India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: డిసెంబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంక్రాంతిలోపు పంచాయతీలకు కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లు వస్తారని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సర్పంచుల పాలన ముగిసింది. వారి స్థానంలో ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. కాగా కులగణన ఆధారంగా సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘మా అమ్మ శ్యామలా గోపాలన్ హారిస్ 19 ఏళ్ల వయసులో ఇండియా నుంచి అమెరికా వచ్చారు. ఆమె ధైర్యం, అంకితభావం వల్లే ప్రస్తుతం నేనిలా ఉన్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, అమెరికాలో ప్రవాస భారతీయ ఓటర్లు 26 లక్షల వరకు ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారు కీలకంగా మారనున్నారని విశ్లేషకుల అభిప్రాయం.
డిజిటల్ అరెస్టుల మోసాలపై తమ ఖాతాదారులకు HDFC కీలక సూచనలు చేసింది. ‘నిజమైన ప్రభుత్వ అధికారులెవరూ ఫోన్లలో బ్యాంకు వివరాలు అడగరు. కాల్ చేసి మీ ఆధార్, పాన్ ఈ-కేవైసీ, బ్యాంక్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అడిగినా స్పందించొద్దు. డెబిట్, క్రెడిట్ కార్డుల నంబర్లు, CVV, పిన్, OTPలాంటివి షేర్ చేయొద్దు. మీకు వచ్చే లింకులు, వెబ్‌సైట్ల పేర్లలో తప్పులుంటాయి. వాటిని గమనిస్తే సైబర్ మోసాలను అడ్డుకోవచ్చు’ అని తెలిపింది.
AP: ఉచిత సిలిండర్ పథకానికి అర్హతపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు అధికారులు సమాధానాలిచ్చారు. తప్పనిసరిగా ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉంటేనే లబ్ధి పొందగలరని చెప్పారు. అయితే కుటుంబ సభ్యులలో ఎవరి పేరిట కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే సరిపోతుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరిట గ్యాస్ కనెక్షన్ ఉన్నా పథకం వర్తిస్తుంది. ఇక గ్యాస్ రాయితీ పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి.
మహారాష్ట్రలో మరోసారి ‘మహాయుతి’ని అధికారంలోకి తెచ్చేందుకు BJP వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా PM మోదీ రంగంలోకి దిగనున్నారు. ఈనెల 8-14 మధ్య ఆయన 11 ర్యాలీల్లో పాల్గొననున్నారు. ‘మహాయుతి’ చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించనున్నారు. BJP, శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం), అజిత్ పవార్ నేతృత్వంలోని NCP మహాయుతిగా ఏర్పడి, కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. NOV 20న MH ఎలక్షన్స్ జరుగుతాయి.
హైదరాబాద్‌లోని బాపూఘాట్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం <<14509125>>ఏర్పాటు<<>> చేయాలని TG ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ వ్యతిరేకించారు. ఈ వార్తలపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన ‘విగ్రహాల ఏర్పాటు పోటీకి నేను వ్యతిరేకిని. దయచేసి ప్రజాధనాన్ని రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నా’ అని హితవు పలికారు.
హెజ్బొల్లా కీలక సభ్యుడు జాఫర్ ఖాదర్ ఫార్‌ను దక్షిణ లెబనాన్‌లో మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. హెజ్బొల్లాకు చెందిన నాసర్ బ్రిగేడ్ రాకెట్, మిస్సైల్స్ యూనిట్‌కు జాఫర్ టాప్ కమాండర్‌గా ఉన్నట్లు తెలిపింది. గతంలో ఇజ్రాయెల్‌పై జరిగిన మిస్సైల్స్ దాడుల వెనుక ఇతడే ఉన్నట్లు పేర్కొంది. కాగా ఇటీవల హెజ్బొల్లా చీఫ్‌లుగా పనిచేసిన ఇద్దరిని IDF హతమార్చిన విషయం తెలిసిందే.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. CM హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM 43, కాంగ్రెస్ 30, RJD 6, వామపక్షాలు 3 చోట్ల పోటీ చేయనున్నాయి. షేరింగ్ ఫార్ములా ప్రకారం ధన్వర్, చత్రాపూర్, విశ్రంపూర్ స్థానాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండనుంది. మొత్తం 82 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఈనెల 13, 20న రెండు విడతల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి.
గత IPL సీజన్‌లో తమ టీమ్ తరఫున ఆడిన ప్లేయర్స్‌లో చాలామందిని మళ్లీ వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని LSG కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపారు. ఎన్నో చర్చలు, జాగ్రత్తల తర్వాతే రిటెన్షన్ లిస్ట్ తయారు చేశామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అత్యంత ప్రతిభావంతులైన ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా పూరన్‌తో పాటు రవి బిష్ణోయ్, మయాంక్, మోసిన్ ఖాన్, బదోనీని LSG అట్టిపెట్టుకుంది.
కెనడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ మంది హిందువులు భాగస్వామ్యం అయ్యేలా రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం పెరగాలని కెనడియన్ MP చంద్ర ఆర్య పిలుపునిచ్చారు. Hindu Heritage Month సందర్భంగా Parliament Hillలో ఆయన కాషాయ జెండాను ఎగురవేశారు. కెనడాలో మూడో అతిపెద్ద మత సమూహమైన హిందువులు దేశ వృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, అదేవిధంగా రాజకీయాల్లో కూడా క్రీయాశీలకంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.