే గుర్తొస్తుందన్నారు. కానీ సౌత్ ఇండియాలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలు స్వతంత్రంగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.
టెస్టుల్లో భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. గత 10 ఇన్నింగ్సుల్లో కోహ్లీ 192 రన్స్ చేయగా, రోహిత్ 133 పరుగులు చేశారు. ఇవాళ కీలకమైన టెస్టులోనూ ఈ ఇద్దరూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. సొంతగడ్డపై ఇంత దారుణంగా ఆడటమేంటని భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కనీసం డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారని, ఆస్ట్రేలియాపై ఎలా రాణిస్తారని ప్రశ్నిస్తున్నారు.
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఇవాళ సందర్శించనున్నారు. విద్యుత్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించడంతో పాటు యూనిట్ వన్ ట్రయల్ రన్ ప్రారంభిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మరో రెండ్రోజుల్లో అమెరికా ఎన్నికలు జరగనుండగా విజయం తమదంటే తమదని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అట్లాస్ నేషనల్ పోల్ సర్వే ఫలితాలను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా, నెవడా, విస్కన్సిన్, మిచిగాన్, పెన్సిల్‌వేనియాలోని ఓటర్లు తనకే జై కొట్టారని తెలిపారు. అయితే, ఈ ఓటింగ్ మార్జిన్ చాలా తక్కువ ఉండటం గమనార్హం.
భారత ఆల్‌రౌండర్ జడేజా సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకున్నారు. తన కెరీర్‌లో తొలిసారిగా ఒక టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ ఐదేసి వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో జడేజా తన సెకండ్ బెస్ట్(10/120) ప్రదర్శన కూడా కనబర్చారు. కాగా ఈ సిరీస్‌లో జడేజా మొత్తంగా 16 వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ కూడా 16 వికెట్లు తీయడం గమనార్హం.
సౌదీ అరేబియాలో పురావస్తు శాస్త్రవేత్తలు 4,000 సంవత్సరాల పురాతనమైన పట్టణాన్ని కనుగొన్నారు. దాని పేరు అల్-నతాహ్‌గా గుర్తించారు. ఆ పట్టణంలో 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన గోడ ఉంది. క్రీ.పూ 2400లో అక్కడ 500 మంది నివాసితులున్నట్లు తెలుస్తోంది. మనిషి సంచార జీవనశైలి నుంచి పట్టణ జీవనశైలికి క్రమంగా మారడాన్ని ఇది వివరిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
బుక్ చేసుకున్న బైక్ రైడ్ క్యాన్సిల్ చేసిందని కోల్‌కతాలో వైద్యురాలిపై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆమె ఓ యాప్‌లో బైక్ బుక్ చేసుకుంది. అది రావడానికి ఆలస్యం కావడంతో క్యాన్సిల్ చేసింది. దీంతో ఆ రైడర్ ఆమెకు 17సార్లు ఫోన్ చేయడమే కాకుండా వాట్సాప్‌కు అశ్లీల వీడియోలు పంపి, తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.