News November 3, 2024

WOW.. ఒకే కుటుంబంలో ఐదుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు

image

TG: ఈ కాలంలో ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం రావడమే గొప్ప విషయంగా భావిస్తున్నారు. అలాంటిది సంగారెడ్డి(D)లోని ఓ కుటుంబంలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. రాయికోడ్‌కు చెందిన రాఘవరెడ్డి, శోభమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ముగ్గురు టీచర్, ఇద్దరు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు సాధించారు. కాగా తండ్రి రిటైర్ట్ పోస్ట్ మాస్టర్ కావడం గమనార్హం.

News November 3, 2024

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సర్వ దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

News November 3, 2024

అది నన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది: నోరా

image

తాను కెరీర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ అన్నారు. ‘నిజానికి ఎవరూ నీకోసం ఏదీ ఫ్రీగా చేయరు. మీ నుంచి ఏదో ఒకటి కోరుకుంటారు. కెరీర్ మొదట్లో నాకు హెల్ప్ చేస్తానని ఎవరు వచ్చినా వాళ్లను దేవుడే పంపించాడని నేను నమ్మాను. అలా కొందరు మూర్ఖుల వెంట వెళ్లాను. అది నన్ను విపత్కర పరిస్థితుల్లోకి నెట్టింది. సినిమాలు రాకపోవడంతో ఒకానొక సమయంలో థెరపీ అవసరమైంది’ అని IFFMలో అన్నారు.

News November 3, 2024

హైదరాబాద్ చేరుకున్న నారా లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. వారంపాటు ఆయన యూఎస్‌లో పర్యటించారు. పరిశ్రమల ఏర్పాటుపై అక్కడి కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. బ్లూ ప్రింట్‌తో వచ్చే కంపెనీలకు వెంటనే అనుమతులు ఇస్తామని ప్రకటించారు. పలు కంపెనీల ప్రతినిధులకు పెట్టుబడులపై నమ్మకం కలిగించారు. ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా అక్కడి పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు.

News November 3, 2024

తీవ్ర వివాదంలో ఇషాన్ కిషన్!

image

ఆస్ట్రేలియా-A, ఇండియా-A మ్యాచ్‌‌లో ఇషాన్ కిషన్ బంతి మార్పుపై అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. మార్చిన బంతితోనే ఆడాలని అంపైర్ చెప్పగా కిషన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘తెలివితక్కువ నిర్ణయం’ అని కామెంట్స్ చేశారు. ‘మీ వల్లే బంతి దెబ్బతింది. మీ ప్రవర్తన అనుచితం’ అని ఇషాన్‌కు అంపైర్ వార్నింగ్ ఇచ్చారు. అంపైర్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు నిజమని తేలితే ఇషాన్‌, పలువురు ఆటగాళ్లపై వేటు పడే ప్రమాదం ఉంది.

News November 3, 2024

అమెరికాలో భారత ఓటర్లు ఎంత మందో తెలుసా?

image

అమెరికాలో మెక్సికన్ల తర్వాత ఎక్కువ మంది వలసదారులు ఇండియాకు చెందినవారే ఉన్నారు. అగ్రరాజ్యంలో ప్రస్తుతం 52 లక్షల మంది ఇండో-అమెరికన్స్ ఉండగా, ఇందులో 26 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. చాలా ఏళ్లుగా వీరు డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఓట్లు గంపగుత్తగా డెమొక్రటిక్ పార్టీకి పడే అవకాశం లేదని, యువతలో చాలా మంది ట్రంప్ వైపు చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

News November 3, 2024

ఢిల్లీలో మరింత పడిపోయిన వాయు నాణ్యత

image

దేశరాజధాని ఢిల్లీని కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగ ముగిసిన రెండు రోజులకు అక్కడ వాయు నాణ్యత మరింత క్షీణించింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ WHO సూచించిన పరిమితి కంటే 65 రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఉ.5గంటలకు AQI 507 పాయింట్లతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

News November 3, 2024

విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ కలకలం

image

ఇండిగో, ఎయిరిండియా విమానాలకు మరో సారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. చెన్నై-హైదరాబాద్ ఎయిరిండియా, హైదరాబాద్-పుణే ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు గోవా-కోల్‌కతా విమానానికి ఇదే తరహా బెదిరింపులు రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.

News November 3, 2024

‘కాంతార-2’ కోసం రంగంలోకి RRR యాక్షన్ కొరియోగ్రాఫర్

image

కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టి మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ‘RRR’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్ పని చేయనున్నారు. ‘కాంతార’కు మించి సినిమాటిక్ క్వాలిటీని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే టోడర్‌ను తీసుకున్నారు రిషబ్. RRRలో యాక్షన్స్ సీక్వెన్స్‌తో ఆకట్టుకున్న టోడర్ కాంతారను ఎలా చూపిస్తారో చూడాలి మరి.

News November 3, 2024

ALERT.. పొంచి ఉన్న మరో వాయుగుండం

image

AP: ఇవాళ ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., బాపట్ల, ప్రకాశంతో పాటు రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఈ నెల రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.